Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 09/22/2023 in all areas

  1. Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 22-09-2023 Fri 15:18 | Andhra హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. "ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు.
    3 points
×
×
  • Create New...