Jump to content

Nara Lokesh: జగన్ యాదవులకు చేసిన మోసాల్లో ఇవి కొన్నే: నారా లోకేశ్


psycopk

Recommended Posts

Nara Lokesh: జగన్ యాదవులకు చేసిన మోసాల్లో ఇవి కొన్నే: నారా లోకేశ్ 

16-12-2023 Sat 15:37 | Andhra
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేశ్ యువగళం
  • యలమంచిలి నియోజకవర్గంలో యాదవులతో లోకేశ్ ముఖాముఖి
  • లోకేశ్ కు తమ సమస్యలు వివరించిన యాదవులు
  • అధికారంలోకి రాగానే యాదవులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న లోకేశ్
 
Lokesh held meeting with Yadava community people

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు లోకేశ్ కు తమ సమస్యలు వివరించారు. 

"టీడీపీ హయాంలో గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. జగన్ పాలనలో గొర్రెల కొనుగోలు కోసం రుణాలు ఇవ్వడం లేదు. యాదవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కృష్ణుడి గుడి కట్టుకోవడానికి సాయం అందించాలి. 50 ఏళ్లు దాటిన గొర్రెల పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలి. టీటీడీ బోర్డులో యాదవులకి ప్రత్యేక స్థానం కల్పించాలి. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలి. 

జగన్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశాడు... ఒక్క రుణం ఇవ్వడం లేదు. జగన్ పాలనలో ఒక్క యాదవ భవనం కట్టలేదు. మేము పశువులు మేపుకునే భూములు వైసీపీ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. గొర్రెలు చనిపోతే టీడీపీ హయాంలో ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇన్స్యూరెన్స్ ఇవ్వడం లేదు" అంటూ యాదవ సామాజికవర్గం ప్రతినిధులు ఆరోపించారు. 

 లోకేశ్ మాట్లాడుతూ...

జై యాదవ్... జై మాధవ్. యాదవ అనేగానే పౌరుషం గుర్తు వస్తుంది. యాదవులకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్ గారు. టీడీపీ ప్ర‌భుత్వంలో  రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకి ప‌ద‌విస్తే... జగ‌న్ రెడ్డి ఆర్థిక శాఖా మంత్రిగా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఇచ్చారు. నాడు టీడీపీ ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ని నియమిస్తే...జ‌గ‌న్ త‌న బాబాయ్ సుబ్బారెడ్డిని, ఇప్పుడు బంధువు భూమ‌న క‌రుణాకర్ రెడ్డిల‌ను టీటీడీ చైర్మ‌న్ చేశారు. 

చంద్ర‌బాబు గారు ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య యాదవ్ కి ఇస్తే, జ‌గ‌న్ ప్రభుత్వంలో రోజారెడ్డికి ఇచ్చారు. టీడీపీ తుడా ఛైర్మన్ గా నర్సింహ యాదవ్ ని చేస్తే, వైసీపీ ముందుగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని చేసింది... ఇప్పుడు వాళ్ల‌బ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అప్ప‌గించారు.... నా బీసీలు అంటూనే జ‌గ‌న్ రెడ్డి యాదవుల‌కి చేసిన మోసాలలో ఇవి కొన్నే. టీడీపీ ఆవిర్భావం నుంచీ యాద‌వుల‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తోంది.

బీదా రవిచంద్రయాదవ్ - ఎమ్మెల్సీ
గుండుముల తిప్పేస్వామి - ఎమ్మెల్సీ
బచ్చుల అర్జునుడు - ఎమ్మెల్సీ
రెడ్డయ్య- మచిలీపట్నం ఎంపీ... ఇలా అనేక పదవులు ఇచ్చాం.

టీడీపీ హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో (2014-19) రూ.278 కోట్లు ఖర్చు చేశాం. 90 శాతం సబ్సిడీతో ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. యాదవుల‌ను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించాం. 

యాద‌వ కార్పొరేష‌న్ కు నిధులివ్వ‌ని జ‌గ‌న్ యాద‌వుల‌పై క‌క్ష క‌ట్టి మ‌రీ దాడులు చేయించారు. అక్ర‌మ కేసులు బ‌నాయించారు. పెళ్లిలో అక్షింతలు వేశారనే నెపంతో యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా బీదా రవిచంద్ర యాదవ్‌పై దాడికి పాల్పడ్డారు. బచ్చుల అర్జునుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. పల్లా శ్రీనివాస్, అతని సోదరుని ఆస్తుల్ని ధ్వంసం చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే.... కృష్ణుడి ఆలయాలు కట్టడానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం. యాదవులకు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. గొర్రెలు చనిపోతే ఇన్స్యూరెన్స్ అందిస్తాం. 

ఉత్తరాంధ్రలో ఉన్న యాదవులు బీసీ-బి లో ఉండాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఎంపీ సీటుతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా యాదవ సామాజికవర్గం ప్రతినిధులకు కేటాయిస్తాం.

Link to comment
Share on other sites

Nara Lokesh: పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్చార్జుల మార్పుపై లోకేశ్ స్పందన 

16-12-2023 Sat 15:52 | Andhra
  • ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన జగన్
  • వ్యంగ్యంగా స్పందించిన నారా లోకేశ్
  • చెత్త ఎక్కడైనా చెత్తే అంటూ ఎద్దేవా
  • జగన్ ఓడిపోయే సీట్లు బీసీలకు ఇస్తున్నాడంటూ ఆరోపణలు 
 
Lokesh reacts on YCP incharges relocation

ఇటీవల రాష్ట్రంలోని 11 నియోజవర్గాలకు వైసీపీ ఇన్చార్జులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. 

మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్క ఇంటి ముందు పోసినంత మాత్రాన ఆ చెత్త బంగారం అవుతుందా...! అని ఎద్దేవా చేశారు. ఒక చోట అవినీతి చేసి, అసమర్థులుగా ముద్ర వేయించుకున్న వైసీపీ అభ్యర్థులు మరొక చోటుకు మారినంత మాత్రాన వారు మంచివాళ్లయిపోరు అని స్పష్టం చేశారు. 

ఓడిపోయే సీట్లు బీసీలకి ఇస్తున్న జగన్... గెలుస్తాం అనుకునే సీట్లు ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తున్నాడని లోకేశ్ ఆరోపించారు. కానీ, టీడీపీ అలా కాదు... గెలిచే సీట్లు మాత్రమే బీసీలకు కేటాయిస్తుంది అని ఉద్ఘాటించారు. మన బీసీలు, మన ఎస్సీలు అంటూ జగన్ మోసం చేస్తున్నాడని విమర్శించారు.

Link to comment
Share on other sites

Atchannaidu: యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ రావడంలేదు: అచ్చెన్నాయుడు 

16-12-2023 Sat 16:58 | Andhra
  • ఈ నెల 18తో ముగియనున్న లోకేశ్ పాదయాత్ర
  • డిసెంబరు 20న పోలేపల్లి వద్ద విజయోత్సవ సభ
  • తొలుత చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం
  • ఉమ్మడి మేనిఫెస్తో ఇంకా సిద్ధం కాలేదన్న అచ్చెన్నాయుడు
  • అందుకే పవన్ రావడంలేదని వివరణ
 
Atchannaidu says Pawan Kalyan will not attend to Yuvagalam closing meeting

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, భోగాపురం మండలం పోలేపల్లి వద్ద డిసెంబరు 20న యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. 

ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని తొలుత ప్రకటించారు. అయితే, యువగళం విజయోత్సవ సభకు పవన్ కల్యాణ్ రావడంలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధంకాలేదని, అందుకునే పవన్ ఈ సభకు హాజరుకావడంలేదని వివరించారు. 

ఈ సభకు చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ అగ్రనేతలు మాత్రమే హాజరవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాక చంద్రబాబు, పవన్ లతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. 

కాగా, పోలేపల్లిలో యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 6 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామని, ఈ సభ నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Link to comment
Share on other sites

Lokesh: రాష్ట్రంలో కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు: నారా లోకేశ్ 

16-12-2023 Sat 13:20 | Andhra
  • వ్యవసాయ రంగం కుదేలైందని టీడీపీ జాతీయ కార్యదర్శి ఆవేదన
  • అధికారంలోకి రాగానే శారద కాలువ పూడిక తీయిస్తామని రైతులకు హామీ
  • అనకాపల్లిలో లోకేశ్ ను కలిసిన గంగాదేవి పేట రైతులు
  • అంగన్ వాడీలకు అండగా ఉంటామని లోకేశ్ వెల్లడి
 
Nara Lokesh Yuvagalam Padayatra In Anakapalli

ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ కాలువల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కారు వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైందని విమర్శించారు. ఈమేరకు అనకాపల్లిలో తనను కలిసిన గంగాదేవి పేట రైతులతో లోకేశ్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. శారద కాలువ పూడిక తీయిస్తామని లోకేశ్ చెప్పారు. 

అనకాపల్లిలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ మునగపాకలో అంగన్ వాడీలు ఆందోళన శిభిరాన్ని సందర్శించారు. అంగన్ వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందిపోయి అంగన్ వాడీలను జగన్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఇది ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆరోపించారు. అంగన్ వాడీ కేంద్రాలను వాలంటీర్లతో నడిపిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల న్యాయమైన కోరికలను తీరుస్తామని లోకేశ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. 

 

Link to comment
Share on other sites

Nara Lokesh: టీడీపీలోకి వలసలు... పార్టీ కండువా కప్పిన నారా లోకేశ్ 

16-12-2023 Sat 22:07 | Andhra
  • అనకాపల్లి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • 3,100 కి.మీ మైలురాయి చేరుకున్న పాదయాత్ర
  • శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్
 
Nara Lokesh Yuvagalam Padayatra in Anakapalli

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి పట్టణం గౌరీ గ్రంథాలయం వద్ద 3100 కి.మీ.ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం-అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జిని పూర్తిచేస్తామని హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

224వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం తిమ్మరాజుపేట క్యాంప్ సైట్ నుంచి అభిమానుల జననీరాజనాల నడుమ ప్రారంభమైంది. అనకాపల్లి శివార్లలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, జనసేన ఇన్ చార్జి పర్చూరి భాస్కర్ రావు స్వాగతం పలికారు. 

కాగా, అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. జీవీఎంసీ 82వ వార్డులో యువగళం క్యాంప్ సైట్ లో సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ, గొలగం ఎంపీటీసీ టీడీపీలో చేరారు. 

వీరితో పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, మిల్క్ సొసైటీ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేశ్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం లోకేశ్  మాట్లాడుతూ...పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, పంచాయతీల నిధులు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లకు పైగా పంచాయతీల ఖాతాల నుండి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం...ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మీ నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలి అని పార్టీలోకి వచ్చిన నేతలను లోకేశ్ కోరారు.

అంగన్ వాడీల శిబిరాన్ని సందర్శించిన లోకేశ్ 

యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని లోకేశ్ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం చూపకపోగా, బెదిరింపుల ధోరణిలో మాట్లాడడం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని విమర్శించారు. 

అంగన్వాడీ సెంటర్లను తెరవకపోతే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో జగన్మహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని ఆరోపించారు. 

టీడీపీ పాలనలో రెండు సార్లు అంగన్వాడీల గౌరవవేతనాన్ని పెంచామని, అంగన్వాడీలు న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

లోకేశ్ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు

అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నారా లోకేశ్ స్పందిస్తూ... విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి అవగాహనా లేమి ప్రైవేటు టీచర్లకు శాపంగా పరిణమించిందని అన్నారు. 

కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు ఎటువంటి సాయం అందించకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రైవేట్ టీచర్లకు ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ , ప్రైవేటు మహిళా టీచర్లకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవులు వంటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 

ప్రైవేటు స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది పిల్లలకు ఆ సంస్థల్లో రాయితీతో విద్యనందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లోకేశ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు

అనకాపల్లి వేల్పుల వీధిలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5శాతం రిజర్వేషన్ ను అమలుచేసే అవకాశమున్నా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించినా ఉపయోగం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"మా పిల్లలు రిజర్వేషన్ అమలు కాకపోవడంతో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గతంలో అనకాపల్లిలో కాపు సంక్షేమ భవనానికి స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. వైసీపీ వచ్చాక ఆ భవన నిర్మాణాన్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని అవమానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మాకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, కాపు సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలి" అని నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్ స్పందిస్తూ...

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కాపుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని, కాపు కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయిస్తానని చెప్పి మోసగించారని వెల్లడించారు. 

"రాష్ట్రవ్యాప్తంగా నిమ్మకాయల చినరాజప్ప లాంటి కాపు ప్రముఖులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, అసంపూర్తిగా నిలచిపోయిన కాపు భవనాలను పూర్తిచేస్తాం. కాపు విద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తాం" అని వివరించారు. 

====

* యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3101.4 కి.మీ.*

*225వరోజు (17-12-2023) యువగళం వివరాలు*

*పెందుర్తి/గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు*

ఉదయం

8.00 – తోటాడ స్మార్ట్ సిటీ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – తోటాడ హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో సమావేశం.

8.30 – తోటాడ జంక్షన్ లో బిసిలతో సమావేశం.

8.45 – సిరసపల్లిలో స్థానికులతో సమావేశం.

9.45 – వెంకటాపురం సెంటర్ లో స్థానికులతో సమావేశం.

10.45 – పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.55 – భరణికం గ్రామంలో స్థానికులతో సమావేశం.

11.25 – పరవాడ సంతబయలు వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం

2.00 – పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామాల ప్రజలతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – పరవాడ సంతబయలు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – పరవాడ సంతబయలులో ఆక్వారైతులతో సమావేశం.

4.25 – పరవాడ రామాలయం వీధి వద్ద స్థానికులతో సమావేశం.

4.40 – పరవాడ చిన్నా స్కూలు వద్ద మహిళలతో సమావేశం.

4.55 – పరవాడ ఎమ్మార్వో ఆఫీసు జంక్షన్ లో అంగన్వాడీలతో భేటీ.

5.10 – పరవాడ ఐఓసి పెట్రోలు బంకు వద్ద రజకులతో సమావేశం.

5.20 – గొర్లవానిపాలెం జిజె కాలేజి వద్ద యువతతో ప్రత్యేక కార్యక్రమం.

5.25 – గొర్లవానిపాలెం బసవతారకం కాలనీ వద్ద మత్స్యకారులతో సమావేశం.

5.30 – గొర్లవానిపాలెం టిడ్కోగృహాల వద్ద గ్రామస్తులతో సమావేశం.

5.35 – గొర్లవానిపాలెం గౌతులచ్చన్న జంక్షన్ లో కాపులతో సమావేశం.

5.50 – గొర్లవానిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.05 – చింతలగొర్లవానిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.15 – గొర్లవానిపాలెం లారెన్స్ ల్యాబ్స్ ఎన్క్లేవ్ వద్ద స్థానికులతో సమావేశం.

6.25 – జాజులవానిపాలెంలో శాలివాహనులతో సమావేశం.

6.55 – దేశపట్నూరిపాలెంలో స్థానికులతో సమావేశం

రాత్రి

7.10 – స్టీల్ ప్లాంట్ గేటు వద్ద విశాఖ స్టీల్ కార్మికులతో సమావేశం.

7.30 – గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

7.40 – సెక్టార్ 10 బస్టాప్ వద్ద స్థానికులతో మాటామంతీ.

8.10 – సాయిబాబా గుడివద్ద స్థానికులతో మాటామంతీ.

8.55 – సెక్టార్ – 5 షాపింగ్ కాంప్లెక్స్ వద్ద స్థానికులతో మాటామంతీ.

9.10 – సిడబ్ల్యుసి-1 వద్ద విడిదికేంద్రంలో బస.

******

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...