Jump to content

Intiki velle mundu pension penchadu anna..


psycopk

Recommended Posts

AP Cabinet: జనవరి నుంచి పెన్షన్లు రూ.3 వేలకు పెంపు... ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ 

15-12-2023 Fri 17:19 | Andhra
  • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
  • సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ భేటీ
  • పలు నిర్ణయాలకు ఆమోదం
  • హాజరైన మంత్రివర్గ సభ్యులు
  • 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందున్న సీఎం జగన్
 
AP Cabinet meeting details
Listen to the audio version of this article

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ భేటీ నిర్వహించారు. సీఎం జగన్ తో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వరకు మంత్రులు పర్యవేక్షిస్తుండాలని నిర్దేశించారు.

కేబినెట్ సమావేశం వివరాలు ఇవే...
 

  • జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంపు నిర్ణయానికి ఆమోదం  
  • ఆరోగ్యశ్రీ చికిత్స మొత్తం పరిమితి రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం  
  • జనవరిలో చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుకు ఆమోదం  
  • జనవరిలో ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ఆమోదం 
  • మిగ్జామ్ తుపాను పరిహారం, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం 
  • విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం 
  • విశాఖలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు నిర్ణయానికి ఆమోదం 
  • వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పజతకం అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్  కమిటీ నిర్ణయాలకు ఆమోదం 
  • రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీల్లో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం 
  • కోర్టుల సిబ్బంది, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై చర్చ 
  • యాంటీ నక్సల్ ఆపరేషన్లలో పాల్గొనే వారికి 15 శాతం భృతి పెంపు నిర్ణయానికి ఆమోదం 
  • 110 భూ కేటాయింపుల వ్యవహారాలు ఏపీఐఐసీకి అప్పగించడంపై చర్చ 
  • రాష్ట్ర సీసీ టీవీ నిఘా ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి రూ.552 కోట్ల రుణం తీసుకోవడంపై చర్చ 
  • కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలపై చర్చ  
  • ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై చర్చ 
  • ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 982 పోస్టులు సృష్టించాలని నిర్ణయం
20231215fr657c3d2324101.jpg
Link to comment
Share on other sites

Atchannaidu: రూ.3 వేల పెన్షన్‌పై నాలుగున్నరేళ్లుగా జగన్ మడత పేచీ: అచ్చెన్నాయుడు 

15-12-2023 Fri 17:31 | Andhra
  • పెన్షన్ ను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ ఆమోదం
  • పింఛనులో ఇది జగన్ మార్కు వంచన అంటూ అచ్చెన్న ధ్వజం
  • 2022 నాటికే పెన్షన్ రూ.3 వేలకు పెంచాల్సి ఉందని స్పష్టీకరణ
  • వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేశారంటూ ఆగ్రహం
 
Atchannaidu take a jibe at CM Jagan over penion hike
Listen to the audio version of this article

పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారని ఆరోపించారు. ఆ మాట ప్రకారం పెంచినా 2022 నాటికే రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. 

ఇప్పుడు ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా రూ.3 వేలు చేస్తున్నామంటూ, కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఇంకొక మోసం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. రూ.3 వేల హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడని వివరించారు. ఇదేనా పేదలపై చిత్తశుద్ధి? ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ? అంటూ నిలదీశారు. 

"నాడు తెలుగుదేశం ప్రభుత్వ సగటు బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లు మాత్రమే అయినప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశాం. ఐదేళ్లలో రూ.1,800 మేర పెంచాం. 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. వృత్తి కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లు ఇచ్చాం. 

జగన్ రెడ్డికి సగటు బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఐదేళ్లలో పెంచిన పెన్షన్ మొత్తం కేవలం రూ.750 మాత్రమే. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లూ అంతంత మాత్రమే. మరోవైపు ట్రాన్స్ జెండర్స్, బ్రాహ్మణ పెన్షన్లు రద్దు చేశారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నోటీసులు పంపిన నీచపు చరిత్ర జగన్ రెడ్డికే సొంతం. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. మొదటి ఏడాది నుంచే రూ.3 వేల చొప్పున పెన్షన్ అందేది. ఎల్లకాలం ప్రజల్ని మాటలతో మాయం చేయడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి" అంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Inthaki uddanam mana baboru neglect chesadu and last ki hospital techaru . Credit baboru dhi antav 

Baboru pasupu kumkum last lo cheyadam strategy , j@gga last lo chestey adhi elections stunt 

  • Haha 1
Link to comment
Share on other sites

33 minutes ago, ARYA said:

Lol looks like it, 2019 lo kuda end lo pasupu kumkuma anna canteens ani start chesaru, poye mundh govt ki ardam ipotundi anukunta vibe

Anna canteen mundhe start chesaru ga

Link to comment
Share on other sites

55 minutes ago, ARYA said:

Lol looks like it, 2019 lo kuda end lo pasupu kumkuma anna canteens ani start chesaru, poye mundh govt ki ardam ipotundi anukunta vibe

He said he will do it like every year penchumta last year ki 3K ane kadha starting nundi. Last year ki 3K chesadu. He implemented all his manifesto around 60% but Assam train confirmed. People ki boring vasthadi 2-3 years lo ne. 

Link to comment
Share on other sites

1 hour ago, Sucker said:

He said he will do it like every year penchumta last year ki 3K ane kadha starting nundi. Last year ki 3K chesadu. He implemented all his manifesto around 60% but Assam train confirmed. People ki boring vasthadi 2-3 years lo ne. 

Jaffa covering ki vachadu chusava @csrcsr

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, lokesh_rjy said:

More than 95% people will get on 1st it self 

we have to accept CBN time lo 2-3 kivachedi 

now Jaggaditime lo 15-16th kivasthundi 

Link to comment
Share on other sites

4 minutes ago, JANASENA said:

we have to accept CBN time lo 2-3 kivachedi 

now Jaggaditime lo 15-16th kivasthundi 

Bro telise antunava 

Cross check once 

1st morning 6 am ist nunche volunteers field lo ki vachi ivvatam start chestaru pensions 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...