Jump to content

Jeevan Reddy : జీవన్‌రెడ్డికి నోటీసులు


appusri

Recommended Posts

 

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు.

 
Jeevan Reddy : జీవన్‌రెడ్డికి నోటీసులు
 

 

నిజామాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా 7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్ మాల్‌కి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు.

ఇన్నిరోజులుగా అధికార బలంతో జీవన్‌రెడ్డి అద్దె బకాయిలు అడగడానికి వచ్చిన అధికారులపై చెలరేగిపోయాడు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆర్టీసీ , విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్ మాల్‌‌కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాపింగ్ మాల్‌‌కి బకాయి ఉన్న నగదును వెంటనే చెల్లించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు హెచ్చరించారు.

Link to comment
Share on other sites

6 minutes ago, appusri said:

BRS lo ilanti attitude unnollu chala mandhi unnaru. Veellu main reason ground level lo BRS party ki bokka bettadaniki.

maaa sara rani chudu.... deni valla odi poina... naku em sambandham ledu annatu enta hadvidi chestundo...

 

K Kavitha: సింగరేణి అంటే సింహగర్జన.. అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

07-12-2023 Thu 21:40 | Telangana
  • సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్న కవిత
  • అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామన్న కవిత
  • కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్‌కు ఎదురు ఉండదదని వ్యాఖ్య
MLC Kavitha meeting with Coal mining workers
Listen to the audio version of this article

కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని... సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం గురువారం టీబీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బొగ్గు గని కార్మికులు ముఖ్య పాత్రను పోషించారని ప్రశంసించారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదన్నారు. బొగ్గు గనుల్లో కార్మికుల కష్టం తెలంగాణలో వెలుగులు నిండేందుకు కారణమవుతుందన్నారు.

అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా పని చేయాలని సూచించారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, త్వరలో తమ సంఘం మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని ఆరోపించారు. భవిష్యత్తులోనూ సంఘాలను సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయలేవన్నారు.

తమకు పోరాటాలు కొత్త కాదన్నారు. కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించేది లేదని హామీ ఇచ్చారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాకుండా ఆత్మగౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. సింగరేణి పనితీరును మెరుగుపర్చడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ చేసిన మంచి పనులను కార్మికుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్‌కు ఎదురు ఉండదన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...