Jump to content

KCR admitted to Hospital, Bathroom lo jaari paddadanta

raccharambola

Recommended Posts

26 minutes ago, rushmore said:

ChaBaNa blue print.....how to escape investigation...guruvuni minchi shishyudu kabatti oka rendu aakulu ekkuve chadivaadu....ee moonnall muchhatta taruvata scene repeat...!

Chabana peru bagundi bro shabhana laga

Link to comment
Share on other sites

KCR: కేసీఆర్ కు రెండు చోట్ల విరిగిన తుంటి ఎముక.. స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం 

08-12-2023 Fri 10:16 | Telangana
  • ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డ కేసీఆర్ 
  • హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలింపు
  • కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం
 
Two fractures to KCR leg bone
Listen to the audio version of this article

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన పట్టుతప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెపుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉన్నారు

Link to comment
Share on other sites

K Kavitha: నాన్న త్వరలోనే కోలుకుంటారు: కవిత 

08-12-2023 Fri 10:05 | Telangana
  • ఫామ్ హౌస్ బాత్రూమ్ లో కాలుజారి పడ్డ కేసీఆర్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • నాన్నకు స్వల్పం గాయం అయిందన్న కవిత
 
Dad will be absolutely fine soon says Kavitha
Listen to the audio version of this article

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అర్ధరాత్రి గాయపడిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ... కేసీఆర్ గారికి స్వల్ప గాయం అయిందని... ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలు, ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

KCR: రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన రిజ్వీ 

08-12-2023 Fri 11:55 | Telangana
  • ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్‌కు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి
 
Revanth Reddy Orders To Monitor KCR Health

ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో యశోద ఆసుపత్రికి చేరుకున్న రిజ్వీ.. కేసీఆర్‌ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించారు. కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలను అందించండి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం 

08-12-2023 Fri 11:56 | Telangana
  • ఫామ్ హౌస్ బాత్రూమ్ లో జరిపడ్డ కేసీఆర్
  • కేసీఆర్ తుంటి ఎముకకు ఫ్రాక్చర్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి
 
Revanth Reddy orders officials to inform him about KCR health updates

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు వివరాలను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

కాసేపటి క్రితం ప్రగతిభవన్ లో రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సెక్రటేరియట్ కు చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే విద్యుత్ శాఖపై రేవంత్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం భావిస్తున్నారు. కాసేపట్లో విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు రాజీనామాను కూడా ఆమోదించవద్దని... ఈరోజు జరగే సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Arogyam set ante lopala vesthada endhi, mandhu kuda undadhu jail lo gila gila kotukuntadu jail lo 

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, raccharambola said:

Lucky ga ma anna goddali tho akkada ledu..Lucky fellow KCR :D

Vaarini yebba..... Mundu chinna dora ni jaggad contact delete cheyamanu....

Inka vuntey blood vomiting ani kooda cheppamantaru.....

Link to comment
Share on other sites

KCR: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు 

08-12-2023 Fri 12:23 | Telangana
  • కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు
  • విరిగిన తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడి
  • కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్న డాక్టర్లు
 
KCR health bulletin
Listen to the audio version of this article

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ స్లిప్ అయ్యారని... దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం... ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తామని తెలిపారు. 
20231208fr6572bc33148a4.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...