1. భూమి అత్యంత కీలకమైన ఉత్పత్తి సాధనం. సరళీకృత ఆర్థిక విధానాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భూమి విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. కార్పోరేట్ సంస్థలు, బడా కంపెనీల డేగ కళ్ళు భూములపై పడ్డాయి. భూ కబ్జాదారులు - మాఫియా ముఠాల నుండి గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో నిజమైన హక్కుదారులు తమ భూమిని -స్థిరాస్తులను, సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి అయిన భూములు - సహజ వనరులను పరిరక్షించుకోడం పెద్ద సమస్యగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం-2023ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పౌరులం