Jump to content

Your confidence and hardwork paid off.. congrats Revanth


psycopk

Recommended Posts

Revanth Reddy: ఇవాళ ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా... సీఎం అయ్యాక రేవంత్ తొలి ప్రసంగం 

07-12-2023 Thu 14:49 | Telangana
  • తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
  • ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం
  • పదవీ ప్రమాణం అయ్యాక సీఎం హోదాలో  ప్రసంగించిన రేవంత్
  • తెలంగాణకు పట్టిన చీడపీడ వదిలిపోయాయని వ్యాఖ్యలు
  • తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని వెల్లడి
 
CM Revanth Reddy first speech after taking oath

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని, పోరాటాలతో త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం అని పేర్కొన్నారు. 

ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆశలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని... ఆసిఫాబాద్ నుంచి ఆలంపూర్ వరకు... ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ  సమిధగా మారినప్పటికీ సోనియా గాంధీ వెనుకంజ వేయలేదని కొనియాడారు. 

కానీ, దశాబ్ద కాలంగా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. తమ బాధలు చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వంలో వినేవాళ్లెవరూ లేకపోవడంతో గత పదేళ్లుగా ప్రజలు మౌనంగా భరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడా ప్రజలే తమకోసం తాము గెలిపించుకున్న రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యం అని వివరించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసి విజయానికి సహకరించారంటూ తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

"నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగ యువత, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది. 

ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రమాణస్వీకారం ఏర్పాటు చేసిన సమయంలో, అక్కడ ఓ గడీలా నిర్మించుకున్న ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా.... ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ప్రగతి భవన్ కు ఎప్పుడు రావాలన్నా నిరభ్యంతరంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 

ప్రజలు ప్రగతి భవన్ లోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా వచ్చి తమ ఆలోచనలను, ఆకాంక్షలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు (ప్రజలు) భాగస్వాములు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి... సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా, మీ మాట నిలబెడతానని మాట ఇస్తున్నా. ఇవాళ ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. 

మా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు కృషి చేస్తాం. శాంతిభద్రతలు కాపాడుతూ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణను కూడా ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం. పేదలకు, నిస్సహాయులకు అండగా నిలవడమే మా తొలి ప్రాధాన్యత. మాకెవరూ లేరు, మాకు ఏ దిక్కూ లేదు అని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది... మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలు నేను స్వీకరిస్తాను. 

కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ అండతో, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వం, రాహుల్ గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించి... మేం పాలకులం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికైన సేవకులం అని నిరూపించుకుంటాం. మీరు మాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు... ఆ అవకాశాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తాం. 

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు లక్షలాది కార్యకర్తలు ప్రాణాలను లెక్కచేయకుండా కష్టపడి పనిచేశారు. మీ కష్టాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటా... మీరిచ్చిన శక్తిని గుండెల నిండా నింపుకుంటా. ఈ పదేళ్లు అనేక కష్టనష్టాలకోర్చిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యతను నాయకుడిగా నేను తీసుకుంటా... ఢిల్లీలో మన కుటుంబ సభ్యులుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటారు. 

ఇవాళ్టి నుంచి నిరుద్యోగ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణకు పట్టిన చీడపీడల నుంచి విముక్తి కలిగించి, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మీరందరూ కుటుంబ సభ్యుల్లా పాల్గొన్నారు. 

ఈ శుభకార్యంలో, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, సహచర రాజకీయ పార్టీల నేతలు, ఇండియా కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషించిన చాలా రాజకీయ పక్షాలకు చెందిన నేతలు, నా సహచర పార్లమెంటు సభ్యులందరికీ ధన్యవాదాలు" అంటూ  రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Link to comment
Share on other sites

Rahul Gandhi: ఇక ప్రజల సర్కారు పని మొదలైంది: రాహుల్ గాంధీ 

07-12-2023 Thu 15:20 | Telangana
  • తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
  • డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క... మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం
  • రేవంత్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
  • బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామంటూ ట్వీట్
 
Rahul Gandhi says peoples govt work has begun in Telangana
Listen to the audio version of this article

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. "ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు. ఇక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని మొదలైంది. బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తాం. మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Telangana New Ministers: తెలంగాణ హోం మంత్రిగా ఉత్తమ్, రెవెన్యూ మంత్రిగా భట్టి... మంత్రులకు శాఖలను కేటాయించిన రేవంత్ 

07-12-2023 Thu 15:23 | Telangana
  • శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ
  • తుమ్మలకు ఆర్ అండ్ బీ
  • పొంగులేటికి నీటిపారుదల శాఖ
  • సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ
  • కోమటిరెడ్డికి పురపాలక శాఖ
 
List of Telangana ministers and their portfolios
Listen to the audio version of this article

కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు. 

 
తెలంగాణ మంత్రులు.. వారి శాఖలు ఇవే:
  • మల్లు భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం 
  • శ్రీధర్ బాబు - ఆర్థిక శాఖ
  • తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాల శాఖ
  • జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాల శాఖ
  • దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ
  • పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమ శాఖ
  • సీతక్క - గిరిజన సంక్షేమ శాఖ
  • కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి - పురపాలక శాఖ
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటిపారుదల శాఖ.

 

 

Link to comment
Share on other sites

Sonia Gandhi: సోనియాకు పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్న సీఎం రేవంత్ దంపతులు.. వీడియో ఇదిగో 

07-12-2023 Thu 15:44 | Telangana
  • సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
  • వేదికపై తన కుటుంబ సభ్యులను సోనియాకు పరిచయం చేసిన రేవంత్
  • రేవంత్ భార్యకు షేక్ హ్యాండ్ ఇచ్చిన సోనియా
 
Revanth Reddy and his wife takes blessings of Sonia Gandhi
Listen to the audio version of this article

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపైనే సీఎంగా ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత, కూతురు, అల్లుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ దంపతులు సోనియాగాంధీకి పాదాభి వందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. రేవంత్ భార్యకు సోనియా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు. 

 

Link to comment
Share on other sites

Revanth Reddy: ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి నియామకం 

07-12-2023 Thu 15:58 | Telangana
  • రేవంత్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల జారీ
  • కాంగ్రెస్ గెలిచిన సమయంలోనే పలువురు అధికారులు, కార్పోరేషన్ల చైర్మన్ల రాజీనామా
 
New Intelligence IG Shivadar Reddy
Listen to the audio version of this article

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ గెలిచిన సమయంలోనే పలువురు అధికారులు, కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. తాజాగా సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని, ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డిని నియమించారు. రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 1.04 గంటల సమయానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు.

Link to comment
Share on other sites

Bandi Sanjay: తన పదవీకాలంలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నా: బండి సంజయ్ 

07-12-2023 Thu 16:20 | Telangana
  • తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
  • నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 
  • అభినందనలు తెలిపిన బండి సంజయ్
 
Bandi Sanjay wishes Revanth Reddy for successful tenure
Listen to the audio version of this article

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ బరిలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Harish Rao: రేవంత్, ఇతర మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు: హరీశ్ రావు 

07-12-2023 Thu 16:31 | Telangana
  • తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
  • హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షించిన హరీశ్
  • కాసేపట్లో ప్రారంభం కానున్న తొలి కేబినెట్ సమావేశం
 
Harish Rao greets Revanth Reddy and other ministers
Listen to the audio version of this article

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం... సచివాలయంలో ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ ఇదే..! 

07-12-2023 Thu 16:47 | Telangana
  • కొలువుదీరిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
  • రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం 
  • సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఏర్పాటు
 
Telangana cabinet meet today
Listen to the audio version of this article

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కొత్త కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నేమ్ ఫోటోను ట్వీట్ చేసింది.

Link to comment
Share on other sites

Pawan Kalyan: రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది: పవన్ కల్యాణ్ 

07-12-2023 Thu 16:55 | Telangana
  • తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
  • హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • అమరుల ఆశయాలు నెరవేర్చాలని సూచన
 
Pawan Kalyan wishes Telangana new CM Revanth Reddy
Listen to the audio version of this article

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఈ మధ్యాహ్నం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ కూడా పాల్గొన్నారని, ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. 

"తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలు... ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో... ఆ ఆశయాలను రేవంత్ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేన 8 చోట్ల పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా గెలవలేదు. ఎనిమిదిమందిలో ఒక్కరికీ డిపాజిట్ రాలేదు. ఏపీకి సరిహద్దులో ఉండే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 4 చోట్ల పోటీ చేసిన జనసేనకు ఆ నిర్ణయం బెడిసికొట్టింది.

Link to comment
Share on other sites

Revanth Reddy: తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య 

07-12-2023 Thu 17:09 | Telangana
  • తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు దీరిందన్న రేవంత్ రెడ్డి 
  • బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని వ్యాఖ్య
  • ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్న రేవంత్
 
Chief Minister Revanth Reddy tweet on government
Listen to the audio version of this article

కాంగ్రెస్ గెలుపు తర్వాత... తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు దీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. 
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. 
ఇది మీ అన్న ఇస్తున్న మాట.' అంటూ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

YS Jagan: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు: ఏపీ సీఎం జగన్ 

07-12-2023 Thu 17:13 | Both States
  • ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
  • విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ
  • నేడు సీఎంగా పదవీప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
  • తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలంటూ సీఎం జగన్ స్పందన
 
AP CM Jagan congratulates Telangana newly sworn CM Revanth Reddy
Listen to the audio version of this article

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా వ్యవహరించగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. 

తాజాగా, ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. "తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Chandrababu: సీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వాలి: చంద్రబాబు 

07-12-2023 Thu 17:26 | Telangana
  • తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి
  • నేడు పదవీప్రమాణ స్వీకారం
  • శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
 
Chandrababu wishes Revanth Reddy on sworn in as Telangana new chief misnister
Listen to the audio version of this article

తెలుగుదేశం పార్టీతో తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గతానుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ బంధం వీడింది. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, నేడు సీఎం పదవిని అధిష్ఠించారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ఎనుముల రేవంత్ రెడ్డి గారు అంటూ గౌరవంగా సంబోధించారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. తన పదవీకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...