Jump to content

update on kavita case


psycopk

Recommended Posts

MLC Kavitha: కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడమేంటి?.. కవితకు కోర్టు వార్నింగ్ 

15-04-2024 Mon 13:04 | Telangana
  • మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చినా వినిపించుకోని ఎమ్మెల్సీ
  • కోర్టు హాల్ నుంచి బయటికొస్తూ మరోసారి మీడియాతో మాట్లాడిన కవిత
  • ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు
 
Rouse Avenue Court Warned MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు సోమవారం వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయొద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా హెచ్చరించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టు నుంచి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా కవిత మళ్లీ మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టి మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యానించారు. ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’ అని కవిత ఆరోపించారు. మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఈ నెల 16న విచారించనుంది.

Link to comment
Share on other sites

 

K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

16-04-2024 Tue 14:58 | Telangana
  • తన అరెస్ట్ అక్రమమంటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • సెలవులో ఉన్న ప్రత్యేక కోర్టు జడ్జి
  • దీంతో 22 లేదా 23వ తేదీకి వాయిదాపడిన విచారణ
 
Kavitha bail petition plea postponed

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండటంతో వాయిదాపడింది. సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది. 

 

Link to comment
Share on other sites

Mamalni antunadu.., eediki vata undi antara

 

 

Harish Rao: కోర్టు నిర్ధారణ చేయకముందే కవిత తప్పు చేశారని ఎలా అంటారు? తమనూ జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు: హరీశ్ రావు 

17-04-2024 Wed 23:00 | Telangana
  • మద్యం కేసులో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బీజేపీ నేత నరేంద్ర మోదీ ఆశీర్వాదం తీసుకున్నారని వ్యాఖ్య
  • ఏక్ నాథ్ షిండే అయ్యేది తాను కాదు... రేవంత్ రెడ్డే అవుతాడన్న హరీశ్ రావు
 
Harish Rao responds on Kavitha arrest

కోర్టు నిర్ధారణ చేయకముందే మద్యం కేసులో కవిత తప్పు చేశారని ఎలా అంటారు? తమనూ జైల్లో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్‌కు కోర్టులపై నమ్మకం ఉందన్నారు. మద్యం కేసులో రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓ మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కవితను అరెస్ట్ చేయనందుకు బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందని ఆరోపించారు.

బీజేపీ నేత నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కోరారని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు... బీజేపీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఎవరి వైపు ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సుపారీలు తీసుకొని బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బెదిరించి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్పించుకుంటున్నారన్నారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఐటీ దాడులు, సీబీఐ దాడులు ఉండవని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బండకేసి కొడతారన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. ఏక్ నాథ్ షిండే అయ్యేది తాను కాదని... రేవంత్ రెడ్డే అవుతారని జోస్యం చెప్పారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటానని తెలిపారు. పదవి కోసం గడ్డి తినే అలవాటు తనకు లేదని వెయ్యిసార్లు చెప్పానని గుర్తు చేశారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

one month patindi eedu tagindi digataniki...

K Kavitha: కవిత అరెస్ట్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

18-04-2024 Thu 19:05 | Telangana
  • కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనని వ్యాఖ్య
  • మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శ
  • బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ
  • బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్
  • అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం
KCR responded on Kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాము అప్పుడు బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశామని, పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే దుర్మార్గుడైన ప్రధాని నరేంద్ర మోదీ... బీఆర్ఎస్‌పై క‌క్ష కట్టారన్నారు. క‌విత‌పై ఎలాంటి కేసు లేదు... క‌క్ష క‌ట్టి అరెస్ట్ చేశారని విమర్శించారు. అందుకే క‌విత‌ను కుట్ర‌పూరితంగా మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇరికించార‌న్నారు.

Link to comment
Share on other sites

20 minutes ago, psycopk said:

one month patindi eedu tagindi digataniki...

K Kavitha: కవిత అరెస్ట్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

18-04-2024 Thu 19:05 | Telangana
  • కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనని వ్యాఖ్య
  • మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శ
  • బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ
  • బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్
  • అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం
KCR responded on Kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాము అప్పుడు బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశామని, పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే దుర్మార్గుడైన ప్రధాని నరేంద్ర మోదీ... బీఆర్ఎస్‌పై క‌క్ష కట్టారన్నారు. క‌విత‌పై ఎలాంటి కేసు లేదు... క‌క్ష క‌ట్టి అరెస్ట్ చేశారని విమర్శించారు. అందుకే క‌విత‌ను కుట్ర‌పూరితంగా మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇరికించార‌న్నారు.

vellameeda evvariki sympathy ledanna vishayanni enduku grahinchalekapothunnaru?!! 

Support power lo unnanthavarake!!!

Link to comment
Share on other sites

40 minutes ago, psycopk said:
  • బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ
  • బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్
  • అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం

This was KCR’s biggest mistake till date. Idea and implementation rendu fail..Edo ilanti scheme lo CBN dorikindu ani same formula applied, result disaster…B L Santosh mida Non bailable case pettadam, phones tap cheyadam etc lanti panulu cheyadam…

Vapu ni chusi balupu anukunadu bapu…scene cut chesthe bidde tohar, koduku mida Repo mapo caselu, alludu mida jara pressure pedithe adu BJP jump..

  • Haha 1
Link to comment
Share on other sites

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం... సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి 

19-04-2024 Fri 16:20 | National
  • అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం
  • సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి
  • ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేశారు.

శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్‌గా మారారు. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అతను అప్రూవర్‌గా మారినట్లయింది. మద్యం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు.

కాగా,  తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది.

Link to comment
Share on other sites

K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు 

23-04-2024 Tue 14:58 | National
  • కేసు పురోగతి వివరాలను కోర్టుకు తెలిపిన ఈడీ న్యాయవాది 
  • కవిత కస్టడీని 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం
  • కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు 
 
Arvind Kejriwal and K Kavitha To Stay In Jail Custody Extended By 14 Days

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో మే 7వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు.  

కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతుందని... అందుకే కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. వాదనల అనంతరం కేసు పురోగతి వివరాలను ఈడీ న్యాయవాది... కోర్టుకు అందించారు. కవిత అరెస్ట్‌పై త్వరలో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు కస్టడీని పొడిగించింది.

Link to comment
Share on other sites

 

K Kavitha: కవితకు 33 శాతం వాటా కోసం అతను పని చేశాడు... వాట్సాప్ చాట్ ఆధారాలున్నాయి: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు 

24-04-2024 Wed 16:06 | Telangana
  • మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు బెయిల్ రాలేదన్న ఈడీ
  • మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయని వెల్లడి
  • మద్యం వ్యాపారం అంశంపై కవితను కలవమని మాగుంటకు కేజ్రీవాల్ చెప్పారన్న ఈడీ
  • రూ.50 కోట్లు ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కవిత చెప్పారన్న ఈడీ
 
Hearing on MLC Kavitha bail petition on third day

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో మూడోరోజైన బుధవారం విచారణ జరిగింది. ఈడీ వాదనలు వినిపిస్తూ... మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ తిరస్కరించాయని పేర్కొంది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయన్నారు. ఈడీ తరఫున జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు.

సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశామని... అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పసలేదని ఈడీ పేర్కొంది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని... హోల్ సేల్ వ్యాపారులు వందల కోట్లు సంపాదించారని... కమీషన్‌ను ఐదు నుంచి 12 శాతానికి పెంచారని పేర్కొంది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు మద్యం వినియోగదారులకు నష్టం జరిగిందని తెలిపింది. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని... దీని ద్వారా అక్రమాలు జరిగాయని కోర్టుకు వివరించింది. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని ఆరోపించింది.

విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపినట్లు తెలిపింది. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని, అసాధారణ లాభాలు గడించారని పేర్కొంది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌ను బలవంతంగా పక్కకు తప్పించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో కేజ్రీవాల్‌ను మొదట కలిసింది మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని పేర్కొంది.

సౌత్ నుంచి కొందరు వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారని ఈడీ పేర్కొంది. అయితే కవితను కలవమని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేజ్రీవాల్ చెప్పారని వెల్లడించింది. కేజ్రీవాల్ తనను రూ.100 కోట్లు అడిగినట్లు కవితకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని... అయితే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత అడిగారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుకు... రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని తెలిపింది. వాదనల సందర్భంగా బుచ్చిబాబు చాట్‌లను కోర్టులో ఈడీ న్యాయవాది ప్రస్తావించారు.

మద్యం వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేశారని... ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపింది. మాగుంట రాఘవ సిబ్బంది గోపీకుమార్ రూ.25 కోట్లను రెండు విడతలుగా బుచ్చిబాబు, బోయినపల్లికి ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కవితను శరత్‌చంద్రా రెడ్డి హైదరాబాద్‌లో కలిశారని... ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులో శరత్‌చంద్రా రెడ్డి కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. 

 

Link to comment
Share on other sites

K Kavitha: నేడు క‌విత బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు 

02-05-2024 Thu 09:19 | National
  • ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో నిందితురాలిగా  కవిత
  • జ్యుడీషియల్ రిమాండులో వున్న క‌విత
  • సీబీఐ కేసులో బెయిల్ కావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్ర‌యించిన క‌విత‌
 
Final Verdict on Bail Petition of BRS MLC Kavitha

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్‌పై గురువారం తుది తీర్పు రానుంది. మొద‌ట మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు క‌విత‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. ఆ త‌ర్వాత విచార‌ణ‌లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో త‌న‌కు సీబీఐ కేసులో బెయిల్ కావాల‌ని ఆమె రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్ర‌యించారు. 

క‌విత‌ అరెస్టుకు స‌రైన కార‌ణాలు లేవ‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టుకు విన్న‌వించారు. అయితే, సీబీఐ త‌ర‌ఫున వాదిస్తున్న న్యాయ‌వాదులు మాత్రం ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్ద‌ని కోర్టుకు తెలిపారు. లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత కీల‌క‌మైన వ్య‌క్తి అని సీబీఐ పేర్కొంది. ఇరువురి వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో క‌విత బెయిల్‌పై నేడు న్యాయ‌స్థానం తీర్పును వెల్ల‌డించ‌నుంది. ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే క‌విత మ‌ధ్యంత‌ర బెయిల్‌ను న్యాయ‌స్థానం తిరిస్క‌రించిన విష‌యం తెలిసిందే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...