Jump to content

Your confidence and hardwork paid off.. congrats Revanth


psycopk

Recommended Posts

Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ ప్రకటన

05-12-2023 Tue 18:39 | Telangana
  • సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన కేసీ వేణుగోపాల్
  • ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి
  • సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందని... టీమ్ వర్క్ చేస్తారని వ్యాఖ్య
KC Venugopal announces Revanth Reddy as CM
Listen to the audio version of this article

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీమ్ వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటే..!

05-12-2023 Tue 17:47 | Telangana
  • 64 మంది ఎమ్మెల్యేలలో 42 మంది రేవంత్ రెడ్డికి ఓటు!
  • మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ వైపు మొగ్గు
  • దీనిని పరిగణనలోకి తీసుకొని రేవంత్ పేరును ప్రకటించే అవకాశం
42 MLAs supporting Revanth Reddy
Listen to the audio version of this article

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. నిన్న జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలోనూ మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు గాను 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే మద్దతు తెలిపారని సమాచారం. అంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ విష‌యాన్ని కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొని టీపీసీసీ చీఫ్‌కే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేసులో రేవంత్‌తో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Revanth Reddy: సోనియాగాంధీ నుంచి కార్యకర్తల వరకు.. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు

05-12-2023 Tue 19:53 | Telangana
  • ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
  • సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు కృతజ్ఞతలు
  • ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి
Revanth reddy thanks tweet sonia gandhi
Listen to the audio version of this article

తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి సోనియమ్మ స్పూర్తిదాయకమైన నేత, రాహుల్ గాంధీ, ప్రజాకర్షక నాయకురాలు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు, కాంగ్రెస్ సైనికులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఇదిలావుంచితే, రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను స్వయంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఇదిలా ఉండగా రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ

05-12-2023 Tue 20:17 | Both States
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం
  • తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలన్న బాలకృష్ణ
Nandamuri Balakrishna conveys his best wishes to newly elected CM for Telangana
Listen to the audio version of this article

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డిపై అభినందనల జడివాన కురుస్తోంది. తాజాగా, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు అంటూ బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. 

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నెరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Revanth Reddy: కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం...!

05-12-2023 Tue 21:25 | Telangana
  • ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
  • 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి
  • 2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్
Life Journey of CM Revanth Reddy
Listen to the audio version of this article

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన ఎల్లుండి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

- 1969 - నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
- 2006 - మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం.
- 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక.
- 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.
- 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.
- 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.
- 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
- 2017లో  కాంగ్రెస్‌ పార్టీలో చేరిక.
- 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.
- 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.
- 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.
- 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం.
- 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.
- 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు.

Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం

05-12-2023 Tue 21:20 | Telangana
  • ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశం
  • ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
  • సమావేశంలో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి
CS meets officers on Revanth Reddy oath
Listen to the audio version of this article

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి ఎల్లుండి సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై సీఎస్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది.

Link to comment
Share on other sites

bandla ganesh: నా శ్రేయస్సు కోరుకునే రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు: బండ్ల గణేశ్ ట్వీట్

05-12-2023 Tue 22:00 | Telangana
  • మా అన్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ 
  • నాడు బూర్గుల.. నేడు ఎనుముల.. పాలమూరు నుంచి సీఎంలు అంటూ మరో ట్వీట్
  • సిద్ధరామయ్య ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గణేశ్ 
Bandla Ganesh greets Revanth Reddy
Listen to the audio version of this article

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 'నాడు బూర్గుల (1952), నేడు ఎనుముల( 2023)... పాలమూరు నుండి ముఖ్యమంత్రులు' అంటూ మరో ట్వీట్ చేశారు.  

రేవంత్ రెడ్డికి సిద్ధరామయ్య శుభాకాంక్షలు.. బండ్ల గణేశ్ రీట్వీట్

కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పాలనలో అందరినీ కలుపుకొని పోయి, ప్రగతిశీల, పారదర్శక పాలన అందిస్తారని నాకు నమ్మకం ఉందంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనిని బండ్ల గణేశ్ రీట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్‌రెడ్డి.. మరికాసేపట్లో సోనియాగాంధీతో భేటీ 

06-12-2023 Wed 10:38 | National
  • తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్
  • అధిష్ఠానం పిలుపుతో నిన్న హస్తినకు పీసీసీ చీఫ్
  • ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ
 
Revanth Reddy to meet Sonia and Rahul Gandhi today in Delhi

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముుఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. 

ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం.

Link to comment
Share on other sites

Congress: హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్! 

06-12-2023 Wed 10:13 | Telangana
  • కాంగ్రెస్ తరపున గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు
  • తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న పలువురు ఎమ్మెల్యేలు
  • ప్రొఫెసర్ నాగేశ్వరావు, చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
 
Training classes for Telangana Congress MLAs
Listen to the audio version of this article

తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో, కొత్త ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్యేలందరికీ వారు ప్రస్తుతం బస చేసిన హోటల్ ఎల్లాలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల బాధ్యతలు, విధులు, హక్కులు, అసెంబ్లీ నియమ నిబంధనలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు.. ! 

06-12-2023 Wed 09:04 | Telangana
  • సీఎల్పీ నేతగా, సీఎంగా ఎంపికైన సోదరుడు రేవంత్‌కి శుభాకాంక్షలు అంటూ వెంకటరెడ్డి ట్వీట్
  • కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్
  • రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
 
Komatireddy Venkata Reddy congratulates Revanth Reddy
Listen to the audio version of this article

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం (రేపు) ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమయంలో రేవంత్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎల్పీ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి సోదరుడికి అభినందనలు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో ఇద్దరూ ఒకే వేదికపై ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ‘ఎక్స్’ వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. ఫొటోలు ఇవిగో! 

06-12-2023 Wed 11:58 | Telangana
  • ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డి
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్ లను ఆహ్వానించిన రేవంత్
  • అంతకు ముందు ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ భేటీ
 
Revanth Reddy meets Sonia Gandhi and Rahul Gandhi
Listen to the audio version of this article

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. సీఎంగా ఆయన రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఆయన కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఈ సందర్భంగా వారిని కోరారు. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ ను సోనియా, రాహుల్ అభినందించారు.

అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. ఇంకోవైపు, ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి ఈరోజు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్ తిరిగి రానున్నారు.
20231206fr6570163c549e0.jpg
20231206fr6570164817088.jpg
20231206fr65701653c25fc.jpg
20231206fr6570142b61873.jpg

Link to comment
Share on other sites

Sonia Gandhi: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి వెళ్తున్నారా? అనే ప్రశ్నకు సోనియాగాంధీ సమాధానం ఇదే! 

06-12-2023 Wed 12:23 | Telangana
  • సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి
  • ఈ కార్యక్రమం కోసం తరలిరానున్న కాంగ్రెస్ పెద్దలు
  • హైదరాబాద్ కు వెళ్తున్నానన్న సోనియాగాంధీ
 
Sonia Gandhi is coming to Hyderabad for Revanth Reddy swearing in ceremony
Listen to the audio version of this article

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు తరలిరానున్నారు. అయితే, స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియాగాంధీ వస్తారా? లేదా? అనే విషయంలో అందరిలో కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి ఆమె తెరదించారు. రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మీరు రేపు హైదరాబాద్ కు వెళ్తున్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించగా... 'వెళ్లొచ్చు' అని ఆమె సమాధానమిచ్చారు. దీంతో, సోనియా హైదరాబాద్ కు వస్తున్నారనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్టయింది.

Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. జగన్, చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలు! 

06-12-2023 Wed 13:06 | Both States
  • రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రేపే
  • ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు ఆహ్వానాలు పంపిన తెలంగాణ కాంగ్రెస్
  • పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు
 
Congress invites Jagan Chandrababu KCR for Revanth Reddy swearing in ceremony
Listen to the audio version of this article

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలను పంపించారు. అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, చిదంబరం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే తదితర సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్య తదితరులకు కూడా ఆహ్వానాలు పంపారు. పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

Revanth Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 

06-12-2023 Wed 13:42 | Telangana
  • పార్లమెంట్ కు వెళ్లి రాజీనామా అందజేత
  • పలువురు ఎంపీలతో సమావేశమైన పీసీసీ చీఫ్
  • తెలంగాణకు కాబోయే సీఎంను అభినందించిన ఎంపీలు
 
Revanth Reddy Resignation To MP Post
Listen to the audio version of this article

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో మంగళవారం సాయంత్రమే దేశ రాజధానికి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నేతలతో భేటీ తర్వాత బుధవారం కూడా అక్కడే ఉన్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో సహా పలువురు హైకమాండ్ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్లారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ అందజేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలువురు ఎంపీలతో రేవంత్.. రూం నెబర్ 66 లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...