psycopk Posted April 9 Author Report Share Posted April 9 K Kavitha: కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించిన కోర్టు 09-04-2024 Tue 12:08 | Telangana కవిత రిమాండ్ ను 14 రోజులు పొడిగించిన కోర్టు ఏప్రిల్ 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 10 Author Report Share Posted April 10 Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ 10-04-2024 Wed 10:15 | National అరెస్టు అక్రమం కాదంటూ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు కోర్టుపై గౌరవం ఉందంటూనే తీర్పును అంగీకరించలేమన్న ఆప్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన ఢిల్లీ సీఎం లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే, తాజా తీర్పును మాత్రం ఆమోదించబోమని చెప్పారు. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈమేరకు కేజ్రీవాల్ లాయర్లు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన విషయం గుర్తుచేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 10 Author Report Share Posted April 10 K Kavitha: సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్.. విచారణ వాయిదా 10-04-2024 Wed 15:35 | Telangana జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతినివ్వడంపై కవిత పిటిషన్ తదుపరి విచారణ ఏప్రిల్ 26కి వాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కవితను జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను విచారించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ నుంచి తమకు కౌంటర్ రిప్లై అందలేదని కవిత తరపు లాయర్ చెప్పాగా... ఆ అవసరం లేదని సీబీఐ బదులిచ్చింది. శనివారమే (ఏప్రిల్ 6) కవితను తాము ప్రశ్నించామని... కాబట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే.. భవిష్యత్తులో జరిగే విచారణకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని సీబీఐని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. కవితను తీహార్ జైల్లో విచారించేందుకు సీబీఐకి ఏప్రిల్ 5న కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే, తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతిని ఇవ్వడాన్ని కోర్టులో కవిత సవాల్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 11 Author Report Share Posted April 11 K Kavitha: జైల్లో ఉన్న నన్ను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్ 11-04-2024 Thu 17:23 | Telangana తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసిందన్న కవిత కవిత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మోహిత్ రావు తనకు ఈ కేసు గురించి తెలియదన్న డ్యూటీ జడ్జి రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచన తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. రిలీఫ్ ఇవ్వలేనన్న డ్యూటీ జడ్జి ఈరోజు రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు. కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. రేపు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. కాగా, కవితను గత నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 11 Author Report Share Posted April 11 K Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ 11-04-2024 Thu 14:28 | Telangana మద్యం కేసులో విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత జైల్లో కవితను విచారించనున్న సీబీఐ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది. సీబీఐ గత ఏడాది హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉంది. కాగా, కవిత రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12 Author Report Share Posted April 12 K Kavitha: కవితను నేడు కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ.. సర్వత్ర ఉత్కంఠ! 12-04-2024 Fri 09:46 | Telangana తీహార్ జైల్లో ఉన్న కవితను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ కవితను ప్రశ్నిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్న సీబీఐ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకపాత్ర పాత్ర పోషించారంటూ సీబీఐ అభియోగాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని... సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగక ముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ కు, ఆప్ కు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని... రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. మరోవైపు, కవితను సీబీఐ అరెస్ట్ చేసిన వెంటనే ఆమె తరపు లాయర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అత్యవసరంగా అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను అరెస్ట్ చేశారని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే, రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో, వారు రెగ్యులర్ కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేశారు. ఇంకోవైపు, కవితను తన కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఆమెను లోతుగా ప్రశ్నిస్తేనే వివరాలు బయటకు వస్తాయని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు కోర్టులో కవితను సీబీఐ హాజరుపరచనుంది. ఈ క్రమంలో, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12 Author Report Share Posted April 12 K Kavitha: కోర్టులో కవిత.. 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ! 12-04-2024 Fri 10:42 | Telangana రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టిన సీబీఐ లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర అన్న సీబీఐ అధికారులు కవిత వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందించిన అధికారులు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్, ఆప్ పార్టీ మధ్య జరిగిన రూ. 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సీబీఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలను వింటున్నారు. కవితను సీబీఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12 Author Report Share Posted April 12 K Kavitha: కవితకు మూడ్రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి 12-04-2024 Fri 16:24 | Telangana ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకమని కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న సీబీఐ ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ రేపటి నుంచి మూడురోజుల కస్టడీ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీని కోరగా... మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది. కవిత కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ... అందులో కీలక అంశాలు పేర్కొంది. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
CaptainMaverick Posted April 12 Report Share Posted April 12 They will also extend the custody to CBI....! This will continue until she turns into approver & implicates Kejriwal. Obviously she's not going to stay in jail for Kejriwal. she has to do it before Kejriwal implicates her....!! Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 13 Author Report Share Posted April 13 Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం: శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత.. కస్టడీ రిపోర్టులో సీబీఐ 13-04-2024 Sat 11:31 | Telangana శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లను కవిత ఇప్పించారన్న సీబీఐ ప్రతిగా రూ. 14 కోట్లు కవితకు ముట్టాయంటూ కస్టడీ రిపోర్టు అడిగిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవని శరత్‌ను కవిత బెదిరించారన్న సీబీఐ ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది. ఐదు జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత నుంచి రూ. 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం జరిగిందని, ఇది ఆయనకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితులలో ఆయన చేశారని వివరించింది. భూమిని కొనుగోలు చేసినప్పటికీ భూ బదలాయింపు మాత్రం ఇప్పటికీ జరగలేదని తెలిపింది. అందులో భాగంగా జులై 2021లో రూ. 7 కోట్లు, నవంబరులో మిగిలిన రూ. 7 కోట్లు కవితకు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్టు ఆధారాలు లభించాయని కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు కూడా సీఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి రూ. 80 లక్షలు బదిలీ చేసినట్టు పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 13 Author Report Share Posted April 13 KTR: రేపు ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్ 13-04-2024 Sat 15:37 | Telangana సీబీఐ కస్టడీలో ఉన్న కవిత ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు చెల్లెలిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. కేటీఆర్ సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఆమెను విచారించనుంది. అయితే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన న్యాయవాదని కలుసుకునే వెసులుబాటును కవితకు కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో, తన చెల్లెలిని కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆమెకు ధైర్యం చెప్పనున్నారు. న్యాయవాదులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. కవిత భర్త ఢిల్లీలోనే ఉన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 14 Author Report Share Posted April 14 K Kavitha: కవితను కలిసేందుకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్, భర్త అనిల్ కుమార్ 14-04-2024 Sun 18:51 | Telangana ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ కస్టడీ ఈ నెల 15 వరకు కవితను విచారించనున్న సీబీఐ న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, కస్టడీ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవిత తన న్యాయవాదితో 30 నిమిషాలు, కుటుంబ సభ్యులతో 15 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో, కవితను కలిసేందుకు కేటీఆర్, కవిత న్యాయవాది మోహిత్ రావు, కవిత భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నిబంధనల మేరకు వారు కవితను కలిసి మాట్లాడనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ ఆరోరా తదితరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సాక్షులను, సాక్ష్యాధారాలను కవిత ముందు ఉంచి ఈ మేరకు ఆమె నుంచి సమాచారం రాబట్టాలని సీబీఐ భావిస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 15 Author Report Share Posted April 15 K Kavitha: కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్.. నేడు మళ్లీ తీహార్ జైలుకు కవిత 15-04-2024 Mon 08:28 | Telangana గతనెల 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్ పరామర్శ ఒక్కసారి కూడా ప్రస్తావన తీసుకురాని కేసీఆర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నేటితో ముగియనున్న సీబీఐ కస్టడీ 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గత నెల 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గత 20 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజులు విచారించింది. నేటితో ఆమె కస్టడీ ముగియనుండడంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు. ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరుస్తారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కనుక కస్టడీ పిటిషన్ వేయకుంటే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted April 15 Report Share Posted April 15 @psycopk KCR kida follow aitaledemo e case ne laga entaina ne ex... a matram concern undali 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 15 Author Report Share Posted April 15 CBI: కవిత విచారణకు సహకరించలేదు... తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు: సీబీఐ 15-04-2024 Mon 14:16 | Telangana కస్టడీకి సంబంధించి 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేసిన సీబీఐ శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు వెల్లడి దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి కవిత అని పేర్కొన్న సీబీఐ కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్న సీబీఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమకు కస్టడీలో సహకరించలేదని, ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని సీబీఐ పేర్కొంది. మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన సీబీఐ అధికారులు సోమవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశ పెట్టారు. 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో కీలక అంశాలను వెల్లడించారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు అందులో పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై కస్టడీ సందర్భంగా ప్రశ్నించామని, వాటికి కవిత సూటిగా సమాధానాలు చెప్పలేదన్నారు. ఆమె దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి అని అందులో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు ఆమెకు 9 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.