Jump to content

Inside info on pk nd jagan conflict..


psycopk

Recommended Posts

Kodali Nani: ప్రశాంత్ కిశోర్ ను 2019లోనే వాడేశాం!: కొడాలి నాని 

24-12-2023 Sun 15:44 | Andhra
  • నిన్న చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
  • చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయ నేత అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు
  • ఒట్టిపోయిన గేదెలాంటి ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా పెట్టుకున్నాడని విమర్శలు
  • ప్రశాంత్ కిశోర్ బుర్రలోని గుజ్జంతా తాము పీల్చేశామని వెల్లడి
 
Kodali Nani comments on Chandrababu meeting with Prashant Kishor

టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ 3 గంటల పాటు సమావేశమయ్యారని, ఇక భూమి బద్దలవుతుందని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. 

చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయనేత అని జగన్, తాము అనేకసార్లు చెప్పామని అన్నారు. ప్రశాంత్ కిశోర్ ను తాము 2019లోనే వాడేశామని తెలిపారు. అతని బుర్రలోని గుజ్జంతా అయిపోయిందని, ఒట్టిపోయిన గేదె లాంటి అతడ్ని తీసుకెళ్లి చంద్రబాబు వ్యూహకర్తగా పెట్టుకుంటున్నాడని విమర్శించారు. 

"ఇదే ప్రశాంత్ కిశోర్ ను మేం వ్యూహకర్తగా పెట్టుకుంటే, వాడెవడో బీహార్ నుంచి వచ్చాడట తమ్ముళ్లూ... మనల్ని ఏం పీకుతాడు, మనకంటే గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో ఉన్నారా? అని చంద్రబాబు మాట్లాడాడు. జగనే బాబాయ్ హత్య చేయించారని, జగనే కోడికత్తితో పొడిపించుకున్నారని, వీటి వెనుక ఉన్నది ప్రశాంత్ కిశోరే అని చంద్రబాబు చెప్పాడు. ప్రజలను రెచ్చగొట్టి గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక రచించాడని అన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ను పెట్టుకున్నారు కదా... మరి చంద్రబాబు పీక కోయించుకుంటాడా, లేక, లోకేశ్ తండ్రిని చంపుతాడా? అనేది వాళ్లకే తెలియాలి. 

చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్. మేం ఎప్పుడో 2019లో వాడేసిన వ్యక్తిని తీసుకొచ్చి 2024 ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు. అసలు, ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు సంబంధం లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక నేను వ్యూహకర్తగా పనిచేయడం లేదు, బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టాను అని ప్రశాంత్ కిశోరే చెప్పాడు. నిన్న అతడు చంద్రబాబు వద్దకు వచ్చింది కూడా మమతా బెనర్జీ తరఫున మాట్లాడ్డానికి. ఇండియా కూటమిలో చేరమని అడగడానికి వచ్చాడు. 

చంద్రబాబు ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు, మరో పీకేని పెట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబునాయుడిది రెండు కళ్ల సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడో చంద్రబాబుకు అర్థంకావడంలేదు. కేంద్రంలో బీజేపీ వస్తుందో, లేక కాంగ్రెస్ వస్తుందో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అందుకే... వాళ్లు కాకపోతే వీళ్లు, వీళ్లు కాకపోతే వాళ్లు అనుకుంటూ ఇద్దరు పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ పీకేని పెట్టుకున్నా జగన్ వెంట్రుక కూడా పీకలేరు" అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Asalu vedini evadu adigadu

GVL: చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ కలిస్తే మాకేంటి సంబంధం?: జీవీఎల్ 

24-12-2023 Sun 15:15 | Andhra
  • చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై జీవీఎల్ స్పందన
  • ఆ భేటీ గురించి టీడీపీ చెబితేనే బాగుంటుందని వెల్లడి
  • ఈ సమావేశంపై బీజేపీ స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
 
GVL responds on Prashant Kishor meeting with Chandrababu

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అనదగ్గ చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ కలిస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.

"ప్రశాంత్ కిశోర్ తో సమావేశం గురించి చంద్రబాబు అయినా చెప్పాలి, లేకపోతే, ఈ భేటీలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ అయినా చెప్పాలి. ఈ భేటీపై బీజేపీ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టుగా టీవీలో చూశాను. ఇది మేం పరిశీలనలోకి తీసుకోదగ్గ అంశం కాదు. 

రాజకీయాల్లో అనేకమంది ఒకరినొకరు కలుస్తుంటారు. చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ ఎందుకు కలిశారన్నది టీడీపీ వాళ్లు చెబితేనే బాగుంటుంది. దీనిపై మేం స్పందించాల్సిన పనిలేదు. మా పార్టీ వ్యవహారాలనే మేం పట్టించుకుంటాం. మేం ఇతర పార్టీల నిర్ణయాల జోలికి వెళ్లం, కానీ ఇతర పార్టీల వారు మా పార్టీలో జరగని అంశాలపై కూడా జరిగినట్టుగా వ్యాఖ్యానించడం వారిలో ఉన్న ఆందోళనను తెలియజేస్తోంది. 

ఎన్నికల్లో బీజేపీ ఏ ప్రణాళికతో వెళ్లాలన్నది మా పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. దీనిపై ఇతర పార్టీలు ఆందోళన చెందాల్సిన పనిలేదు" అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Center lo Congress vasthe CBN ki help avuthundhi lekunte ekkada CBN vachina not useful for him and AP. PK is with Congress alliances. Better CBN go with BJP lekunte power vachina not much useful AP ki. Looks like CBN government e sari ki but will he get support from center akkada BJP vasthe ? YCP is done deal for this elections anyway. My parents YCP ki support but they are saying AP is in bad shape everu vachina we same same story at least for another decade. Sad reality. Move on. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...