Jump to content

Revant reddy 9th annadu??


psycopk

Recommended Posts

Congress: తెలంగాణలో రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 

03-12-2023 Sun 17:18 | Telangana
  • తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119
  • ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు 60
  • 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్
  • ఈ రాత్రికి సీఎల్పీ సమావేశం
 
Telangana Congress chief minister will take oath tomorrow

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఈ మార్కు కంటే కాంగ్రెస్ మరో 4 సీట్లు ఎక్కువే గెలిచింది. 

ఈ నేపథ్యంలో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. 

ఈ రాత్రికి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. 

 

Link to comment
Share on other sites

Eedu modalu petadu…

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

29-10-2023 Sun 14:50 | Telangana
  • రేవంత్ రెడ్డే సీఎం అంటూ డీకే శివకుమార్ అన్నట్టు కథనాలు
  • శివకుమార్ ప్రసంగాన్ని అనువదించిన రామ్మోహన్ అత్యుత్సాహం చూపాడన్న కోమటిరెడ్డి
  • సీఎం ఎవరన్నది హైకమాండ్ చూసుకుంటుందని వెల్లడి
 
Komatireddy says DK Shivakumar did not say Revanth Reddy will be CM

మునుపటితో పోల్చితే ఈసారి ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో నవ్యోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని కాంగ్రెస్ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్నదానిపైనా ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. 

రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదని, కానీ ఆయన ప్రసంగాన్ని అనువదించిన పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చూపించారని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే ఒక సీఎం అభ్యర్థేనని కోమటిరెడ్డి అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్నది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని వివరించారు. నవంబరు 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గరిష్ఠంగా 80 స్థానాల వరకు వస్తాయని అన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Mallu Bhatti Vikramarka: సీఎం అభ్యర్థిత్వంపై భట్టి విక్రమార్క స్పందన ఇదే 

03-12-2023 Sun 18:58 | Telangana
  • పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటానన్న భట్టి
  • తన సీఎం అభ్యర్థిత్వంపై జరుగుతున్న చర్చను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి
  • మొదటి కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరణ
 
This is Bhatti Vikramarka response to CMs candidature

పార్టీ కోసం పాదయాత్ర చేసి ప్రజలకు హామీలు ఇచ్చాను కాబట్టి ఆ హామీలను అమలు పరచేందుకు  ముఖ్యమంత్రి పదవి వస్తే బాగుంటుందని కోరుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, మధిరలో విజయం సాధించిన భట్టి విక్రమార్క అన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానంటూ చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని, ఆ చర్చను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మనసులో మాట చెప్పారు. అంతిమంగా ఇది పార్టీ అంతర్గత విషయమని, పార్టీలోనే చర్చించుకుంటామని అన్నారు. మధిర నియోజకవర్గంలో విజయం అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు. మంత్రివర్గ కూర్పు, సీఎం అభ్యర్థి ఎవరనే అంశాలపై స్పందిస్తూ.. ఊహాగానాలు, ప్రచారాలు ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని చెప్పారు. అది కావాలి ఇది కావాలని ఎవరికి వారు అనుకున్నా.. ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే బావుంటుందనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. అంతిమంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర గ్యారంటీలు ప్రకటించడం తమ లక్ష్యంగా ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఇక బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్ అదిరిపోయే విజయాన్ని సాధించడంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో స్వతంత్రంగా లేదని ప్రజలు భావించారని, సాధించుకున్న రాష్ట్రంలో సంపదను ప్రజలకు పంచకుండా పాలకులు దోచుకున్నారని ప్రజలు భావించారని అన్నారు. ‘‘ నీళ్లు రాలేదు. నిధులన్నీ ఖర్చయ్యి పోయాయి. ఉద్యోగాలు లేవు. బలహీన వర్గాలకు వచ్చే ఏ సంక్షేమ పథకాలు అందలేదు. ఇళ్లు లేవు. ఇళ్ల స్థలాలు లేవు. చదువుకున్న విద్యార్థులకు కావాల్సిన అవకాశాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నేను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాను. బడుగు బలహీనవర్గాలు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకు రావాల్సిందేనని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంతో ప్రజలకు సంపదను పంచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని అప్పుడే చెప్పాను’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుని అమలు చేసేలా అడుగులు వేస్తామని అన్నారు. మేనిఫెస్టోని కూడా దశలవారీగా పూర్తిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేస్తామని, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అమలు చేసిందని గుర్తుచేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: గవర్నర్ తమిళిసైని కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ 

03-12-2023 Sun 21:29 | Telangana
  • ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరిన కాంగ్రెస్ బృందం
  • రేపు శాసన సభా పక్షం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని వెల్లడి
  • రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
 
Revanth Reddy meets Governor Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వారు కోరారు. రేపు శాసన సభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మార్చేస్తున్నాం... ఇక నుంచి ఇలా పిలవాలి: రేవంత్ రెడ్డి 

03-12-2023 Sun 16:37 | Telangana
  • తెలంగాణలో కాంగ్రెస్ జయభేరి
  • మ్యాజిక్ ఫిగర్ (60)ను సాధించిన కాంగ్రెస్
  • గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
 
Revanth Reddy press meet in Gandhi Bhavan

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (60) ను సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు  తెలిపారు. 

"2009లో డిసెంబరు 3న శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ఇవాళ డిసెంబరు 3... 2023. నేడు తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి ఘనమైన నివాళి ఇచ్చారు. మలి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి కాంగ్రెస్ పార్టీ  తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని రాష్ట్ర కాంగ్రెస నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. 

ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా మాలో స్ఫూర్తిని నింపారు, మాలో విశ్వాసాన్ని కలిగించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు... కుటుంబ పరమైన అనుబంధం. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులమే. 

ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటానని, ఎదురొడ్డి పోరాడమని రాహుల్ గాంధీ మాకు భరోసానిచ్చారు. రాహుల్ గాంధీ మద్దతుతో నేను, సీఎల్పీ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలందరం కలిసి ఐక్యంగా ఇవాళ ఈ విజయం సాధించాం. సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా వంటి నేతలు కూడా సహకారం అందించారు. 

ఈ విజయాన్ని తెలంగాణ అమరులకు అంకితం చేస్తున్నాం. తెలంగాణ అమరుల ఆకాంక్షలను అమలు చేయడానికి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, తెలంగాణలోని పేదలను ఆదుకోవడానికి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఈ విజయమే నాంది. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడుతాం. 

ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు అభినందించారు... వారి ప్రకటనను స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పలుకుతాం. 

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కాకుండా, రాహుల్ గాంధీ చట్టబద్ధత కల్పిస్తామన్న మిగతా అంశాలపైనా ఆయన మాటను నిలుపుకుంటాం. మా సహజ మిత్రులు, ఎన్నికల్లో మాతో కలిసి పోటీ చేసిన సీపీఐతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయని సీపీఎంను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. సంపూర్ణ సహకారం అందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ప్రభుత్వంలో వాళ్ల ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతాం.

ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి నాది ఒక సూచన. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పాలక పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు... ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల పాత్రను ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. గతంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలు మళ్లీ జరగబోవని భావిస్తున్నాం. 

ఈసారి గతంలో జరిగినట్టుగా ఉండదు... సచివాలయ గేట్లు సామాన్యుడికి కూడా తెరుచుకుని ఉంటాయి. ప్రగతి భవన్ ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుంది. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు... ప్రజా భవన్... అది ప్రజల ఆస్తి. దాన్ని ప్రజల కోసమే వినియోగిస్తాం. 2004 నుంచి 2104 వరకు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి స్ఫూర్తిదాయక పాలన ఇచ్చిందో, అదే ప్రేరణతో తెలంగాణలోనూ పరిపాలిస్తాం" అని రేవంత్ రెడ్డి వివరించారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: కొడంగల్ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: రేవంత్ రెడ్డి 

03-12-2023 Sun 15:53 | Telangana
  • తెలంగాణలో హస్తం హవా
  • అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జోరు
  • కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘనవిజయం
  • ఊపిరి ఉన్నంతవరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తానన్న రేవంత్ 
 
Revanth Reddy reacts to his victory in Kodangal

ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి! ఈ నానుడి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి, రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారగా... ఆ తర్వాత ఎంపీగా గెలిచి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయపంథాలో నడిపిస్తుండడం రేవంత్ రెడ్డికే చెల్లింది. తదుపరి సీఎం కూడా ఆయనే అంటున్నారు! 

కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఘనవిజయం అందుకున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వినమ్రంగా పేర్కొన్నారు. కొన ఊపిరి ఉన్నంతవరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తానని స్పష్టం చేశారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని భావోద్వేగపూరితమైన హామీ ఇచ్చారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బ్రతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని, దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతానని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

Link to comment
Share on other sites

3 minutes ago, chammakchandra said:

Who is this dk boshdikey to say about telugu state.. he needs to go mind his own business in his own state ! This is exactly I hate about congress 

He is in charge baa

Link to comment
Share on other sites

Eedi epudu mamuluga undadu… 

Komatireddy Venkat Reddy: పీసీసీ అధ్యక్షుడు కాబట్టే రేవంత్ రెడ్డిని డీజీపీ కలిశారు: కోమటిరెడ్డి 

03-12-2023 Sun 14:26 | Telangana
  • తెలంగాణలో కాంగ్రెస్ జోరు
  • ఇప్పటికే 20 స్థానాలు కైవసం... మరో 44 స్థానాల్లో ఆధిక్యం
  • రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ, ఇతర ఐపీఎస్ అధికారులు
  • సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిస్తారన్న కోమటిరెడ్డి
  • తాను సీఎం రేసులో ఉన్నానా, లేదా అనేది అప్రస్తుతం అని వెల్లడి
 
Komatireddy reacts on DGP meeting with Revanth Reddy

తెలంగాణలో హస్తం దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా స్పష్టమైన మెజారిటీ అందుకుంటోంది. ఇప్పటికే 20 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మరో 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ దాదాపుగా గెలిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో నెగ్గి, కామారెడ్డిలోనూ ముందంజలో ఉన్నారు. 

కాంగ్రెస్ విజయపరంపర నేపథ్యంలో, రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ, సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 

సీఎం అభ్యర్థి ఎవరన్నది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో ఉన్నానా, లేదా? అనే అంశం చర్చించడానికి ఇది సమయం కాదని అన్నారు. పీసీసీకి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టే రేవంత్ రెడ్డిని డీజీపీ కలిశాడని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ విజయాన్ని సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 

కాగా, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ కు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...