Jump to content

Narendra Modi: అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించిన ప్రధాని మోదీ


psycopk

Recommended Posts

Narendra Modi: అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

18-01-2024 Thu 21:41 | National
  • జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం
  • 6 స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ
  • పలు దేశాలు రాముడిపై విడుదల చేసిన స్టాంపులతో పుస్తకం కూడా ఆవిష్కరణ
 
PM Modi launches stamps on Ayodhya Ram Mandir
Listen to the audio version of this article

జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో... గణనాథుడు, రామ మందిరం, హనుమంతుడు, శబరిమాత, జటాయువు, కేవత్ రాజ్ స్టాంపులను మోదీ నేడు ఆవిష్కరించారు. రామాయణాన్ని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను ప్రత్యేకంగా రూపొందించారు. 

రాముడిపై ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా మోదీ నేడు విడుదల చేశారు. రాముడిపై ఇప్పటిదాకా 20 దేశాలు స్టాంపులు విడుదల చేయగా... వాటన్నింటినీ కూడా ఈ 48 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. వీటిలో ఐక్యరాజ్యసమితి రాముడిపై రూపొందించిన స్టాంపు కూడా ఉంది.
20240118fr65a94d75bc598.jpg20240118fr65a94d7eeff0a.jpg20240118fr65a94d92132c4.jpg

 

Link to comment
Share on other sites

Bandi Sanjay: కరీంనగర్‌లో రామాలయం, శివాలయాన్ని శుభ్రం చేసిన బండి సంజయ్ 

18-01-2024 Thu 22:18 | Telangana
  • ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్
  • రామమందిర అక్షితల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని సూచన
  • అక్షితలలో బాస్మతీ, రేషన్, జైశ్రీరామ్ బియ్యం ఉండవని సెటైర్
 
Bandi Sanjay cleans Shiva temple

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం స్వయంగా కరీంనగర్‌లోని రామాలయం, శివాలయాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన మేరకు ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... అయోధ్య రామమందిరానికి సంబంధించి రాముడి అక్షితల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.

అక్షితలలో బాస్మతీ బియ్యం.. రేషన్ బియ్యం.. జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? అని చురక అంటించారు. అక్షితలు అక్షితలే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వాటి పవిత్రత తెలియకుండా మాట్లాడితే ఎలా? అన్నారు. అక్షితల కార్యక్రమాన్ని విమర్శించే వారి ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు. తెలియకుంటే మీ ఇంటి వారిని... మీ పక్కింటి వారిని.. అర్చకులను అడగాలని హితవు పలికారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...