Jump to content

కాంగ్రెస్ శ్వేత పత్రంపై అసలు వాస్తవాలు !! Telangana Vittal Analysis On Congress White PaperAssembly


appusri

Recommended Posts

Mukkodi Govt chala mislead chesindhi ga janalani. RR assembly lo icchina lekkala prakaram TG education lo India lo 31st position lo undhi anta.

Alane 80000 GOs dhaachi pettaru anta.

Ivi anni ae okka media lo raaledhu. Bagane manage chesaru.

Vithal gaari videos verevi kooda choosa. Konni shocking and new details thelusthunnayi about KCR and his family. KCR games correct explain chesthunnadu. KCR tho kalisipani chesaadu kadha udhyama samayam lo, andhuke he is able to explain the things clearly.

Migulu budget tho vacchina state ki ee 9 years lo 6,71,757 crores appulu ante chala ekkuva. Adhi kakunda liquor next two years already mundhe ammi aa money use chesaru. ORR toll cotracts Mumbai company ki around 7K crore ki icchadu. Based on current estimates easy ga around 35K crores income vacche chance undhi, inka konni asthulu ammaru like Kokapet lands. Warangal jail place kodhava petti 12000 kotlu appu tecchindu anta. Avi anni kulupukunte 6.7lakh crore kante ekkuve. Govt special ga kotthaga asthulu kooda bettindhi em ledhu.

Link to comment
Share on other sites

రాబడిలో 34 శాతం అప్పులకే

‘గత ప్రభుత్వం పరిపాలించిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రుణాల భారం అపారంగా పెరిగి ఆర్థికరంగంలో సంక్షోభం సృష్టించింది. అయినా.. చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరం.

రూ.6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
ఆదాయం లేని 5 సంస్థలకు అధిక వడ్డీలతో రూ.1.18 లక్షల కోట్లు తెచ్చారు
రుణాలకు వడ్డీలు, అసలు కలిపి చెల్లించింది రూ.2.34 లక్షల కోట్లు
అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు
శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి

123236033a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ‘గత ప్రభుత్వం పరిపాలించిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రుణాల భారం అపారంగా పెరిగి ఆర్థికరంగంలో సంక్షోభం సృష్టించింది. అయినా.. చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరం. రాష్ట్రంలో ఖర్చులకు అనుగుణంగా ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం. లోటును తీర్చడానికి అప్పులు చేయడంతో భారం పెరిగిపోయింది’ అని కొత్త ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొంది. అన్ని రకాలు కలిపి ప్రస్తుతం రాష్ట్రానికి రూ.6,71,757 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించింది. 2014-15లో బడ్జెట్‌ రుణభారం రూ.72,658 కోట్లు కాగా, 2023-24 నాటికి అవి రూ.3,89,673 కోట్లకు చేరాయని తెలిపింది. ప్రభుత్వ హామీతో ప్రత్యేక కార్పొరేషన్లు రుణంగా తీసుకోగా.. ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సినవి రూ.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో తీసుకుని.. ఆయా కార్పొరేషన్లే తిరిగి చెల్లించాల్సినవి రూ.95,462 కోట్లు, ప్రభుత్వ హామీ లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు మరో రూ.59,414 కోట్లు ఉన్నట్లు శ్వేతపత్రం పేర్కొంది. తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీ కింద 2015లో రూ.300 కోట్లు అయితే, 2023లో అది రూ.61,787 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. విద్య, వైద్యంపై ఖర్చు తగ్గిపోయిందని, 2023-24లో వీటిపై వెచ్చించే మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువగా ఉందని పేర్కొంది. రాష్ట్ర వార్షిక రెవెన్యూ రాబడిలో 34 శాతం సొమ్ము అప్పుల చెల్లింపులకే పోతోందని వివరించింది. ఆర్థికశాఖ మంత్రి కూడా అయిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్లు వ్యయం చేశారు. వీటితో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, విద్యుదుత్పత్తి కేంద్రాల వంటి ఆస్తులను సృష్టించారు.
  • కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత తొమ్మిదిన్నరేళ్లలో రూ.6.71 లక్షల కోట్ల అప్పులు తేవడం వల్ల ఆర్థికరంగంపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇన్ని అప్పులు తెచ్చినా సరైన స్థాయిలో ఆస్తులను మాత్రం సృష్టించలేకపోయారు.

328 రోజులు ఓడీలే

2022-23 ఆర్థిక సంవత్సరంలో 365కి గాను 328 రోజుల పాటు రిజర్వుబ్యాంకు నుంచి ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ ఓడీ కింద అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది (2014-15) ఇలా ఒక్కరోజు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఆ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారడంతో ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ ఓడీకి వెళ్లే రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతూ గత ఏడాది రికార్డుస్థాయిలో 328కి చేరింది. ఈ ఏడాది నవంబరు నెలాఖరు నాటికే 214 రోజులు ఇలా ఓడీ తీసుకుంది.

శ్వేతపత్రంలో ప్రభుత్వం


ఆదాయం లేని సంస్థలకు అధిక వడ్డీలతో రుణాలు

మొత్తం ప్రభుత్వరంగ సంస్థలు కలిపి తీసుకున్న రుణాల్లో అసలు ఆదాయం లేని 5 సంస్థలు అధిక వడ్డీలకు తెచ్చినవే 95 శాతం ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించే రుణాలకు సగటున వడ్డీ 7.63 శాతమే ఉండగా ఈ అయిదు సంస్థలు తీసుకున్న రూ.1,18,271 కోట్లకు 8.93 నుంచి 10.49 శాతం వరకు వడ్డీ పడుతోంది. వీటిలో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు సంస్థకు 9.69 శాతం వడ్డీతో రూ.74,590 కోట్లు, తెలంగాణ తాగునీటి సరఫరా సంస్థకు 9.48 శాతం వడ్డీతో రూ.20,200 కోట్లు, తెలంగాణ రాష్ట్ర నీటివనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు 10.49 శాతం వడ్డీతో రూ.14,060 కోట్లు, తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు 8.98 శాతం వడ్డీతో రూ.6,470 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థకు 8.93శాతం వడ్డీతో రూ.2951 కోట్లు రుణాలు తీసుకున్నారు.

పనుల పూర్తికే మరో రూ.72,983 కోట్ల అప్పులు తేవాలి

తెలంగాణ ఏర్పడిన తరువాత గత తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం 24 ప్రభుత్వ శాఖల్లో వివిధ రకాల అభివృద్ధి, ఇతర పనులు చేయడానికి 39,175 టెండర్‌ ఒప్పందాలను చేసుకున్నారు. ఇవి పూర్తి కావాలంటే మొత్తం రూ.3,49,843 కోట్లు అవసరం.  ఇందులో ఈ నెల 4 నాటికి రూ.1,89,903 కోట్లు వ్యయం చేశారు. మిగిలిన రూ.1,59,940 కోట్లు ఖర్చుపెట్టాలంటే రాష్ట్ర బడ్జెట్లలో ప్రభుత్వమే సొంత వనరుల నుంచి రూ.86,957 కోట్లు కేటాయించినా.. మరో రూ.72,983 కోట్లు అప్పులు తేవాలి.

పెండింగు బిల్లులకు రూ.40,154 కోట్లు అవసరం

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టులు, వివిధ రకాల పనులకు సరఫరాదారులు ప్రభుత్వానికి సమర్పించిన 4,78,168 బిల్లులకు రూ.40,154 కోట్లను ఖజానా నుంచి ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంది. వీటికి నిధుల కొరతతో ఆర్థికశాఖ పెండింగులో పెట్టింది.

పెరుగుతున్న ద్రవ్యలోటు

అప్పులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, పెట్టిన వ్యయానికి మధ్య ఏర్పడే అంతరాన్ని ఆర్థిక ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. ఇది ఎంత ఉంటే అంతమేర అప్పులు ఏటా తీసుకుంటారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో ఈ ఆర్థిక ద్రవ్యలోటు రూ.9410 కోట్లుంటే ఈ ఏడాది రూ.38,235 కోట్లు ఉండవచ్చని బడ్జెట్‌ అంచనా. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 2020-21లో రూ.49,038 కోట్లు నమోదైంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఏటా సగటున 3.7 శాతానికి సమానమైన సొమ్ము ఆర్థిక ద్రవ్యలోటు ఉంటోంది. 2020-21లో ఏకంగా 4.1 శాతం నమోదైంది. దేశంలో ఆర్థిక నిర్వహణ ఘోరంగా ఉన్న పంజాబ్‌ 4.5, కేరళ 4.9ల తరువాత తెలంగాణ దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. వెనుకబడిన రాష్ట్రాలు ఝార్ఖండ్‌ 0.7, ఒడిశా మైనస్‌ 3.1, ఛత్తీస్‌గఢ్‌ 1.5 శాతంతో తెలంగాణ కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నాయని శ్వేతపత్రం వివరించింది.

విద్యకు 7.6 శాతం కేటాయింపులతో చిట్టచివరన

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యంపై ఎక్కువ వ్యయం చేయాలి. దిల్లీ బడ్జెట్‌లో ఏకంగా 24.3 శాతం, రాజస్థాన్‌లో 19.5, ఛత్తీస్‌గఢ్‌లో 19.4 శాతం సొమ్మును విద్యారంగంపై ఖర్చు చేస్తుంటే తెలంగాణ కేవలం 7.6 శాతం కేటాయింపులతో చిట్టచివరన ఉందని గత అక్టోబరులో విడుదల చేసిన ‘రాష్ట్ర ఆర్థిక నివేదిక’లో తేలింది.

ప్రస్తుత ఏడాది వైద్యరంగంపై జాతీయస్థాయిలో రాష్ట్రాల బడ్జెట్లలో సగటున 6.2 శాతం సొమ్మును బడ్జెట్‌లో ఖర్చు చేస్తుంటే తెలంగాణ 5 శాతంతో చివరి నుంచి పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటకల తరువాత 4వ స్థానంలో ఉంది. దిల్లీ రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా 14.3 శాతం సొమ్మును వైద్యంపై వెచ్చిస్తున్నారు.

జీతాలు, పింఛన్లకు రాబడిలో 35 శాతం సొమ్ము

రాష్ట్ర వార్షిక రెవెన్యూ రాబడిలో 35 శాతం సొమ్ము ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకే పోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017-18 వార్షిక రాబడిలో 43 శాతం సొమ్ము ఈ పద్దు కింద చెల్లించగా గత ఏడాది (2022-23)లో 35 శాతానికి తగ్గి రూ.55,925 కోట్లకు చేరింది.


రోజువారీ ఖర్చులకు అధిక వడ్డీలతో అత్యవసర నిధి వినియోగం

రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం పెరిగిపోయి రోజువారీ ఖర్చులకు నిధులు లేకపోతే రిజర్వుబ్యాంకు ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) పేరుతో అప్పటికప్పుడు అధిక వడ్డీలకు సొమ్ము సర్దుబాటు చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు ఇలా ఓడీలు తీసుకున్నారనే వివరాలను బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలిసిపోతుంది. ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ ఓడీ పద్దుల కింద రిజర్వుబ్యాంకు నుంచి ఎక్కువ రోజులు డబ్బులు తీసుకుంటే అధిక వడ్డీ భారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతుంది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోతే ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ ఓడీకి ఎక్కువ రోజులు వెళుతుందని అర్థం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో ఖజానాలో ఏకంగా 303 రోజుల పాటు మిగులు నిధులుండగా ఈ ఏడాది (2023-24)లో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయి.


gh201223main1b.jpg

gh201223main1c.jpg

gh201223main1e.jpg

 

Link to comment
Share on other sites

రాష్ట్రాన్ని దివాలా తీయించారు

పదేళ్లలో గత ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ అభూత కల్పనలు, అబద్ధాలు, ఆర్భాట ప్రచారంపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టామన్నారు.

అప్పు కావాలని రోజూ ఆర్‌బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి
కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి.. లక్ష ఎకరాలకూ సాగునీరివ్వలేదు
వాస్తవాలను ప్రజల ముందుంచాం
శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి

gh201223main2a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్లలో గత ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ అభూత కల్పనలు, అబద్ధాలు, ఆర్భాట ప్రచారంపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు.తెలంగాణను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదని విమర్శించారు. గత పదేళ్లలో భారాస ప్రభుత్వం రూ.13.72లక్షల కోట్ల బడ్జెట్‌ నిధులు ఖర్చు చేసినా.. ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్రంలో రూ.లక్షల కోట్లు దిగమింగి, ఆర్థిక విధ్వంసం సృష్టించి, ఇప్పుడు అబద్ధాలతో ఆ నేతలు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ సృష్టించిన సంపదను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భారాస తమ కుటుంబ తగాదాలను సభలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఎవరినీ అవమానించడానికి కాదు...

‘‘ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో శ్వేతపత్రం విడుదల చేశాం. ఎవరినో కించపరచడానికో.. అవమానించడానికో కాదు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు ఈ శ్వేతపత్రం విడుదల చేశాం. పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం. అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందించి తెలంగాణను దేశంలోనే బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యం.

ప్రధానిని కలుస్తానని కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేశా

రాష్ట్రాభివృద్ధి విషయంలో మాకెలాంటి భేషజాలు లేవు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి నేనే స్వయంగా ఫోన్‌చేశా. మేం కక్షపూరితంగా వ్యవహరించం. భేషజాలకు వెళ్లబోం. దుందుడుకు చర్యలకు పాల్పడబోం. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తా. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. అందుకే సచివాలయంలో మంత్రుల్ని కూర్చోబెట్టాం. ప్రజాభవన్‌లో వినతులు స్వీకరిస్తున్నాం. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ఆర్థిక స్థితిపై శ్వేతపత్రంలోని అంకెలపై కొందరు సందేహాలు లేవనెత్తారు. రుణాలు, అడ్వాన్స్‌లపై ఆర్‌బీఐ నివేదికలు, ఆదాయ, వ్యయాలపై కాగ్‌ నివేదిక, ఇతరత్రా సమాచారాన్ని బడ్జెట్‌ నుంచి సేకరించి శ్వేతపత్రం విడుదల చేశాం. శ్వేతపత్రంపై ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం పెట్టారు. వాస్తవాలను ప్రజల ముందు పెట్టి పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలు, దుష్ఫలితాల గురించి చర్చించి వివరించాలని... ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలన్నది మా ఉద్దేశం. అమలు కష్టమైనా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం.

gh201223main2b.jpg

ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న భారాస

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిన సంపదను తనఖాపెట్టి భారాస సర్కార్‌ అప్పులు తెచ్చింది. ఆర్టీసీకి మేం కట్టిన జూబ్లీ, మేడ్చల్‌, రాణిగంజ్‌ బస్టాండ్‌లు తనఖా పెట్టి రూ.2,886.95 కోట్లు తీసుకుంది. 2014కు ముందు సృష్టించిన విద్యుత్తు సంస్థల ఆస్తులపై జెన్‌కో రూ.2,100 కోట్లు, ఎన్‌పీడీసీఎల్‌ రూ.2,800 కోట్లు అప్పులు తెచ్చాయి. విద్యుత్తుశాఖలో సృష్టించిన సంపదపై భారాస అప్పులు చేసి, మా మీదే ఆరోపణలకు దిగుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రూ.6,500 కోట్లతో సృష్టించిన 159 కి.మీ. అవుటర్‌ రింగురోడ్డు ఇప్పుడు రూ. లక్షలకోట్ల విలువైనది. ఈ ఆస్తిని రూ.7,300 కోట్లకు అమ్మేసింది. 2014లో ఏడాదిలోగా 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంది. 2021లో బిశ్వాల్‌ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తెలిపింది. భారాస ప్రభుత్వం వచ్చాక కొత్త ఉద్యోగాలు భర్తీ చేసిందా? లేక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయా? డిసెంబరు, జనవరిలో పిలవాల్సిన మద్యం టెండర్లను నాలుగు నెలల ముందుగానే పిలిచి రూ.2,500కోట్ల పేదల సొమ్ము కొల్లగొట్టింది. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే ఇలాంటివన్నీ చేసి.. తరువాత అధికారంలోకి వచ్చేవారు నిలదొక్కుకునే అవకాశం లేకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది.

పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు..

గత పదేళ్లలో మొత్తం రూ.13.72 లక్షల కోట్లు ఖర్చు చేసినా... గత ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి రాలేదు. విద్యార్థులకు రూ.4వేల కోట్లకు పైగా ఫీజు బకాయిలు అలాగే ఉన్నాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు నిధులు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన వంట కార్మికులు, సచివాలయ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సరిగా వేతనాలు ఇవ్వలేదు. ట్రిపుల్‌ఐటీలో తగిన వసతులు లేక, నాణ్యమైన భోజనం అందించకపోవడంతో విద్యార్థులు చనిపోయారు. ఈ విషయమై భారాస ప్రభుత్వాన్ని నిలదీస్తే ముఖం చాటేసింది. చివరకు ఉద్యోగులకు ప్రతి నెల ఒకటోతేదీన వేతనాలు ఇవ్వలేదు. దానివల్ల చెక్కులు బౌన్స్‌ అయి ఉద్యోగుల సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోయింది. దాంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రెండు మూడు నెలలైనా ఆసరా పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు.

రుణ సంస్థల్ని తప్పుదోవ పట్టించారు

కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80 వేల కోట్లతో నిర్మించామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పడం అబద్ధం. కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణాలే రూ.97,449 కోట్లు. ఇది కాక ప్రభుత్వం చేసిన వ్యయం అదనం. ఈ రెండింటిని కలిపి లెక్కిస్తేనే కాళేశ్వరం వ్యయం తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి భారాస ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు నీటి ద్వారా ఏటా రూ.5,199 కోట్లు వస్తుందని దీని ద్వారా రుణాలు చెల్లిస్తామని సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది. అదే విధంగా మిషన్‌ భగీరథ నీటిని విక్రయించడం ద్వారా ఏటా రూ.5,700 కోట్లు వస్తుందని తెలిపింది. ఇవన్నీ రుణ సంస్థల్ని తప్పుదోవపట్టించడం కాదా? ఈ రుణాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని గుర్తించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.


2014లో భారాసకు అధికారాన్ని అప్పగించే నాటికి రిజర్వుబ్యాంకు వద్ద రాష్ట్రానికి సంబంధించి నిధుల నిల్వలు సగటున 303 రోజులకు సరిపడా ఉండేవి. ఇప్పుడు రోజూ అప్పుకావాలని ఆర్‌బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.


మా ప్రజా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండబోవు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు అఖిలపక్ష సలహాలు, సూచనలు తీసుకుంటాం.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెబితే భారాస నాయకులు పరువు పోతుందంటున్నారు. ఇప్పుడు వారి పరువు కాపాడాలా? రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలా? పేదలకు, వృద్ధులకు పెద్దకొడుకుగా చెప్పుకొన్న మాజీ సీఎం కేసీఆర్‌...వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

అప్పు తీర్చడానికి అప్పులా?

‘అన్ని వనరులూ ఉన్న రాష్ట్రం తెలంగాణ. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి తెచ్చారు. రుణాలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేస్తూ వచ్చారు.

Published : 21 Dec 2023 02:59 IST
 
 
 
 
 
 

రోజువారీ ఖర్చులకూ నిధుల్లేని దుస్థితి
ఒక్కో కుటుంబంపై రూ. 7 లక్షల రుణభారం
శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క

gh201223main3a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ‘అన్ని వనరులూ ఉన్న రాష్ట్రం తెలంగాణ. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి తెచ్చారు. రుణాలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేస్తూ వచ్చారు. ఇంత కంటే దరిద్రం ఇంకేమైనా ఉందా?’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి లఘు చర్చను ప్రారంభించిన సందర్భంగా, పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానమిస్తూ ఆయన ప్రసంగించారు. రిజర్వుబ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్‌(ఓడీ) ద్వారా తెచ్చే డబ్బుపై ఆధారపడి పాలన సాగించాల్సిన దుస్థితిని భారాస ప్రభుత్వం కల్పించిందని ఆరోపించారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడాం. ప్రజల జీవితాలు మారాలని.. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ ఏర్పడాలని, అందులో అందరం అభివృద్ధి చెందాలని ఆశించాం. అలా సాకారమైన తెలంగాణను దశాబ్ద కాలం పాటు పరిపాలించిన భారాస ప్రభుత్వం.. అనుకున్న లక్ష్యం వైపు నడిపించకుండా ప్రజల కలలను హరించింది. దశాబ్దకాలంగా జరిగిన ఆర్థిక అరాచకం, తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ఉంది. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కలలు నెరవేర్చడానికి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతుల గురించి పవిత్రమైన ఈ శాసనసభ నుంచి వాస్తవాలను వెల్లడిస్తున్నాం. మార్పును కోరుకుంటూ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సహేతుకమైన పాలన అందించాలని.. ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. శాసనసభలో ఉన్న సభ్యులు శ్వేతపత్రంపై సహేతుకమైన సలహాలు, సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం.

ఆర్థిక పరిస్థితి ప్రజలకు అర్థం కావాలి

శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు చెబుతుంటే.. రాష్ట్రం పరువు తీస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు. పట్టుబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కే రాష్ట్రంపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆర్థిక వనరులు, పరిస్థితి గురించిన వాస్తవాలు సంపూర్ణంగా ప్రజలకు అర్థం కావాలనే శ్వేతపత్రం ఇచ్చాం. మాకు వేరే దురుద్దేశాలేవీ లేవు. వాస్తవానికి మేం 2014 నుంచీ.. బడ్జెట్‌ అంచనాలకు, ఆదాయానికి సంబంధం లేకుండా చేస్తున్నారని చెబుతూనే ఉన్నాం. సాధారణంగా బడ్జెట్‌కు, ఖర్చుకు 5-10 శాతం వ్యత్యాసం ఉంటుంది. భారాస సర్కారు దాన్ని 20 శాతానికి పెంచి అప్పులపాలు చేసింది. ఇప్పుడు శ్వేతపత్రంతో అది కళ్ల ముందు కనిపిస్తోంది. అంకెల గారడీ చేసి, మసిపూసి మారేడుకాయ చేశారు. ఈ రాష్ట్రానికి అద్భుత అవకాశాలున్నా ఆర్థిక ప్రణాళిక లేక తీవ్ర నష్టం చేశారు. కార్పొరేషన్లు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. 1956 నుంచి 2014 వరకు రూ. 4.98 లక్షల కోట్లు రాష్ట్రం కోసం బడ్జెట్ల ద్వారా ఖర్చు చేశారు. అంత తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆస్తులు సృష్టించాం. సాగర్‌ నుంచి దేవాదుల వరకు సాగునీటి ప్రాజెక్టులు, ఐఐటీ నుంచి ట్రిపుల్‌ ఐటీ వరకు, ఐఐసీటీ నుంచి టీఐఎఫ్‌ఆర్‌ వరకు, మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, అనేక పరిశోధన సంస్థలు, హైటెక్‌ సిటీ, మెట్రో రైలు.. ఇలా ఎన్నో కళ్ల ముందు కనిపిస్తాయి. గత పదేళ్లలో అలాంటిది ఒక్కటి చూపించండి. ఏమి ఆస్తులు స్పష్టించారో చెప్పండి. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు తప్ప. కాళేశ్వరం కూడా ఏమైందో ఈ మధ్యే చూశాం. మా సీఎం ఇప్పుడే చెబుతున్నారు.. రెండు ఫామ్‌హౌస్‌లు సృష్టించారని.. అవును. అంతకంటే ఏమీ లేదు’ అని భట్టి తెలిపారు.

4 కోట్ల మందికి స్వేచ్ఛ ఇచ్చాం

భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంతో కొందరు కాంగ్రెస్‌ సభ్యులు శ్రీహరికి స్వేచ్ఛ వచ్చిందని చమత్కరించారు. దానికి స్పందిస్తూ.. ‘శ్రీహరికే కాదు.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఇప్పటి వరకు ప్రజలు భయం భయంగా బతికారు. ఎప్పుడైనా సభలో ఇలా నవ్వుకున్నామా? శ్రీహరీ.. మీకేం భయం లేదు. ఇక స్వేచ్ఛగా బతకొచ్చు. నిరసన తెలపవచ్చు. అందుకే కదా మీరు పోడియం వద్దకు వెళ్లింది.. శ్వేతపత్రం తప్పుల తడక అని హరీశ్‌రావు అంటున్నారు. తప్పులేం లేవు.. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


గత సర్కారు చేసిన తప్పులు చేయం

‘గత ప్రభుత్వం చేసిన తప్పులు మేం చేయబోం. ఆర్థిక క్రమశిక్షణతో పాలనారథాన్ని పట్టాలపైకి ఎక్కిస్తాం. అంకితభావంతో అభివృద్ధి, సంక్షేమాన్ని కలగలిపి ముందుకు సాగుతాం. భారాస ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. తెలంగాణ ఏర్పడక ముందు 70 ఏళ్లలో రూ.70 వేల కోట్ల అప్పు ఉండగా.. భారాస ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో కుటుంబంపై రూ. 7 లక్షల రుణభారం పడింది. ఓడీలకు వెళ్లడం అంటే రాష్ట్రం దివాలా తీయడమే. డీజిల్‌, పెట్రోల్‌, జీతాలకు సైతం ఓడీకి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సమర్థించుకోవడానికి భారాస ప్రయత్నించడం సిగ్గుచేటు. మిషన్‌ భగీరథ ద్వారా రూ. వేల కోట్లు వెచ్చించి 1.25 లక్షల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేసినా.. గ్రామాలు, గిరిజన గూడేలకు నీరందించలేదు. శ్వేతపత్రాన్ని పూర్తిగా తెలంగాణ అధికారులే రూపొందించారు. వారిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా లక్ష్యం ఇందిరమ్మ రాజ్యం. అందరికీ ఇళ్లు, అందరికీ నీళ్లు, యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా సంకల్పం అని భట్టి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

36 minutes ago, appusri said:

Mukkodi Govt chala mislead chesindhi ga janalani. RR assembly lo icchina lekkala prakaram TG education lo India lo 31st position lo undhi anta.

Alane 80000 GOs dhaachi pettaru anta.

Ivi anni ae okka media lo raaledhu. Bagane manage chesaru.

Vithal gaari videos verevi kooda choosa. Konni shocking and new details thelusthunnayi about KCR and his family. KCR games correct explain chesthunnadu. KCR tho kalisipani chesaadu kadha udhyama samayam lo, andhuke he is able to explain the things clearly.

Migulu budget tho vacchina state ki ee 9 years lo 6,71,757 crores appulu ante chala ekkuva. Adhi kakunda liquor next two years already mundhe ammi aa money use chesaru. ORR toll cotracts Mumbai company ki around 7K crore ki icchadu. Based on current estimates easy ga around 35K crores income vacche chance undhi, inka konni asthulu ammaru like Kokapet lands. Warangal jail place kodhava petti 12000 kotlu appu tecchindu anta. Avi anni kulupukunte 6.7lakh crore kante ekkuve. Govt special ga kotthaga asthulu kooda bettindhi em ledhu.

That vittal is different Veedevado chillar mallilgadu laga unnadu. 

Link to comment
Share on other sites

1 minute ago, Pahelwan2 said:

That vittal is different Veedevado chillar mallilgadu laga unnadu. 

Its same Vittal. Ee video lo Raghu cheppadu vinu. And I saw other videos where the same Vittal has talked about his role and close working with KCR. Maa chiccha ideas anni naaku thelusu, chiccha nature thelusu, elanti steps theesukuntaado kooda thelusu ani elections ki mundhu, elections lo odipoyana videos lo choosa.

Link to comment
Share on other sites

Go through this …. Congress vallu still talking like in opposition … Entha sepu appulu antunnaru tappa tangibile assets development gurnchi cheppatledu …

 

GSDP ratio is 26% which is decent for a developing state …  there atleast 15 states ahead of TG … 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...