Jump to content

Kumari aunty

Mr Mirchi

Recommended Posts

1 hour ago, Mr Mirchi said:

Hope this is not true

Aa area motham clear cheyyalani court lo case nadustundhanta clear ga cheppadu ga traffic athanu ..Full traffic jam bro media vallu lekapothe happies aunty ki 

Link to comment
Share on other sites

Kumari Aunty: 'కుమారి ఆంటీ' ఫుడ్ సెంటర్ మూసివేత చిచ్చు.. టీడీపీ, వైసీపీల మధ్య సోషల్ వార్ 

31-01-2024 Wed 11:39 | Both States
  • జగన్ కు అనుకూలంగా మాట్లాడిందని కుమారిపై కక్ష సాధింపు చేశారన్న వైసీపీ
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి దాడి చేయించారంటూ మండిపాటు
  • ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ వెల్లడి
 
Kumari Aunty Food Center Closed because of TDP And Janasena Says YCP
Listen to the audio version of this article

తెలంగాణలో ఓ ఫుడ్ సెంటర్ మూసివేత ఏపీలో పార్టీల మధ్య వివాదం రేపింది.. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియానే కారణమని నెటిజన్లు మండిపడుతుండగా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూసివేయించారో తెలియట్లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ చిన్నగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఏపీలో ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ మీడియాకు చెప్పారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఆమె ఫుడ్ సెంటర్ మూతపడేందుకు కారణమైందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనే కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కుమారి ఆంటీపై కక్ష సాధించారని ఆరోపించింది

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Kumari aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అక్కడే ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి 

31-01-2024 Wed 13:13 | Telangana
  • తొలగించకుండానే ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని పోలీసులకు ఆదేశం
  • సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి
  • స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
  • సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్
 
Revanth Reddy reacts to Kumari aunty food stall issue

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. ఫుడ్ స్టాల్ ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదే స్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.

ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందనే కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూసివేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ.. అదే పాపులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకే ప్రయత్నిస్తాం తప్ప వారి ఉపాధిని దెబ్బతీసే పనులు తమ ప్రభుత్వం చేయదన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎప్పటిలాగే అదే చోట కొనసాగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

20240131fr65b9fa330952b.jpg

Link to comment
Share on other sites

Kumari Aunty: కుమారి ఆంటీ హోటల్ మళ్లీ తెరుచుకుంది! 

31-01-2024 Wed 14:43 | Telangana
  • హైదరాబాదులో కుమారి ఆంటీ హోటల్ ను మూసేసిన పోలీసులు
  • సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సమస్య పరిష్కారం
  • నేడు కుమారి ఆంటీ హోటల్ తెరవడంతో పోటెత్తిన జనాలు
 
Kumari Aunty hotel opened after CM Revanth Reddy intervention

హైదరాబాద్ లో కుమారి ఆంటీ హోటల్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు అడ్డుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ హోటల్ పై కేసులు ఎత్తివేయాలని ఆదేశించడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు అనుమతించడంతో నేడు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. కుమారి ఆంటీ హోటల్ మళ్లీ తెరుచుకుందన్న విషయం తెలియడంతో జనాలు పోటెత్తారు. సాధారణంగా వచ్చే జనం కంటే ఇవాళ రెట్టింపు సంఖ్యలో వచ్చారు. కుమారి ఆంటీ హోటల్ ఏరియా రద్దీగా మారిపోయింది. దాంతో, కుమారి ఆంటీ హోటల్ వద్ద ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

కాగా, సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కుమారి ఆంటీ హోటల్ ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది .

Link to comment
Share on other sites

3 hours ago, ARYA said:

mind dobbinda veediki? illegal establishment ni sandarsinchi em cheddam anukuntunnado! All those establishments do not have clearance from GHMC as well annaru police le!

  • Upvote 1
Link to comment
Share on other sites

18 minutes ago, Jatka Bandi said:

mind dobbinda veediki? illegal establishment ni sandarsinchi em cheddam anukuntunnado! All those establishments do not have clearance from GHMC as well annaru police le!

Akkadiki poyi edo scheme announcement chestademo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...