Jump to content

Renuka Chowdhury: బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారు: రేణుకా చౌదరి


psycopk

Recommended Posts

Renuka Chowdhury: బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారు: రేణుకా చౌదరి 

02-12-2023 Sat 11:08 | Telangana
  • గతంలో మా 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందన్న రేణుక
  • ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులే తమకు ఫోన్లు చేస్తున్నారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం తమకు లేదన్న ఫైర్ బ్రాండ్
 
We are getting calls from BRS candidates says Renuka Chowdhury
Listen to the audio version of this article

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంచనాలను వెలువరించినప్పటికీ... ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదని, ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముదామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమదే విజయం అని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు, అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందని... ఈసారి పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని... తనకు కూడా కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. తమను మర్చిపోవద్దని, తమను గుర్తుంచుకోవాలని, అవసరమైతే తాము కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ అభ్యర్థులు ఫోన్లు చేసి చెపుతున్నారని అన్నారు. తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు

Link to comment
Share on other sites

Vijayashanti: బీఆర్ఎస్ రాజకీయ భవితవ్వంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు 

02-12-2023 Sat 10:56 | Telangana
  • సర్వే ఫలితాలను బట్టి బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం అధికార పక్షంగా ముగుస్తుందన్న విజయశాంతి
  • తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం డిసెంబరు 3 వరకు చూద్దామన్న కాంగ్రెస్ నేత
  • ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
 
Let we wait for December 3rd Congress leader Vijayashanti X
Listen to the audio version of this article

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం గురించి తనకు తెలియదని, కానీ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణం అధికార పక్షంగానే ముగుస్తుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం, కాంగ్రెస్ విజయం కోసం డిసెంబరు 3 వరకు చూద్దామని అన్నారు. హరహర మహాదేవ, జై తెలంగాణ, జై హింద్ అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ల స్వీకరణ వరకు బీజేపీలోనే ఉన్న విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఆమెను వెంటనే క్యాంపెయిన్ కమిటీ కోఆర్డినేటర్‌గా నియమించింది. కాగా, నవంబరు 30న విజయశాంతి ఎక్స్ చేస్తూ.. కోట్లాది తెలంగాణ బిడ్డల జీవితాలు ఎప్పటికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నిరంతరం కోరుకునే ఒక ఉద్యమకారిణని పేర్కొంటూ ఓ వీడియో సాంగ్‌ను జతచేశారు. తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన ‘ఒసే రాములమ్మా’ లోని ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులి పిల్లాలపై వచ్చినామూరా పట్వారి కొడకా’ అనే పాటను జోడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించే ఆమె ఈ పాటను పోస్టు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

Link to comment
Share on other sites

Revanth Reddy: వైఎస్సార్, కేసీఆర్ ల ఆఫర్లను తిరస్కరించాను.. నాకు పదవులు ముఖ్యం కాదు: రేవంత్ రెడ్డి 

02-12-2023 Sat 09:42 | Telangana
  • కాంగ్రెస్ 80కి పైగా సీట్లను గెలుచుకుంటుందన్న రేవంత్
  • సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్య
  • పదవుల మీద ఆశ లేదు కాబట్టే 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానన్న రేవంత్
 
I rejected YSR and KCR offers says Revanth Reddy
Listen to the audio version of this article

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని చెపుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని తెలిపిందని చెప్పారు. కాంగ్రెస్ 80కి పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... కాంగ్రెస్ తరపున గెలిచే 80 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం అభ్యర్థులేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని... అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని అన్నారు. 

తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని... అధికారం కావాలని ఆశిస్తే తాను అధికార పక్ష పార్టీల్లో కీలక పదవుల్లో ఉండేవాడినని రేవంత్ చెప్పారు. పదవులు ఆశించలేదు కాబట్టే... పీసీపీ చీఫ్ గా ఉన్నానని, 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానని తెలిపారు. గతంలో తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ లు ఆఫర్లు ఇచ్చారని... కానీ, వాటిని తాను తిరస్కరించానని చెప్పారు. తనకు ప్రజాసేవ చేయడమే ముఖ్యమని అన్నారు. ఇండిపెండెంట్ గా తాను జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానని... రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందానని చెప్పారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: హైకమాండ్ నేతల అభిప్రాయాలు తీసుకుంటే అందరూ రేవంత్‌కే ఓటేస్తారు: మల్లు రవి 

02-12-2023 Sat 09:31 | Telangana
  • మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డిని సీఎంగా సూచిస్తామన్న కాంగ్రెస్ సీనియర్
  • కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి
  • రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పార్టీ కోసం కష్టపడ్డారని ప్రస్తావించిన మల్లు రవి
 
Everyone will vote for Revanth if high command asks leaders says congress seniro leader Mallu Ravi
Listen to the audio version of this article

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది. హస్తం పార్టీ గెలిస్తే సీఎం ఎవరనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డిని సీఎంగా తాము సూచిస్తామని తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. సీఎం ఎంపిక విషయంలో హైకమాండ్ నేతల అభిప్రాయాలను కోరితే అందరూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే ఓటు వేస్తారని భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరూ పార్టీ కోసం కష్టపడ్డారని, జనం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని మల్లు రవి అన్నారు. రేవంత్ పాదయాత్రలు, జనసభలతో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారని, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తాము ప్రజల తీర్పును గౌరవించామని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచొద్దని బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ పార్టీకే సానుకూలంగా ఉన్నాయని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మల్లు రవి దీమా వ్యక్తం చేశారు. 

 

Link to comment
Share on other sites

14 minutes ago, CrazyRobert777 said:

E chillara face daanne contact aitunnaraa poi poi

Pulkas deluded world lo they think they're important.....same with Renuka madam. Pulkas ki 2 states lo already power poyindanna sangathi artham kaavatle...! Adurs cinemalo Jr NTR dialogue okati untundi Raghu Karumanchi ni:

"neeku kovvekkuvai bullet digina sangathi teliyatledu" antaadu. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...