Jump to content

update on kavita case


psycopk

Recommended Posts

KTR: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ ట్వీట్... తీవ్రంగా స్పందించిన కేటీఆర్ 

27-08-2024 Tue 15:09 | Telangana
KTR urged CJI to take action on Bandi Sanjay
 

 

  • బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారని గుర్తు చేసిన కేటీఆర్
  • ఆయన స్థాయికి ఇలాంటి విమర్శ సరికాదన్న కేటీఆర్
  • కోర్టు ధిక్కార చర్యగా భావించి చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ట్వీట్‌ను తప్పుబట్టారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

బండి సంజయ్ కేంద్ర హోంశాఖ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారని, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. మీ స్థాయికి ఇది తగిన వైఖరి కాదని బండి సంజయ్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను (బండి సంజయ్ వ్యాఖ్యలను) కోర్టు ధిక్కార చర్యగా భావించి అందుకు అనుగుణంగా చర్యలను ప్రారంభించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

అంతకుముందు, కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. "థ్యాంక్యూ, సుప్రీంకోర్ట్... ఉపశమనం లభించింది, న్యాయం గెలిచింది" అని ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

 

K Kavitha: కవితకు బెయిల్... హుషారుగా కేటీఆర్... వీడియో ఇదిగో 

27-08-2024 Tue 15:33 | Telangana
KTR happy after bail granted to Kavitha
 

 

  • కవితకు బెయిల్ రావడంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • ఆనందంతో పార్టీ నాయకులను ఆలింగనం చేసుకున్న కేటీఆర్
  • నెట్టింట వైరల్‌గా మారిన కేటీఆర్ సంతోషానికి సంబంధించిన వీడియో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నాయి.

కేటీఆర్ సంబరాలు

తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు. 

 

 

 

Link to comment
Share on other sites

Kavitha: తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల మామ రామకృష్ణారావు ఏమన్నారంటే...! 

27-08-2024 Tue 15:41 | Telangana
Kavitha Uncle Ramakrishna Rao opines on bail in Delhi Liquor Scam Case
 

 

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్
  • ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • కవిత ఏ తప్పు చేయలేదన్న మామ రామకృష్ణారావు
  • కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె కుటుంబ సభ్యుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. తాజాగా, కవిత భర్త అనిల్ తండ్రి రామకృష్ణారావు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. 

"కవిత సుమారు 6 నెలలు జైలు జీవితం అనుభవించింది. ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. మాకే ధైర్యం చెప్పింది. ఆలస్యమైనా న్యాయమే గెలిచింది. కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుందన్న నమ్మకం మాకుంది. కవిత ఇటీవల జ్వరంతో బాధపడింది. 10 కిలోల బరువు తగ్గినప్పటికీ, ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. 

కవిత ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నాం. ఆమె పది మందికి సాయం చేయాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఆడపడుచులు, అన్నదమ్ముల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి. 

ఈ సాయంత్రానికి కవిత జైలు నుంచి బయటికి వస్తుందని భావిస్తున్నాం. కేటీఆర్, హరీశ్, న్యాయవాదులు అవసరమైన పత్రాలు తీసుకుని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. అక్కడ్నించి బెయిల్ పత్రాలు తీసుకుని తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఇదంతా పూర్తయ్యేసరికి మరో మూడు గంటల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ప్రజలు కవిత కోసం స్వచ్ఛందంగా ఢిల్లీకి వచ్చారు" అని ఆమె మామ రామకృష్ణారావు వివరించారు.
Link to comment
Share on other sites

K Kavitha: కవితకు బెయిల్... కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ ఫోన్ 

27-08-2024 Tue 16:59 | Telangana
KCR phone call to KTR and Harish Rao
 

 

  • ఫోన్ చేసి కూతురు బాగోగులు తెలుసుకున్న కేసీఆర్
  • కవిత రాక కోసం సిద్ధమవుతున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్
  • కవిత అరెస్ట్ అయ్యాక ఇప్పటి వరకు కూతురును కలవని కేసీఆర్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తన కూతురు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కూతురు బాగోగులు తెలుసుకున్నారు. ఆమె రాక కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సిద్ధమవుతోంది.

కవిత అరెస్టైన మొదట్లో కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు. అమె అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కూతురును కలవలేదు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు. కూతురు అరెస్టైతే ఓ తండ్రిగా బాధ ఉండదా? అని వాపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన బీజేపీ తన కూతురును ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...