Jump to content

కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్


psycopk

Recommended Posts

Chandrababu: కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్ 

29-03-2024 Fri 13:15 | Andhra
  • బనగానపల్లెలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న చంద్రబాబు
  • రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని మండిపాటు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మూడు పార్టీలు కలిశాయని వ్యాఖ్య
  • నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
 
Chandrababu fires on Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లెలో చంద్రబాబు ప్రచారం కొనసాగుతోంది. బనగానపల్లెకు హెలికాప్టర్ లో చేరుకున్న బాబుకు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రాబు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పేదలకు రూ. 2కే బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు. నదులను అనుసంధానం చేయాలనే బాధ్యతను తీసుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. 

ఏపీకి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేశామని చెప్పారు. జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... అప్పులు పుట్టకపోతే పథకాలు ఉండవని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని దుయ్యబట్టారు. దుర్మార్గుడు జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. ఫ్యాన్ ను చెత్తకుప్పలో వేయకపోతే మనకు భవిష్యత్తు లేదని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తామని చెప్పారు.

నాసిరకం మద్యంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారని.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 12 వేల కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించానని.. జగన్ ఖర్చు చేసింది రూ. 2 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. జగన్ 102 ప్రాజెక్టులను రద్దు చేశారని మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసం చేశారని... ఉద్యాగాలను ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. సీఎం నివాసానికి వెళ్లిన కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారని... ఆ కంటెయినర్ లో ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ కోడికత్తి డ్రామాలు ఆడాడని ఎద్దేవా చేశారు.

Link to comment
Share on other sites

Devineni Uma: జగన్.. తొలుత మీ చెల్లెళ్లకు సమాధానం చెప్పు: దేవినేని ఉమ 

29-03-2024 Fri 12:52 | Andhra
  • బాబాయి హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే గొడ్డలిపోటుగా బయటపడిందని ఉమ ఎద్దేవా
  • ఐదేళ్లుగా కేసును నీరు గార్చారని ఆగ్రహం
  • బాబాయిని చంపిందెవరో దేవుడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసన్న టీడీపీ నేత
 
Devineni Uma Asks Jagan To Answer Questions To His Sisters

బాబాయి హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే అది కాస్తా గొడ్డలిపోటుగా బయటపడిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా కేసును నీరుగార్చారని, నిందితుల అరెస్టును సైతం వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారని ఆరోపించారు. 

బాబాయిని చంపిందెవరో దేవుడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసని, జగన్ పాలనలో న్యాయం జరగదని స్పష్టం చేశారు. నిందితులను పక్కనపెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, హంతకులకు, జగన్‌కు ఓట్లు వేయవద్దంటున్న చెల్లెళ్లకు జగన్ సమాధానం చెప్పాలని ఉమ నిలదీస్తూ.. వైఎస్ జగన్‌కు వివేకా కుమార్తె డాక్టర్ సునీత సంధించిన ప్రశ్నల వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.

Link to comment
Share on other sites

 

Viral Videos: ఎన్నికల ప్రచారంలో విజయసాయిని ప్రజలు పట్టించుకోవడం లేదు.. అంటూ వీడియో షేర్ చేసిన టీడీపీ! 

29-03-2024 Fri 11:46 | Andhra
  • సీతారాంపురంలో విజయసాయి ప్రసంగానికి ముందే జనం ఇంటిబాట
  • వెళ్లొద్దు.. వెళ్లొద్దు అని మైక్‌లో వేడుకున్న వైసీపీ నేత
  • భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని వేడుకోలు
  • అయినా ఫలితం శూన్యమంటూ టీడీపీ ట్వీట్
 
YCP Leader Vijayasai was humiliated during the election campaign

ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపైనుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచివెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటిముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదేపదే వేడుకోవడం వీడియోలో కనిపించింది. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన (విజయసాయిరెడ్డి) మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్‌లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. వెనక్కి తిగి కూడా చూడలేదు ‘చెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు’ అని మైక్‌లో పదేపదే వేడుకోవడం కనిపించింది.

భోజనాలున్నాయి.. బిర్యానీ పెడతాం వెళ్లకండి అంటున్నా ప్రజలు వైసీపీ నేతల ముఖాన ఛీ కొట్టి వెళ్లిపోతున్నారని, ఏ2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదని, ఇక జగన్ సంగతి అయితే సరేసరని టీడీపీ ఎద్దేవా చేసింది. పులివెందులలోనే తుస్సుమందని పేర్కొన్న టీడీపీ.. జగన్ నీ పని అయిపోయింది.. అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. 

 

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

 

Chandrababu: కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్ 

29-03-2024 Fri 13:15 | Andhra
  • బనగానపల్లెలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న చంద్రబాబు
  • రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని మండిపాటు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మూడు పార్టీలు కలిశాయని వ్యాఖ్య
  • నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
 
Chandrababu fires on Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లెలో చంద్రబాబు ప్రచారం కొనసాగుతోంది. బనగానపల్లెకు హెలికాప్టర్ లో చేరుకున్న బాబుకు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రాబు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పేదలకు రూ. 2కే బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు. నదులను అనుసంధానం చేయాలనే బాధ్యతను తీసుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. 

ఏపీకి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేశామని చెప్పారు. జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... అప్పులు పుట్టకపోతే పథకాలు ఉండవని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని దుయ్యబట్టారు. దుర్మార్గుడు జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. ఫ్యాన్ ను చెత్తకుప్పలో వేయకపోతే మనకు భవిష్యత్తు లేదని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తామని చెప్పారు.

నాసిరకం మద్యంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారని.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 12 వేల కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించానని.. జగన్ ఖర్చు చేసింది రూ. 2 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. జగన్ 102 ప్రాజెక్టులను రద్దు చేశారని మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసం చేశారని... ఉద్యాగాలను ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. సీఎం నివాసానికి వెళ్లిన కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారని... ఆ కంటెయినర్ లో ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ కోడికత్తి డ్రామాలు ఆడాడని ఎద్దేవా చేశారు.

Babori Akshaya patra "World bank". $300 million kotha appu cheyyakunda Jagan aapadu

"What I'm saying, AI vaadi sampadha srustistha" - Baboru, the fortune creator.

Link to comment
Share on other sites

Chilakaluripet: టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి రాజేశ్‌ నాయుడు, పలువురు నేతలు 

29-03-2024 Fri 14:50 | Andhra
  • నారా లోకేశ్ సమక్షంలో భారీ చేరికలు
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీను
  • కొత్త చేరికలతో టీడీపీలో జోష్
 
YSRCP leaders of Chilakaluripet joins TDP

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చిలకలూరిపేట వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ రాజేశ్ నాయుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోల్డ్ శ్రీను టీడీపీలో చేరారు. వీరితో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ నాయుడు మాట్లాడుతూ మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చి మోసపోయానని చెప్పారు. శ్రీను మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని రూ. 2.5 కోట్లు తీసుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల చేరికతో చిలకలూరిపేట టీడీపీలో కొత్త జోష్ వచ్చింది.

Link to comment
Share on other sites

 

Chandrababu: ప్రభాకర్ రెడ్డిపై ఎవరినీ పోటీకి దింపారో చూశారా?: చంద్రబాబు 

29-03-2024 Fri 17:44 | Andhra
  • నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నా, ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచాడన్న చంద్రబాబు
  • ప్రభాకర్ రెడ్డిపై ఏ2ను బరిలో దింపారని ఎద్దేవా
  • ఏ2 సభలు జనం లేక వెలవెలపోతున్నాయని వెల్లడి
  • సభ నుంచి జనం వెళ్లిపోతుంటే భోజనాలు పెడతాం అని బతిమాలుకున్నారని వ్యంగ్యం
 
Chandrababu satires on Vijayasaireddy in Kavali Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సభలో నెల్లూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా, నెల్లూరు ఎంపీ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండడంపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు  జూన్ 4న విడుదల కానున్నప్పటికీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. 

"ప్రభాకర్ రెడ్డిపై ఎవరినీ పోటీకి దింపారో చూశారా... ఏ2, ఒక అవినీతిపరుడు, ఒక పనికిమాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం వంటి వ్యక్తి. నిన్న చూశాం... మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు. అయ్యా వెళ్లిపోకండి... భోజనం పెడతాం తినండి...బాబ్బాబూ ఉండండి అని బతిమాలుకుంటున్నాడు... కానీ, నువ్వు వద్దు, నీ ఉపనాస్యం వద్దు అని జనాలు పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డీ... నీ ఎంపీ విశ్వసనీయత అదీ! 

ఇవాళ కావలి సభకు వచ్చిన జనాలను చూశావా... మా ఎంపీ విశ్వసనీయత ఇదీ! నిన్ను ఓడించడానికి మండుటెండలను కూడా లెక్కచేయకుండా మేము సిద్ధం అంటూ ముందుకొచ్చారు.

ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అర్ధాంగి ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన... రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని వారు భావించారు. కానీ, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి స్వయంగా ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 

ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే వారిని ఇష్టానుసారం బూతులు తిట్టడం, దుష్ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా తయారయ్యారు. మొన్నటివరకు మీరు ఒకాయనను చూశారు. బుల్లెట్ దించుతాం అంటుండేవాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది. ఒక తన్ను తంతే వెళ్లి నరసరావుపేటలో పడ్డాడు. రేపో, ఎల్లుండో అక్కడి ఓటర్లు కూడా ఒక తన్ను తంతే చెన్నైలో వెళ్లి పడతాడు" అంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

 

Link to comment
Share on other sites

Chandrababu: వచ్చేది తుపాను... ఫ్యాన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం: కావలిలో చంద్రబాబు 

29-03-2024 Fri 17:20 | Andhra
  • నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం
  • కావలి సభలో చంద్రబాబు వాడీవేడి ప్రసంగం
  • ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం అని చంద్రబాబు ధీమా
  • వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అని ఎద్దేవా
  • ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యలు
 
Chandrababu speech in Kavali Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. 

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్... టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు. 

"కానీ ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాగళం పేరిట ఇక్కడికి వచ్చాను. ప్రజలు గళం విప్పాలని చెప్పడానికి వచ్చాను. రైతులు పరిస్థితులు బాగున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? ఈ దుర్మార్గుడు తన పాలనలో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు, మీ రక్తాన్ని జలగ మాదిరిగా తాగేస్తున్నాడు. 

అన్ని ధరలు పెంచేశారు, చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. ప్రజల ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చాను. 

ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోంది. ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుంది. చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుంది. 

45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే. నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని నేను ఊహించలేదు. జగన్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, చట్టంపై గౌరవం లేదు, వ్యవస్థలపై విశ్వాసం లేదు. అతడికి తెలిసిందల్లా దోపిడీ, దోచుకున్న డబ్బుతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్ లు కట్టుకోవడం, మీడియా, వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్ లను మనపై పురికొల్పడం. 

జగన్ ను ఎవరూ అడగకూడదు... అతడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు... ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేశాడు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నేతలు.. అందరినీ అణగదొక్కాడు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చి పోరాడగలిగారా? 

ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు, ఆ తర్వాత సీబీసీఐడీ వాళ్లు వస్తారు... అరెస్ట్ చేస్తారు... జైల్లో పెడతారు... ఈ పోలీసుల్లో కొంతమంది జైల్లో కొడతారు, టార్చర్ పెడతారు... చంపేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కేసులు పెట్టి వేధించారు. వీళ్ల దాష్టీకాలకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. 

ఇక బాబాయ్ ని చంపారు. బాబాయ్ ది గొడ్డలివేటా, లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత మీకు రక్షణ ఉందా అని ప్రజలను అడుగుతున్నా. ప్రజల ఆస్తులకు రక్షణ ఉందా? కృష్ణపట్నం పోర్టు ఏమైందో చూశాం. 

ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కొత్త వేషం వేసుకుని వచ్చాడు. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే మేము సిద్ధం అంటున్నాడు. 

నేను పేదల మనిషిని, మిగతా అందరూ పెత్తందార్లు అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఈ ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. పేదల కోసం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినవాళ్లు పెత్తందార్లా? లేక, అధికార దాహంతో అన్న క్యాంటీన్లను రద్దు చేసినవాళ్లు పెత్లందార్లా? 

మన పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా డబ్బులు ఇచ్చాను. మేం పెత్తందారులమా, లేక విదేశీ విద్య పథకం నిలిపివేసినవాళ్లు పెత్తందార్లా? ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని, 12 లక్షల టిడ్కో ఇళ్లు తీసుకువస్తే, ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్లు మీరు పెత్తందార్లు కాదా? 

మేం ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ ఇతడు రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ సందర్భంగా చెబుతున్నా... ఇప్పటివరకు ఇచ్చిన ఇంటి కాలనీలు రద్దు చేయం. ఇంకా డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తాను. నేను సైకో జగన్ లాంటి వాడ్ని కాను. 

ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం...  వాటిని రద్దు చేశాడు. ఆ పథకాలు ఇచ్చిన మేం పెత్తందారులమా? ఆ 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం... ఇప్పుడీ ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేశారు. ఇప్పుడు చెప్పండి... మేం పెత్తందారులమా? ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసిన జగన్ పెత్తందారుడా?

ప్రజలందరి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, జగన్ ఆదాయాలు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది, ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. జగన్ మాత్రం విలాసవంతమైన ఇళ్లు కట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్నాడు. అందుకే ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నా... ప్రజలారా సిద్ధం కండి. జగన్... నిన్ను, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

Link to comment
Share on other sites

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్ 

29-03-2024 Fri 18:07 | Andhra
  • సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్
  • జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత
  • జగన్ పనిదొంగ అంటూ విమర్శలు 
 
Chandrababu challenges CM Jagan

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Chandrababu: కావలి ఎమ్మెల్యే వంటి వింత జీవిని ఎక్కడా చూడలేదు: చంద్రబాబు

29-03-2024 Fri 20:55 | Andhra
  • నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • జగన్ ఇవాళ టీవీలు పగులగొట్టడం ఖాయమన్న చంద్రబాబు
  • కావలి జనసముద్రాన్ని తలపిస్తోందని వెల్లడి 
  • కావలి స్థానాన్ని ఎన్నికల ముందే గెలిచామని వ్యాఖ్యలు
Chandrababu comments on Kavali MLA

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ,  పక్కనే ఉన్న సముద్రాన్ని మరిపించే జనసముద్రం ఇక్కడే ఉంది... అంటూ  సభకు వచ్చిన జనాలను చూసి ఉత్సాహం ప్రదర్శించారు. కావలి సభ దద్దరిల్లింది... ఇది చూసిన సైకో జగన్ కి నిద్రరాదు... టీవీలు పగలగొడతాడు అని వ్యాఖ్యానించారు. చేసిన పాపాలు ఊరికే పోవు... వైసీపీని చిత్తు చిత్తు ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఎన్డీయే అన్ స్టాపబుల్... వైసీపీకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది... యువత సభలకు భారీగా తరలివస్తున్నారు... మా పిల్లలకు భవిష్యత్ గ్యారెంటీ ఇవ్వమని ప్రజలు కోరుకుంటున్నారు... తప్పకుండా చేస్తాను అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు. 

"ఇవాళ మార్చి 29...    తెలుగుజాతికి గుర్తింపు వచ్చిన రోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన రోజు, సంక్షేమం, సుపరిపాలన అందించిన రోజు. అదే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన రోజు. ఎన్టీఆర్ స్వర్గంలో ఉన్నా ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. చరిత్రలో ఏదైనా చెప్పే ముందు    ఏసు శకం కంటే ముందు, ఆ తర్వాత అని చెబుతుంటాం. రాష్ట్రంలోను తెలుగుదేశానికి ముందు, తరువాత అనే విధంగా రూపకల్పన చేశాం" అని వివరించారు. 

కావలి కాలకేయుడు అవినీతిపరుడు

కావలి కాలకేయుడు అవినీతిపరుడు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదు. వింత జీవి, విచిత్రమైన మనిషి. అతనిని ఢీ కొట్టడానికి కావ్యా కృష్ణారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఈ సీటు మనదే... ఎన్నికలకు ముందే గెలిచాం. కావలి ఎమ్మెల్యే ఒక నాయకుడిగా కాదు మనిషిగా ఉండటానికి అర్హుడు కాదు. 

కరుణాకర్ అనే దళిత వ్యక్తికి చెందిన చేపల చెరువును లాక్కున్నారు. కప్పరాల తిప్పలో బీసీ గురుకుల కింద ఉన్న 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. సెంటు పట్టా భూమిలో రూ.100 కోట్లు కొట్టేశారు. కావలి రూరల్ లో విచ్చల విడిగా గ్రానైట్ దోచుకున్నారు. ప్రతి దానిలో కమీషన్లు కావాలంటూ గద్దల్లా మారి పీక్కుతుంటున్నారు. మీ అరాచకాలను చిత్రగుప్తుడి మాదిరి లెక్కలు రాశాను. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తాను.

దగదర్తి పూర్తి చేస్తాను

ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు నేను కడితే జగన్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. 18 నెలల్లో దగదర్తి విమానాశ్రయానికి ఫౌండేషన్ వేశాను. ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాను. కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పూర్తి చేస్తాం.  

గతంలో మత్స్య కారులకు ఇచ్చిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాం. మత్స్య కారులకు శాపంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం. గతంలో ఇచ్చిన పథకాలన్నీ మళ్లీ పునరుద్దరిస్తాం. ఆక్వా పరిశ్రమలకు చేయూతనిస్తాం. రూ.1.50 విద్యుత్ సరఫరా చేస్తాం. ఉప్పు నిల్వ చేయడానికి షెడ్లు నిల్వ చేస్తాం. నార్త్ అమ్మలోరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది... మేము దానిని పూర్తి చేస్తాం.  

మాకు ఓటు వేస్తే కంపెనీలు వస్తాయి, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం, మహిళలకు రక్షణ ఇస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేస్తాం. నాసిరకం మద్యంతో మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపాలి... అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...