jaathiratnalu2 Posted March 22 Report Share Posted March 22 9 minutes ago, psycopk said: I think jagan binami sharath chandra reddy is the main culprit.. ap lo dunnesam ani kcr and kejriwal ni lagi.. vadu approver ga maripoyadu.. anna safe.. oka criminal ni namminanduku kavita and kejriwal anubhavistunaru..: nice sketch ra jagga Deentlo Jagga sketch Vundi antavu Mokali ki Bodi Gundu mi pulka cartel pertinent inka evaru pettaru Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 1 minute ago, jaathiratnalu2 said: Loki ni troll cheyataniki kavalsina content istunnavu kada Jagadu hyd lo properties petukoni.. kcr kturini irikinchadu…. Edi emaiana lafangi mistake aadu farm house lo tagi toogatam.. ee budda lafangi heroines calls tap chesukovatam lo busy aai kavita ni book chesaru 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 2 minutes ago, jaathiratnalu2 said: Deentlo Jagga sketch Vundi antavu Mokali ki Bodi Gundu mi pulka cartel pertinent inka evaru pettaru Liqor lo money baga ruchi marigadu… esp nasirakam tho aaite 10times profit… Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted March 22 Report Share Posted March 22 9 minutes ago, psycopk said: Liqor lo money baga ruchi marigadu… esp nasirakam tho aaite 10times profit… Anna corruption and politicians Gurunchi manamu inta takkuva matladite anta manchidi Anadaru Dongale .. e politicians lo evadu paritu kadu .. Malli dantlo vaadi kante veedu better emi ledu …Anta sannasule 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 Rahul Gandhi: కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ 22-03-2024 Fri 07:45 | National సీఎం అరెస్ట్ నేపథ్యంలో కుటుంబానికి కాంగ్రెస్ అగ్రనేత ఓదార్పు న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన నివాసానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజ్రీవాల్‌ను లేదా ఆయన కుటుంబాన్ని కలవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని, తదుపరి చట్టపరమైన సహాయానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇవ్వనున్నారని వివరించాయి. కాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసమ్మతిని అణిచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘భయపడుతున్న నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు’’ అంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా గురువారం రాత్రి ఆయన స్పందించారు. ‘‘మీడియాతో సహా అన్ని సంస్థలను స్వాధీనం చేసుకోవడం, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేయడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినా 'పైశాచిక శక్తి'కి సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం కూడా ఒక సాధారణ విషయమైంది’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్ట్ చేసింది ఒకే ఈడీ అధికారి 22-03-2024 Fri 08:28 | National ఢిల్లీ సీఎం, జార్ఖండ్ మాజీ సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్ రాజ్ మనీలాండరింగ్ ఆరోపణలపై ఇద్దరి అరెస్ట్ అరెస్ట్‌కు ముందు ఇద్దరినీ ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనంగా మారింది. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై గురువారం రాత్రి ఆయనను ఈడీ అడిషనల్ డైరెక్టర్ కపిల్ రాజ్ అరెస్టు చేశారు. ఇటీవల జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌ను కూడా అరెస్ట్ చేసింది ఈ అధికారే కావడం గమనార్హం. కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయగా.. హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన పీఎంఎల్ఏ కేసులో అరెస్టు చేశారు. కపిల్ రాజ్ సారధ్యంలోని 10 మంది అధికారుల బృందం గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుంది. ఇక హేమంత్ సోరెన్‌ను జనవరి 31న దాదాపు 6 గంటల విచారణ అనంతరం అరెస్టు చేశారు. ఇక కేజ్రీవాల్ మాదిరిగానే సోరెన్ కూడా ఈడీ సమన్లను దాటవేశారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు అందాయి. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఎలాంటి హైటెన్షన్ వాతావరణం నెలకొందో.. హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. కస్టడీలోకి తీసుకునే ముందు ఈడీ అధికారులు కొద్దిసేపు ప్రశ్నించారు. జనవరి 31న రాంచీలో హైడ్రామా తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్‌కు హేమంత్ సోరెన్ దాదాపు 48 గంటలపాటు కనిపించకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఈడీ అరెస్టుకు ముందే రాజీనామాపై పార్టీలో అంతర్గతంగా చర్చించారు. ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయడం, సీఎం పదవికి ఆయన రాజీనామా చేయడం, జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కాగా అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపించడం లేదు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 K Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురు దెబ్బ 22-03-2024 Fri 11:10 | Telangana కవిత బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం బెయిల్ కోసం నేరుగా సర్వోన్నత నాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని అంగీకరించబోమన్న సుప్రీం బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను... గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది. కేవలం రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది. ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్ లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం... ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు 22-03-2024 Fri 14:32 | National నిన్న సాయంత్రం సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ అడ్వొకేట్ సింఘ్వీ ఈడీ తరఫున వాదనలు వినిపించనున్న ఎస్వీ రాజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసులో నిన్న సాయంత్రం ఆయనను రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ ఢిల్లీ సీఎం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తారు. తమ తరఫు న్యాయవాది కోర్టులోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టును ఐదు నిమిషాల సమయం కోరారు. పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఈ పిటిషన్‌పై కేజ్రీవాల్ అభ్యర్థన మీద అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని ముఖ్యమంత్రి తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందుకే పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 K Kavitha: ఆరో రోజు ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ 22-03-2024 Fri 20:32 | Telangana ఆదివారం నుంచి కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ నేడు ములాఖత్ సమయంలో కవితతో తనయుడి భేటీ ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం... ఆరో రోజు విచారించారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను రేపు తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. మరోవైపు, ములాఖత్ సమయంలో తన తల్లిని, తనయుడిని కలిసేందుకు ఈడీ మూడు రోజుల క్రితం కవితకు అనుమతించింది. దీంతో నిన్న కవిత శోభమ్మ ఆమెను కలిశారు. ఈ రోజు కవిత తనయుడు కలవనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 Arvind Kejriwal: మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అహంకారంతో అరెస్ట్ చేశారు: ప్రధాని మోదీపై కేజ్రీవాల్ అర్ధాంగి తీవ్ర వ్యాఖ్యలు 22-03-2024 Fri 20:37 | National లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్ ప్రధాని మోదీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారన్న సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారని వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ గారూ... మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. "మోదీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా... మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు. ఆయన బయట ఉన్నా, జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు (విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు" అని అని స్పష్టం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 New Delhi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు 22-03-2024 Fri 21:12 | National ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆయనను నిన్న సాయంత్రం రెండు గంటల పాటు విచారించింది. అనంతరం రాత్రి అరెస్ట్ చేసింది. ఈడీ ఆయనను పది రోజుల పాటు కస్టడీకి అడిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మదన్ లాల్ మాట్లాడుతూ... కేజ్రీవాల్‌ను ఈడీ పది రోజుల కస్టడీకి అడిగిందని, అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆరు రోజుల కస్టోడియల్ రిమాండ్‌కు ఇచ్చిందన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ... ఈడీ అండతో ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోందని మండిపడ్డారు. మద్యం కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదన్నారు. ఈ రోజు దేశ చరిత్రలోనే చీకటి రోజు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం హత్య జరిగిందని... దీనిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 KCR: కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌లపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం 22-03-2024 Fri 19:22 | Telangana కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్య ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పని చేస్తోందని విమర్శ మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్ట్‌లు ఇందుకు నిదర్శనమన్న కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్ట్‌లు ఇందుకు నిదర్శనం అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్న కేంద్రం చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అని... అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 22 Author Report Share Posted March 22 harish ki unlimited fun la undi... Harish Rao: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడం లేదు... మోదీకి అనుకూలంగా ఉన్నారు: హరీశ్ రావు 22-03-2024 Fri 20:17 | Telangana సీఎం తీరు బీజేపీకి బీ టీమ్ లీడర్‌లా కనిపిస్తోందని వ్యాఖ్య ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదని విమర్శ బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడంలేదని... ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా పని చేస్తున్నారని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ, సీబీఐ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరు బీజేపీకి బీ టీమ్ లీడర్‌లా కనిపిస్తోంది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించడం లేదన్నారు. మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లు తాము చెబుతున్నదే ఇప్పుడు ఖర్గే, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దర్యాఫ్తు సంస్థలను ప్రధాని మోదీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. మద్యం కేసు పేరుతో రాజకీయ వేధింపులు సరికాదన్నారు. ఈ విషయంలో తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందన్నారు. మద్యం కేసు అనేది ఒక కుట్ర అని... తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అక్రమ అరెస్టులని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులకు భిన్నంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో నిందితుల అరెస్ట్ ఇప్పటికే ఆలస్యమైందని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆరెస్సెస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అన్నారు. తాము ముందు నుంచీ అదే చెబుతున్నామని... అది అదే ఇప్పుడు నిజమని తేలిందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మరిచినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 23 Author Report Share Posted March 23 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 23 Report Share Posted March 23 3 hours ago, psycopk said: Ade time la eedu TDP ki donate chesindu mari…endukantav ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.