Jump to content

update on kavita case


psycopk

Recommended Posts

BRS: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్ 

16-05-2024 Thu 12:00 | Telangana
  • సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని వినతి
  • మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
  • ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు
 
brs mlc kavitha submits bail petition in delhi high court

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

Congress: లిక్కర్ రాణి కవితను జైలు నుంచి విడిపించేందుకు కేసీఆర్ బీజేపీకి ఓట్లేయించారు.. ఆధారాలు ఉన్నాయి: కేకే మహేందర్ రెడ్డి 

16-05-2024 Thu 16:10 | Telangana
  • పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారన్న కేకే
  • బీజేపీకి ఓటు వేయమని బీఆర్ఎస్ నేతలే చెప్పారన్న మహేందర్ రెడ్డి
 
KK Mahendar Reddy fires at KCR over Nirod comments

లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి ఓట్లు వేయించారని కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. తన దగ్గర ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వెయ్యండని బీఆర్ఎస్ నేతలే చెప్పారని పేర్కొన్నారు.

పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలీలను అనలేదని... ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు ప్రభుత్వం అనుమతించిన వాటిని అమ్ముకుంటే తప్పేమిటని వ్యాఖ్యానించారు. కూతురు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ వద్ద మోకరిల్లిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.

కేసీఆర్ ప్రధాని మోదీ కనుసన్నుల్లోనే ఉన్నారన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని స్వయంగా కేసీఆర్ తనను అడిగినట్లు ప్రధానే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటో తెలియాలన్నారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు కోన్ కిస్కా అని మండిపడ్డారు.

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేశారని, సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి ఆయన పొలాలకు నీళ్లు తీసుకెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీకి పాల్పడ్డారన్నారు.

Link to comment
Share on other sites

Tihar Jail: తీహార్ జైల్లో కల్వకుంట్ల కవితను కలిసిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 

17-05-2024 Fri 13:02 | Telangana
  • ములాఖత్ లో పరామర్శించిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
  • కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెను కలవడం ఇదే తొలిసారి
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ
 
brs leaders meet kavitha in delhi tihar jail

ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నాగర్‌ కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆమెను పరామర్శించారు. 

కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్‌ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ తయారీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ లోనే ఉన్నారు. 

ఇదే కేసులో సీబీఐ సైతం ఆమెను సాంకేతికంగా అరెస్టు చేసినట్లు చూపింది. మరోవైపు బెయిల్‌ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ ట్రయల్ కోర్టు కొట్టేసింది.

 బెయిల్ పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ, సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. 

Link to comment
Share on other sites

 

RS Praveen Kumar: కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

17-05-2024 Fri 15:28 | Telangana
  • ఇతరుల పేర్లు చెప్పాలంటూ కవితపై ఈడీ, సీబీఐలు ఒత్తిడి చేస్తున్నాయన్న ప్రవీణ్ కుమార్   
  • తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారని వెల్లడి  
  • ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం పాలసీని తీసుకువచ్చిందన్న ఆర్ఎస్పీ
 
BRS leaders met the party MLC K Kavitha in Delhi Tihar Jail today

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మద్యం పాలసీ కేసులో ఇతర రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించాలని కవితపై ఈడీ, సీబీఐల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని ఆమె తమతో పంచుకున్నారన్నారు. ఇతర నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం అనైతికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారన్నారు.

ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తాను నిర్దోషినని, అలాగే పిల్లల తల్లిని అని, తనపై అధికార పార్టీ రాజకీయ కుట్రతో ఇరికించిందని చెబుతూ కవిత బెయిల్ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7ను సీబీఐ ఎలా ప్రయోగించింది? అని ప్రశ్నించారు. హేమంత్ సోరెన్, మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అదే కేసులో ఒకరికి బెయిల్ దొరికిన తర్వాత... కవిత బెయిల్‌ను విచారణ సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్నారు.

కవితపై రాజకీయ కక్షతోనే మద్యం పాలసీ కేసులో ఇరికించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో కవిత వద్ద ఒక్క రూపాయిని కూడా గుర్తించలేదన్నారు. మద్యం పాలసీ కేసు క్రైమే కాదన్నారు. తమ రెవెన్యూ పెంచుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చిందని, ఇందులో తప్పేముందన్నారు. అలాంటప్పుడు ఇందులో నేరం ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు. 

 

Link to comment
Share on other sites

K Kavitha: మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 

20-05-2024 Mon 14:39 | Telangana
  • రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
  • జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు
  • రెండు నెలలుగా తీహార్ జైల్లో కవిత
 
Kavitha Judicial remand extended

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. 

Link to comment
Share on other sites

K Kavitha: క‌విత బెయిల్ పిటిష‌న్ల‌పై విచార‌ణ రేప‌టికి వాయిదా 

27-05-2024 Mon 16:04 | Telangana
  • సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ విచార‌ణ
  • త‌న పిటిష‌న్ల‌లో బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను స‌వాల్ చేసిన క‌విత‌
  • క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి
 
BRS MLC Kavitha Bail Petition Hearing Adjourned to Tuesday

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు. 

క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి ఆమె అరెస్టులో ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ట్టాన్ని ఉల్లంఘించాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐలు కౌంట‌ర్ అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 

కాగా, ఫ‌లితం ఎలా ఉన్నా వాద‌న‌లు చాలా బాగా ఉన్నాయ‌ని విక్ర‌మ్ చౌద‌రిని జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌లు కీల‌క విష‌యాల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండ‌ర్ టేకింగ్ ఇచ్చింద‌ని.. క‌విత వేసిన రిట్ పిటిష‌న్ సుప్రీంలో పెండింగులో ఉండ‌డంతో విచార‌ణ ముందుకు సాగ‌డం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింద‌ని తెలిపారు. తాము ఇచ్చిన అండ‌ర్ టేకింగ్ త‌దుప‌రి వాయిదా వ‌ర‌కే అని చెప్పారు. 

సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండ‌గానే 41 (ఏ) ప్ర‌కారం స‌మ‌న్లు జారీ చేశార‌ని విక్ర‌మ్ చౌద‌రి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్ర‌కారం మొద‌ట నోటీసులు ఇచ్చిన‌వారు,  ఆ త‌ర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియ‌ద‌న్నారు. సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఈడీ బృందం క‌విత ఇంట్లో ఉంద‌ని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. 

అలాగే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే క‌విత‌ను ప్ర‌శ్నించాలంటూ సీబీఐ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం అంగీక‌రించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీబీఐ ప్ర‌శ్నించాలంటే క‌విత వాద‌న కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత క‌నీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసింద‌న్నారు. రేపు మ‌ధ్యాహ్నం కౌంట‌ర్ వాద‌న‌లు వినిపిస్తామ‌ని న్యాయ‌స్థానానికి ఈడీ తెలిపింది.

Link to comment
Share on other sites

Khujliwal gadu malli 7 days extension adgindu health grounds meeda

reports chupinchi surrender escape aidam ani 

  • Haha 1
Link to comment
Share on other sites

KCR: ఢిల్లీ మద్యం విధానం కేసు... కేసీఆర్‌కు ముందే తెలుసున్న ఈడీ 

28-05-2024 Tue 18:10 | Telangana
  • ఢిల్లీ మద్యం పాలసీ గురించి కేసీఆర్‌కు కవిత చెప్పారన్న ఈడీ
  • ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీమ్ సభ్యులను కవిత పరిచయం చేసినట్లు వెల్లడి
  • కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారన్న ఈడీ
  • కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపిన ఈడీ
 
ED says KCR know about Delhi Liquor policy issue

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ... కోర్టుకు తెలిపింది.

కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని... ఆ తర్వాత బుచ్చిబాబు... సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ... కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

Link to comment
Share on other sites

 

K Kavitha: మద్యం పాలసీ కేసులో కేసీఆర్ పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు: కవిత లాయర్ 

28-05-2024 Tue 20:05 | Telangana
  • ఈడీ కేసీఆర్ పేరును ఎక్కడా పేర్కొనలేదని వెల్లడి
  • మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించినట్లు వెల్లడి
  • రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులు పేరును ప్రస్తావించారని వ్యాఖ్య
 
Kavithas lawyer responded on KCR name ED counter

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఈడీ వాదనలలో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ... ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును రాయలేదన్నారు.

వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావన మాత్రమే ఈడీ చేసిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి మద్యం కేసులో ఉన్న వారిని పరిచయం చేశారని ఈడీ పేర్కొందన్నారు. 

 

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

KCR: ఢిల్లీ మద్యం విధానం కేసు... కేసీఆర్‌కు ముందే తెలుసున్న ఈడీ 

28-05-2024 Tue 18:10 | Telangana
  • ఢిల్లీ మద్యం పాలసీ గురించి కేసీఆర్‌కు కవిత చెప్పారన్న ఈడీ
  • ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీమ్ సభ్యులను కవిత పరిచయం చేసినట్లు వెల్లడి
  • కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారన్న ఈడీ
  • కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపిన ఈడీ
 
ED says KCR know about Delhi Liquor policy issue

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ... కోర్టుకు తెలిపింది.

కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని... ఆ తర్వాత బుచ్చిబాబు... సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ... కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

anduke BJP leader B Santosh ni arrest chesi blackmail chese pla lo unde anta abba kodukulu... anta confident ga em pekkuntaro peekondi ani...

Correct arrest aye roju early morning B.Santosh was able to escape to Kerala

KCR got too furious about how he was able to do that..

inka chetulu ettesary appudu

@psycopk

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...