Jump to content

Idi epudu jarigindi?? Hyperbole chusuko badla..


psycopk

Recommended Posts

BRS Ministers: గెలిచిన మంత్రులు.. ఓడిన మంత్రులు వీరే! 

03-12-2023 Sun 21:01 | Telangana
  • తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ 
  • ఒక స్థానంలో ఓడిపోయిన సీఎం కేసీఆర్
  • ఎర్రబెల్లి, పువ్వాడ, శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఓటమి
 
Winners and loosers of BRS ministers

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన, ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గుడ్ బై చెప్పారు. కేసీఆర్ పాలనకు ముగింపు పలికారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి స్థానంలో ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంతో మంది బలమైన నేతలు ఓటమిపాలయ్యారు. పలువురు మంత్రులు కూడా ఓటమిపాలవడం గమనార్హం. 

ఓటమిపాలైన మంత్రులు: ఎర్రబెల్లి దయాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్

గెలిచిన మంత్రులు: కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

Link to comment
Share on other sites

Chandrababu: తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులపై వ్యాఖ్యలు చేయొద్దు: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు, లోకేశ్ సందేశం 

03-12-2023 Sun 15:20 | Both States
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
  • తెలంగాణ ఎన్నికల ఫలితం అక్కడి ప్రజల నిర్ణయమన్న చంద్రబాబు, లోకేశ్
  • ప్రజల నిర్ణయాన్ని గౌరవిద్దామని శ్రేణులకు పిలుపు
  • పార్టీలను పలుచన చేసే దిశగా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టీకరణ 
 
Chandrababu and Lokesh messaged TDP cadre regarding to Telangana election results

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దాదాపు స్పష్టత వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు కాగా, కాంగ్రెస్ ఆ మార్కు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్పందించింది. టీడీపీ అభిమానులు, నేతలు, కార్యకర్తలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందేశం వెలువరించారు. 

"తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం" అంటూ స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని దయచేసి అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు

Link to comment
Share on other sites

Ayyanna Patradu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సీనియర్ అయ్యన్న పాత్రుడు స్పందన 

03-12-2023 Sun 21:41 | Both States
  • ప్రజలు మార్పు కోరుకోవడంతోనే బీఆర్ఎస్ ఓడిందన్న టీడీపీ నేత
  • ఏపీలోనూ జగన్‌కు కేసీఆర్ పరిస్థితే ఎదురవుతుందని వ్యాఖ్య
  • 3 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు
 
Ayyanna Patradu responded on Telangana election results

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఈ ఫలితం పది రోజల ముందు నుంచే ఊహించిందేనని, మొదటి నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని భావించానని అన్నాడు. ప్రజలు మార్పు కోరుకోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎంతో కొంత చేశారు కానీ అహంభావం కారణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మనిషికి ఎప్పుడైతే అహంభావం వస్తుందో అతడు పాతాళానికి పోతాడని కేసీఆర్‌ను ఉద్దేశించి  ఘాటుగా స్పందించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని, ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు కానీ జగన్ సైకో అని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. లేనిపోని తప్పులన్ని చేసి సమాధి అయ్యే పరిస్థితుల్లో జగన్ ఉన్నాడని, తెలంగాణలో కూడా అదే జరిగిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫలితమే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని  దీమా వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

BRS: కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అభినందనలు 

03-12-2023 Sun 22:10 | Telangana
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్‌కు అభినందనలు అంటూ ట్వీట్
  • తెలంగాణ ప్రజల సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ కృషిని కొనసాగిస్తుందని వెల్లడి
  • ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని ప్రకటన
 
BRS Congratulations to the Congress Party over win in Telangana election

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి అధికారాన్ని సొంతం చేసుకున్న  కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు, మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ బీఆర్ఎస్ అఫీషియల్ ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించింది. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహిస్తోందని, ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని వెల్లడించింది.

పోరాడి సాధించుకున్న తెలంగాణను గత పదేళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి పథంలో నిలిపిందని, భవిష్యత్‌లో సైతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ కృషిని కొనసాగిస్తుందని వెల్లడించింది. 
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అంకిత భావంతో, అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పార్టీ పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోని ఉంచి పార్టీ సందేశాన్ని అందించింది. ఈ మేరకు కాంగ్రెస్ గెలుపు అనంతరం స్పందించింది.

ఇదిలావుండగా తెలంగాణ అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 64 సీట్లను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక 39 సీట్లు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

KTR: ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్ 

03-12-2023 Sun 18:35 | Telangana
  • తెలంగాణలో 64 స్థానాలతో కాంగ్రెస్ జయభేరి
  • 39 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైన అధికార బీఆర్ఎస్
  • రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని కేటీఆర్ వెల్లడి 
  • ఎన్నికల ఫలితాల సరళి ఒక వేవ్ లా అనిపించడంలేదని వివరణ 
 
KTR press meet after election results

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. 

పార్టీ కోసం తమ నేతలు ఎంతో కష్టపడ్డారని, గతం కంటే మంచి మెజారిటీ సాధిస్తామని భావించామని వెల్లడించారు. ఫలితాలు నిరాశకు గురిచేసినా అసంతృప్తి మాత్రం లేదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, మాకు 70 ప్లస్ సీట్లు వస్తాయని మొన్న చెప్పాను కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే తానేమీ బాధపడడంలేదని అన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఒక వేవ్ లా అనిపించడంలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో, మెదక్ జిల్లాలో ఫలితాలు దాదాపు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని, కరీంనగర్ జిల్లాలో 40:60 నిష్పత్తిలో ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ పరిస్థితి తమకు కూడా అర్థం కాకుండా ఉందని అన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన తర్వాత, మా అభ్యర్థుల అనుభవాలు కూడా తెలుసుకుని ఓటమి కారణాలు ఏవన్నది నిర్ణయిస్తాం అని తెలిపారు. 

"పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో సోదరుడు బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా చేయలేదు. కానీ సుమన్ ఓడిపోయారు. మందమర్రిలో కూడా ఇలాంటి ప్రతికూల ఫలితమే వచ్చింది. 

సింగరేణికి మేం చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నాం, సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్ ఇచ్చాం. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాం. వారసత్వ ఉద్యోగాలు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాం. కానీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన మెజారిటీలు వచ్చాయి. నాకు తెలిసి అంత మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందుకే మా ఓటమికి ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేను కానీ, భిన్నమైన అంశాలు మా ఓటమికి దారి తీసి ఉంటాయని భావిస్తున్నాను" అని వివరించారు. 

గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నానని, ఇకపై సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ వెల్లడించారు. 39 స్థానాల్లో గెలిచేందుకు మా నేతలు ఎంతో శ్రమించారు... వారికి నా అభినందనలు అంటూ  పేర్కొన్నారు.

He is done & dusted. Kcr is old. Inka eediki padding undadu. Next 1-2 years lo all scams bayatiki vasthayi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...