Jump to content

కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులు కాబట్టి మీరు ఆ ధర్నాలూ బందులు ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర చేసుకోవాలె


Piracy Raja

Recommended Posts

4 minutes ago, Sucker said:

They are doing in their own state not in Andhra or Bihar. Nooooo ??

arrest chesindi state police kadu kada.. vayya... revant em chestadu?? ktr sir logic ki against ga veltunav ante.. nuvvu kuda tg drohi ve....

Link to comment
Share on other sites

Raja Singh: కవిత అరెస్ట్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 

15-03-2024 Fri 21:28 | Telangana
  • మోదీ పాలనలో తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అన్న రాజాసింగ్
  • తప్పు చేస్తే ఈ రోజు కూతురు.. రేపు సోదరుడు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళతాడని వ్యాఖ్య
  • నోటీసులు లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అడగడాన్ని ప్రశ్నించిన రాజాసింగ్
  • గతంలో తనను కూడా నోటీసులు లేకుండానే అరెస్ట్ చేశారని గుర్తు చేసిన రాజాసింగ్
 
Raja Singh hot comments on kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కేటీఆర్, కేసీఆర్‌లను ఉద్దేశించి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఎప్పటికైనా అరెస్ట్ కావాల్సిందే అన్నారు. ఎందుకంటే ఇది మోదీ పాలన... మోదీ పాలనలో అవినీతిపరులను వదిలేది లేదన్నారు. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని, ఆ తర్వాత కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆమె విచారణకు వెళ్లలేదన్నారు. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం గుర్తు చేశారు. ఈ రోజు కాకున్నా ఆమె రేపు అరెస్ట్ కావాల్సిందేనని... ఈ రోజు అరెస్ట్ అయ్యారన్నారు.

నోటీసులు లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారని... కానీ తనను కూడా ఎలాంటి నోటీసులు లేకుండా గత బీఆర్ఎస్ హయాంలో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అన్యాయంగా తనపై పీడీ యాక్ట్ పెట్టి 77 రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని... ఆ రోజు తన టైమ్ బాగాలేదు.. ఈ రోజు మీ టైమ్ బాగాలేదని గుర్తుంచుకోవాలన్నారు. కానీ ఆ రోజు తాను ఎలాంటి తప్పు చేయలేదని... ఇప్పుడు మీ సోదరి మాత్రం అక్రమాలకు పాల్పడిందన్నారు.

Link to comment
Share on other sites

K Kavitha: ఈ రోజు రాత్రి ఈడీ కార్యాలయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 

15-03-2024 Fri 22:15 | Telangana
  • ఈ రోజు రాత్రి 11.30 గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి చేరుకోనున్న కవిత
  • రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరు పరిచే అవకాశం
  • ఈడీ అధికారులు కవిత కస్టడీని కోరే అవకాశం
 
MLC Kavitha will stay in ED office today

మద్యం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఈ రోజు రాత్రి 11.30 గంటల తర్వాత ఆమె ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఆమెను రాత్రి ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. మద్యం కేసులో మరింత విచారణకు ఈడీ అధికారులు ఆమె కస్టడీని కోరనున్నారు. మరోవైపు కవిత తన అరెస్టును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

లాఠీఛార్జ్ మధ్య కవితను తీసుకువెళ్లిన అధికారులు

కవితను హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయటకు తీసుకుచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసివేసి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

Link to comment
Share on other sites

 

KTR: కవిత అరెస్ట్ నేపథ్యంలో... బీజేపీని ఎండగడుతూ చంద్రబాబు చేసిన పాత ట్వీట్ ను తిరగదోడిన కేటీఆర్ 

15-03-2024 Fri 21:49 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్
  • 2019 ఎన్నికల నాటి చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన కేటీఆర్
  • ఎన్నికల ముందు ఇలాంటి దాడులేంటని ఆ ట్వీట్ లో చంద్రబాబు ఆగ్రహం 
 
KTR re posted Chandrababu tweet dated 2019 Feb 6

టీడీపీ అధినేత చంద్రబాబుకు, బీజేపీకి మధ్య 2019 ఎన్నికల వేళ ఎంతటి మనస్పర్ధలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబుకు మిత్రపక్షం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్... చంద్రబాబు గతంలో చేసిన ఓ పాత ట్వీట్ ను వెలికితీశారు. తన సోదరి కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు. 

ఇంతకీ ఆ ట్వీట్ లో చంద్రబాబు ఏమని పేర్కొన్నారంటే... "2019 సాధారణ ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రతీకారానికి ఒడిగడుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ దాడులు ఈ సమయంలోనే జరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు దాడులు చేస్తున్నారు?" అంటూ చంద్రబాబు ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. 

చంద్రబాబు 2019 ఫిబ్రవరి 6న ఆ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ ను ఇవాళ కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ చక్కగా వాడుకున్నారు. "ఈ కింది ట్వీట్ లో చంద్రబాబు గారు భలే చెప్పారు... ఇంత కరెక్ట్ గా ఎవరూ చెప్పలేరేమో!" అంటూ తన రాజకీయ చతురత ఉపయోగించారు. 

 

Link to comment
Share on other sites

 

K Kavitha: కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ.. తీవ్ర ఉత్కంఠ 

16-03-2024 Sat 10:50 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న కవిత అరెస్ట్
  • రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ
  • కవితను జ్యుడీషియల్ కస్టడీకీ అప్పగించాలని కోరుతున్న ఈడీ
 
ED produced Kavitha in Rouse Avenue Court

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు... ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

 

Link to comment
Share on other sites

Vijayashanti: కాలం కర్మను నిర్ణయిస్తుంది: కవిత అరెస్ట్ పై విజయశాంతి స్పందన 

16-03-2024 Sat 10:02 | Andhra
  • లిక్కర్ కేసులో అరెస్టైన కవిత
  • తొలి ప్రభుత్వంలోని వ్యక్తులు అవినీతికి దూరంగా ఉంటే బాగుండేదన్న విజయశాంతి
  • ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్న కవిత
 
Vijayashanti comments on Kavitha arrest

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. కవిత అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ సినీ నటి విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు కాలం కర్మను నిర్ణయిస్తుందని... ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. నిజనిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ... తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్టయితే ఎంతో మంచిగుండేదని అన్నారు. మరోవైపు కవిత ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. కాసేపట్లో ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

KTR: కవిత అరెస్టు.. కేటీఆర్‌పై ఈడీ ఫిర్యాదు 

16-03-2024 Sat 06:58 | Telangana
  • బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు
  • కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
  • ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి భానుప్రియా మీనా
 
ED officials complain against KTR for obstructing their duties

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ మహిళా అధికారి భానుప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కవిత అరెస్టు సమయంలో ఈడీ అధికారులపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రసారమాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.

Link to comment
Share on other sites

14 hours ago, Anta Assamey said:

Evadaina ee tweet ki background cheppandi... Seeing this a lot...torch.gif

CBN arrest Inappudu ktr sarcastic ga vesadu enjoyed the show ani.. now karma return ichindi ani sharing public

Link to comment
Share on other sites

17 hours ago, Piracy Raja said:
కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులు కాబట్టి మీరు ఆ ధర్నాలూ బందులు ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర చేసుకోవాలె. ఇక్కడ లొల్లి చేసి హైద్రబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసుడేంది ? ఎక్కడ పడితే అక్కడ లొల్లి చేస్తే బొక్కలు ఇరగ్గొడతాం!
 
-ఇట్లు
మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అనుముల

She was not arrested by Delhi police.

Link to comment
Share on other sites

15 hours ago, psycopk said:

 

 

KTR: కవిత అరెస్ట్ నేపథ్యంలో... బీజేపీని ఎండగడుతూ చంద్రబాబు చేసిన పాత ట్వీట్ ను తిరగదోడిన కేటీఆర్ 

15-03-2024 Fri 21:49 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్
  • 2019 ఎన్నికల నాటి చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన కేటీఆర్
  • ఎన్నికల ముందు ఇలాంటి దాడులేంటని ఆ ట్వీట్ లో చంద్రబాబు ఆగ్రహం 
 
KTR re posted Chandrababu tweet dated 2019 Feb 6

టీడీపీ అధినేత చంద్రబాబుకు, బీజేపీకి మధ్య 2019 ఎన్నికల వేళ ఎంతటి మనస్పర్ధలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబుకు మిత్రపక్షం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్... చంద్రబాబు గతంలో చేసిన ఓ పాత ట్వీట్ ను వెలికితీశారు. తన సోదరి కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు. 

ఇంతకీ ఆ ట్వీట్ లో చంద్రబాబు ఏమని పేర్కొన్నారంటే... "2019 సాధారణ ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రతీకారానికి ఒడిగడుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ దాడులు ఈ సమయంలోనే జరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు దాడులు చేస్తున్నారు?" అంటూ చంద్రబాబు ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. 

చంద్రబాబు 2019 ఫిబ్రవరి 6న ఆ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ ను ఇవాళ కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ చక్కగా వాడుకున్నారు. "ఈ కింది ట్వీట్ లో చంద్రబాబు గారు భలే చెప్పారు... ఇంత కరెక్ట్ గా ఎవరూ చెప్పలేరేమో!" అంటూ తన రాజకీయ చతురత ఉపయోగించారు. 

 

Ee Roju cbn gurthuku vachada meeku 

Ah Roju savan daggara alliance annaru ga

Two national parties will remove brs 

 

Link to comment
Share on other sites

K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తి: రిమాండ్ రిపోర్టులో ఈడీ 

16-03-2024 Sat 18:10 | Telangana
  • సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని పేర్కొన్న ఈడీ
  • ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవితనే కీలక సూత్రధారి అని వెల్లడి
  • కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొన్న ఈడీ
 
ED remmand report on brs mlc kavitha

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యక్తి అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవితనే కీలక సూత్రధారి అని తెలిపింది. కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది. కవిత తన వ్యవహారం అంతా రామచంద్రపిళ్లై ద్వారా నడిపినట్లు అందులో వెల్లడించింది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ద్వారా కవిత ఢిల్లీకి రూ.30 కోట్లు తరలించారని పేర్కొంది. రూ.30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు పేర్కొంది.

ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అరుణ్ పిల్ళైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటాలను పొందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇతరులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇచ్చినట్లు తెలిపింది. కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను తొలగించినట్లు అందులో పేర్కొంది. సౌత్ గ్రూప్‌లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత కుట్రలు పన్నినట్లు అందులో పేర్కొంది.

Link to comment
Share on other sites

K Kavitha: ప్రతిరోజూ బంధువులను కలిసేందుకు అనుమతి కోరిన కవిత... ఆమోదం తెలిపిన న్యాయస్థానం 

16-03-2024 Sat 17:46 | Telangana
  • లాయర్‌ను కలిసేందుకూ కవితకు ఆమోదం
  • ఇంటి భోజనానికి ఓకే చెప్పిన రౌస్ అవెన్యూ కోర్టు
  • మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గది కేటాయింపు
 
Kavitha asks court for daily meeting with family members and lawyers

ఈడీ కస్టడీలో తనకు పలు మినహాయింపులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును శనివారం కోరారు. కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువులను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.

అలాగే తనకు పుస్తకాలు చదివేందుకు వెసులుబాటు కల్పించాలని... కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి అనుమతివ్వాలని కోరారు. తనకు స్పెట్స్ (కళ్లద్దాలు)కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటికి న్యాయస్థానం ఓకే చెప్పింది. అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. కవిత మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అధికారులు ఆమెను ఈడీ కార్యాలయానికి తరలించారు.

Link to comment
Share on other sites

Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత 

16-03-2024 Sat 17:22 | Telangana
  • 7 రోజులపాటు ప్రశ్నించేందుకు ఈడీ అధికారులకు అనుమతి 
  • ఈ నెల 23 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు 
  • ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి నాగ్‌పాల్
 
Rouse Avenue court sentenced MLC Kavitha to custody till April 23 in Delhi liquor scam case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. రేపటి (18) నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. ఈ వారం రోజులపాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

కాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...