Jump to content

కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులు కాబట్టి మీరు ఆ ధర్నాలూ బందులు ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర చేసుకోవాలె


Piracy Raja

Recommended Posts

K Kavitha: రానున్న 10 రోజుల్లో కవితకు సమన్లు ఇవ్వం అని మాత్రమే సెప్టెంబర్ 15న చెప్పాం: కోర్టులో ఈడీ లాయర్ 

16-03-2024 Sat 14:28 | Telangana
  • విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని వెల్లడి
  • ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన నిరవధిక కాలానికి వర్తింప చేసుకోకూడదన్న ఈడీ
  • తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న ఈడీ తరఫు లాయర్
 
ED lawyer in CBI court on kavitha arrest

రానున్న పది రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమన్లు ఇవ్వమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న చెప్పామని, అదే సమయంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుసేన్ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులు నిన్న కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట శనివారం హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున ఎన్.కే.మట్టా, జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు.

మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. రానున్న పది రోజుల్లో సమన్లు ఇవ్వం అని అప్పుడు చెప్పామన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పినట్లు వెల్లడించారు. ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన దానిని నిరవధిక కాలానికి వర్తింపచేసుకోవద్దన్నారు. అలాగే వేరేవారి ఉత్తర్వులను కూడా తమకు అన్వయించుకోవడం సరికాదన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు మొత్తానికి వర్తించవన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. కవిత వివిధ అంశాలపై సుప్రీంకోర్టుకు కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశారని గుర్తు చేశారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: కవిత అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

16-03-2024 Sat 14:40 | Telangana
  • కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ అని విమర్శ
  • కూతురు అరెస్ట్‌ను కేసీఆర్ ఖండించలేదన్న రేవంత్ రెడ్డి
  • నిన్న ఈడీ, మోదీ ఒకేసారి వచ్చారన్న ముఖ్యమంత్రి
  • కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుస్తోందని బీజేపీ, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం
 
Revanth Reddy responded on Kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై కేసీఆర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మౌనంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి మౌనం వెనుక వ్యూహం ఉందన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని... నిన్న మాత్రం ఈడీ, మోదీ ఒకేసారి వచ్చారన్నారు.

బీజేపీ, కేసీఆర్ కుటుంబం కలిసి మద్యం కుంభకోణాన్ని సీరియల్‌లా నడిపించాయని మండిపడ్డారు. కవిత అరెస్ట్ కేవలం బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం జరిగిందని... ఎందుకో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్న సమయంలో తమను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అరెస్ట్ కేవలం ఎన్నికల స్టంట్ అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

Link to comment
Share on other sites

K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురికి ఈడీ నోటీసులు 

16-03-2024 Sat 18:29 | Telangana
  • సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
  • కవిత ఇంట్లో సోదాల సమయంలో వీరి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ
  • నిన్న మొత్తం పది ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు
 
ED issues notices to Kavitha husband and four assistants

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది.

ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

Link to comment
Share on other sites

Delhi Liquor Scam: అరెస్టు నుంచి మిన‌హాయింపు ఇచ్చి.. న‌ళినీ చిదంబ‌రానికి ఇచ్చిన రిలీఫ్‌నే క‌విత‌కు ఇవ్వండి: న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి 

16-03-2024 Sat 15:26 | National
  • రౌస్ అవెన్యూ కోర్టులో క‌విత త‌ర‌పు న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి వాద‌న‌లు  
  • సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంద‌ని.. ఇంత‌లోనే క‌విత‌ను ఈడీ అరెస్ట్ చేసిన‌ట్లు వివ‌ర‌ణ‌
  • గ‌తంలో సీఆర్‌పీసీ 160 సెక్ష‌న్ కింద ఆమెను సీబీఐ 8 గంట‌ల పాటు విచారించిన విష‌యాన్ని గుర్తు చేసిన న్యాయ‌వాది
  • ఈ నెల 19న సుప్రీంకోర్టులో మ‌రోసారి విచార‌ణ ఉన్న‌ట్లు వెల్ల‌డి 
 
Kavita lawyer Vikram Chaudhary submissions in Rouse Avenue Court

క‌విత‌కు ఈడీ గ‌తేడాది స‌మ‌స్లు జారీ చేసిన‌ప్పుడే సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశామ‌ని రౌస్ అవెన్యూ కోర్టులో క‌విత త‌ర‌పు న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి వాద‌న‌లు వినిపించారు. "కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున స‌మ‌న్లు ఇవ్వ‌బోమంటూ ఈడీ త‌ర‌పు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ల‌ర్ సుప్రీంకోర్టు బెంచ్‌కు హామీ ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా మ‌రోసారి వాద‌న‌లు జ‌రిగాయి. ఈడీ న్యాయవాదులే కేసు విచార‌ణ‌పై వాయిదాలు తీసుకున్నారు. సెప్టెంబ‌ర్ 15న సుప్రీంకోర్టులో అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ చెప్పిన విష‌యాన్ని దేశ‌మంతా చూసింది. ఆ మాట‌ల‌ను ఈడీ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన స‌మ‌న్ల‌ను, న‌మోదు చేసిన కేసును నిలిపివేయాల‌ని, మొత్తం కేసునే క్వాష్ చేయాల‌ని సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరాం. 

ఒక‌వైపు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతూ వుంది. నిన్న కూడా కేసు మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చింది. నిన్న మ‌ధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాద‌న‌లు పూర్తియి, కేసు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే తెలంగాణ‌లో క‌విత నివాసంలో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. సాయంత్రానికి అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ఈడీ అధికారులు ప్ర‌క‌టించారు. గ‌తంలో సీఆర్‌పీసీ 160 సెక్ష‌న్ కింద సీబీఐ 8 గంట‌ల పాటు ఆమెను విచారించింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మ‌రోసారి విచార‌ణ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ కేసు విచార‌ణ ఇక్క‌డ నిలిపివేయాలి. అరెస్టు నుంచి మిన‌హాయింపు ఇవ్వండి. న‌ళినీ చిదంబ‌రానికి ఇచ్చిన రిలీఫ్‌నే క‌విత‌కు కూడా ఇవ్వాలి" అని విక్ర‌మ్ చౌద‌రి వాద‌న‌లు వినిపించారు.

Link to comment
Share on other sites

 

K Kavitha: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: కోర్టు ఆవరణలో కవిత 

16-03-2024 Sat 12:03 | Telangana
  • ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన ఈడీ
  • కవితను కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ
  • కోర్టు నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ 
 
My arrest is illegal says Kavitha in Delhi court premises

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. ఆమెను కోర్టు హాల్లోకి తీసుకువెళ్తున్న సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని... తన పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు. మరోవైపు, కోర్టులో కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు. 

లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను మరింతగా విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది. కవితకు జైలా? బెయిలా? అనేది కాసేపట్లో తేలిపోనుంది. 

 

Link to comment
Share on other sites

 

K Kavitha: కవిత రిమాండ్... ఢిల్లీలో అడ్వోకేట్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్న కేసీఆర్ 

16-03-2024 Sat 18:45 | Telangana
  • సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్న కేసీఆర్
  • ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధిష్ఠానం
  • కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు ఢిల్లీలోనే లాయర్స్ టీమ్
 
KCR will monitoring kavitha arrest issue

తన కూతురు, ఎమ్మెల్సీ కవితను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వోకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వోకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు... ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో అడ్వోకేట్ టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...