Jump to content

KCR admitted to Hospital, Bathroom lo jaari paddadanta


raccharambola

Recommended Posts

Under Supervision of Kalvakuntla sanjay(Doctor-Ortho and Korutla MLA)... Ippudu 2 months Jail nunchi safe... better harishh to Jump too BJP/Cong ASAP

Link to comment
Share on other sites

4 hours ago, Bendapudi_english said:

Arogyam set ante lopala vesthada endhi, mandhu kuda undadhu jail lo gila gila kotukuntadu jail lo 

Jail la mandu vundada? They will get everything in jail 

Link to comment
Share on other sites

Jaya lalitha ki  kuda ilane chesaru

Harish Rao: కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు 

08-12-2023 Fri 15:41 | Telangana
  • ఆందోళన అవసరం లేదు... ఆరోగ్యం నిలకడగా ఉందన్న హరీశ్   
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడి  
  • కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి
 
Harish Rao about BRS president KCRs health
Listen to the audio version of this article

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడటానికి లేదా పరామర్శించడానికి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హరీశ్ రావు యశోద ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు.

Link to comment
Share on other sites

KCR: కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం 

08-12-2023 Fri 21:35 | Telangana
  • ఆపరేషన్ థియేటర్ నుంచి గదికి మార్చిన వైద్యులు
  • వీడియోను షేర్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్
  • ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన జానారెడ్డి
 
KCR operation comleted
Listen to the audio version of this article

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆయనను గదికి మార్చామని, బీఆర్ఎస్ అధినేత కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ప్రముఖ జర్నలిస్ట్ సుధాకర్ ఉండుముల ట్వీట్ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ను మరో గదికి మారుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతమైనట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎనిమిది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. ఇదిలావుంచితే, కేసీఆర్‌‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తన భార్య, తనయుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వెంకట్ రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
20231208fr657343d91aa6d.jpg

Link to comment
Share on other sites

Chandrababu: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు, నారా లోకేశ్ 

08-12-2023 Fri 15:09 | Both States
  • ఫామ్ హౌస్ లో జారి పడ్డ కేసీఆర్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • కేసీఆర్ గాయపడ్డారనే వార్తతో ఆందోళనకు గురయ్యానన్న చంద్రబాబు
 
Chandrababu and Nara Lokesh wishes speedy recovery of KCR
Listen to the audio version of this article

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

Link to comment
Share on other sites

Pawan Kalyan: కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేయాలి: పవన్ కల్యాణ్ 

08-12-2023 Fri 14:37 | Both States
  • కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానన్న పవన్ కల్యాణ్
  • కేసీఆర్ త్వరగా... సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న జనసేన అధినేత
  • అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలని ఆకాంక్ష
 
Pawan Kalyan on KCR injured
Listen to the audio version of this article

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ త్వరగా... సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలన్నారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి కాలుజారి కిందపడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించాను: రేవంత్ రెడ్డి 

08-12-2023 Fri 14:19 | Telangana
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశానన్న రేవంత్ 
  • ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించానని వెల్లడి
  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం
 
I ordered to ensure that KCR gets better medical services says Revanth Reddy
Listen to the audio version of this article

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగిందని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

కేసీఆర్ కు కుడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో జారి పడటంతో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ తుంటి ఎముకకు డాక్టర్లు స్టీల్ ప్లేట్లను అమర్చనున్నారు.

Link to comment
Share on other sites

On 12/8/2023 at 9:36 AM, psycopk said:

Jaya lalitha ki  kuda ilane chesaru

Harish Rao: కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు 

08-12-2023 Fri 15:41 | Telangana
  • ఆందోళన అవసరం లేదు... ఆరోగ్యం నిలకడగా ఉందన్న హరీశ్   
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడి  
  • కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి
 
Harish Rao about BRS president KCRs health
Listen to the audio version of this article

 

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడటానికి లేదా పరామర్శించడానికి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హరీశ్ రావు యశోద ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు.

Harish mata ante lekka ledu china jeeyar ki

KCR: యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి 

09-12-2023 Sat 22:32 | Telangana
  • బాత్రూంలో జారిపడిన కేసీఆర్... హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు
  • సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు చికిత్స
  • కేసీఆర్‌కు పలువురు నేతల పరామర్శ
  • వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చినజీయర్ స్వామి
 
Chinna Jeeyar Swamy visits Yashoda Hospital

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు. 

నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. 

ఈ క్రమంలో శనివారం సాయంత్రం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి... మాజీ సీఎంను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్నజీయర్ స్వామి ఆకాక్షించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో చిన్నజీయర్ స్వామి కొంతసేపు మాట్లాడారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...