Jump to content

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు 


psycopk

Recommended Posts

 

Telangana: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు 

14-03-2024 Thu 19:10 | Telangana
  • దరఖాస్తుకు మరో రెండు రోజుల గడువు ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
  • రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్
  • ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
 

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ మేరకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును రెండు రోజులు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

 

Uttam Kumar Reddy: రేషన్ కార్డులు లేకపోయినా ప్రభుత్వ పథకాలు అందుతాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

14-03-2024 Thu 21:21 | Telangana
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం
  • ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ
 
Minister Uttam Kumar Reddy on Ration cards

రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని... ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హుజూర్‌నగర్‌లో సీతారామస్వామి గుట్ట సమీపంలో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతీ ఏడాది 3,500 ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరంలో చేసిన తప్పుడు విధానాలతో ప్రస్తుతం నీళ్లు ఉన్నప్పటికీ వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ తప్పులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ధరణి ద్వారా చేసిన ల్యాండ్ మాఫియాను ప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు. భద్రాద్రి, యాదాద్రి పేర్లను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. 

 

Link to comment
Share on other sites

Telangana: టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

14-03-2024 Thu 20:51 | Telangana
  • డీఎస్సీ కంటే ముందే నిర్వహించుకునే విధంగా జీవో ఇచ్చిన ప్రజా ప్రభుత్వం
  • దీంతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు 
  • సాధ్యమైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం అభిప్రాయం
 
Telangana government gives green signal to conduct TET

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. సాధ్యమైనంత ఎక్కువమందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పటికే మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలు, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటోందని మరోసారి రుజువైందని ట్వీట్ చేసింది.

Link to comment
Share on other sites

Mallu Bhatti Vikramarka: రుణాలివ్వడం సామాజిక బాధ్యతగా గర్తించాలి: బ్యాంకర్లతో మల్లు భట్టివిక్రమార్క 

14-03-2024 Thu 17:18 | Telangana
  • వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలను బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచన
  • వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని సలహా 
  • బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించాలన్న భట్టివిక్రమార్క
 
Bhattivikramarka suggestion to bankers

వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలను బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని... రుణాలివ్వడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. వచ్చే అయిదేళ్లలో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని... కాబట్టి బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని... ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...