Jump to content

Chandrababu Naidu: ఇదీ అసలు కథ.. ఇదే పరదా వెనుక దాగున్న కథ: చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu Naidu: ఇదీ అసలు కథ.. ఇదే పరదా వెనుక దాగున్న కథ: చంద్రబాబు 

30-03-2024 Sat 17:35 | Andhra
  • సీఎం జ‌గ‌న్‌ 'మేమంతా సిద్ధం' బ‌స్సు యాత్ర‌కు క‌ర్నూల్ జిల్లాలో నిర‌స‌న సెగ  
  • గూడూరు మండ‌లం కొత్తూరుకు చెందిన మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు అడ్డు ప‌డిన వైనం
  • ఈ విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 
 
TDP President Nara Chandrababu Naidu Tweet on CM Jagan Bus Tour

'మేమంతా సిద్ధం' పేరిట ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌స్సు యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ బ‌స్సు యాత్ర‌లో భాగంగా క‌ర్నూల్ జిల్లాలో సీఎం జ‌గ‌న్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. త‌మ తాగునీటి స‌మ‌స్య తీర్చాలంటూ గూడూరు మండ‌లం కొత్తూరుకు చెందిన మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు అడ్డు ప‌డ్డారు. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 'ప్రజలారా 5 ఏళ్ల పరదాలకు అర్థం తెలిసిందా? ఇదీ అసలు కథ! ఇదే పరదా వెనుక‌ దాగున్న కథ' అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జ‌గ‌న్ యాత్ర‌కు అడ్డుప‌డ్డ వార్త తాలూకు క్లిప్‌ను జోడించారు.

Link to comment
Share on other sites

Chandrababu: దిక్కుమాలినోడివి... ఐదేళ్లున్నావు... ఏం చేశావు?: నాయుడుపేటలో చంద్రబాబు ఫైర్ 

30-03-2024 Sat 17:23 | Andhra
  • తిరుపతి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • నాయుడుపేటలో భారీ సభ
  • ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు
  • అందుకే ఇంతమంది జనం వచ్చారని వెల్లడి
  • జగన్ ఓ బచ్చాగా ఉన్నప్పుడే తాను సీఎంగా ఉన్నానని వ్యాఖ్యలు 
 
Chandrababu take a jibe at CM Jagan in Naidupeta Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాయుడుపేటలో నేడు జనసునామీ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు. 

శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ వెయ్యి తప్పులు చేశాడని, మీరు క్షమిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే, అందరినీ నమ్మించి మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. 

నాయుడుపేట ఎస్సీ నియోజకవర్గం అని, తాను రోడ్డు  మార్గం ద్వారా వస్తుంటే, ప్రజలంతా జెండాలు చేతబూని చంద్రన్నా మీ వెంటే ఉంటాం అని నినదించారని వెల్లడించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా... పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా... పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని పేర్కొన్నారు. 

నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు

ఇప్పుడీ జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా... ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపునిచ్చే పరిస్థితికి వచ్చాడు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు... ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు... ఏమైంది? 

నిన్న అంటున్నాడు... నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు. సైకో జగన్ మోహన్ రెడ్డీ... నీకు తెలియదు. నువ్వు బచ్చాగాడిలా గోలీలాడుకుంటున్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను... మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఓసారి చరిత్ర చూసుకో. 

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 8 పర్యాయాలు డీఎస్సీ పెట్టాం. ఎన్టీఆర్ గారు మూడు సార్లు డీఎస్సీ పెట్టారు. మొత్తమ్మీద టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీ జరిపాం. 

నేనడుగుతున్నా... నువ్వు ఐదేళ్లున్నావు... దిక్కుమాలినోడివి... ఎన్నిసార్లు డీఎస్సీ పెట్టావు? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా? ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తివి... నేను ఇది చేశాను అని చెప్పాలా, లేదా?

జగన్ చేశాడు... ఏం చేశాడంటే... ఐదు వేల జీతంతో వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చాడు! నేను వాలంటీర్లను కోరుతున్నా... మీలో ఎంఏ పాసైన వాళ్లు కూడా ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్లు ఉన్నారు... జగన్ ట్రాప్ లో పడొద్దు. 

మీరు నిర్మొహమాటంగా ఉండండి. తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. వాలంటీర్లను నేను తొలగించనని హామీ ఇస్తున్నా. బాగా చదువుకున్న వాలంటీర్లకు వాళ్ల గ్రామాల్లోనే ఉంటూ రూ.50 వేల వరకు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... మెగా డీఎస్సీ నిర్వహిస్తా. అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.

ప్రజలు గొర్రెలు అనుకుంటున్నాడు... లేకపోతే కోళ్లు అనుకుంటున్నాడు

గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టాడు, బుగ్గలు సవరించాడు. ప్రజలను అమాయకులు అనుకున్నాడు, గొర్రెలు అనుకున్నాడు. లేకపోతే కోళ్లు అనుకున్నాడు... బాగా తిండిపెట్టి కోసుకుని తినొచ్చు అనుకున్నాడు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి. అబద్దాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి. 


ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతు, తాగుబోతు అయితే ఆ కుటుంబం బాగుపడుతుందా? అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడు, అవినీతిపరుడు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. ఆడా మగా, పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని మతాల వారు దెబ్బతిన్నారు.

వీరిద్దరినీ గెలిపించమని అడగడానికి ఇక్కడికి వచ్చాను

ఈసారి సూళ్లూరుపేట నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరినీ గెలిపించమని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. 

కేంద్రంలో  ఎన్డీయే ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, ఈ దుర్మార్గుడు చేసిన నష్టాలను మనం పూడ్చుకోలేం. నేను అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, సర్వేలు చేశాను... పోటీలో ఉన్న వాళ్లందరినీ పరిశీలించిన తర్వాత... పార్టీకి సేవ చేసినవారు, మీకందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవారు అయిన విజయశ్రీని అభ్యర్థిగా ఎంపిక చేశాను. మీ అందరినీ అడిగి ఎంపిక చేశాను కాబట్టి, విజయశ్రీని గెలిపించే బాధ్యత మీది. 

నెల్లూరులో ఎయిర్ పోర్టు వస్తోంది

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం చూస్తే... తిరుపతి ఒకవైపు, నెల్లూరు మరో వైపు, చెన్నై ఇంకోవైపు.. ఇలా మూడు నగరాలు చేరువలో ఉన్నాయి. రెండు ఎయిర్ పోర్టులు దగ్గర్లోనే ఉన్నాయి... నెల్లూరులో మరో ఎయిర్ పోర్టు కట్టుకుంటే, ఈ ప్రాంతానికి మూడు ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉన్నట్టవుతుంది. అదే విధంగా, రెండు పోర్టులు ఉన్నాయి. 

మనకు ఇక్కడ శ్రీసిటీ కూడా ఉంది. తిరుపతి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రపంచంలో అన్ని కంపెనీలను తీసుకువచ్చాను. హీరో మోటార్స్, టీసీఎల్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్... ఇలా  కంపెనీలు తీసుకువచ్చాను. ఇప్పుడీ పరిస్థితి ఉందా? అందుకే జాబు రావాలంటే బాబు రావాలి.

ప్రతి ఒక్కరూ జగన్ చెవిలో పువ్వు పెట్టాలి

నన్ను చూస్తే ఒక కియా మోటార్స్, ఒక హీరో మోటార్స్ వంటి సంస్థలు వస్తాయి. జగన్ ను చూస్తే బూమ్ బూమ్ బ్రాండ్ వస్తుంది. అమరరాజా పరిగెత్తుతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. జగన్ ఉద్దేశంలో మన యువత తెలివి లేనిది. నిరుద్యోగంలో నెంబర్ వన్ అయ్యాం. జగన్ మోహన్ రెడ్డీ... అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావా? ప్రతి ఒక్కరూ ఒక పువ్వు తీసి జగన్ చెవిలో పెట్టి... అతడికి శాశ్వతంగా రాజకీయాలకు విరామం ఇవ్వాలి... అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

 

Chandrababu: నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు: చంద్రబాబు 

30-03-2024 Sat 14:40 | Andhra
  • కడప జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్ వద్ద భారీ సభ
  • రాష్ట్రంలో గంజాయి పరిస్థితులపై చంద్రబాబు ఆవేదన
  • తన భద్రతా అధికారి చెప్పిన ఓ యథార్థ ఘటనను అందరికీ వివరించిన వైనం
 
Chandrababu reveals what his security officer told him

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర ఇవాళ కడప జిల్లాలో ప్రవేశించింది. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు. 

"నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్... చాలా బాధతో చెబుతున్నా... మీరేం చేస్తారో తెలియదు... మీరే అధికారంలో లేరు... కానీ మీ దృష్టికి తీసుకువరావాలని చెబుతున్నా అన్నాడు. 

రాష్ట్రంలో గంజాయి అత్యంత ప్రమాదకర అంశంగా మారింది సార్.. పిల్లలు తెలిసో, తెలియకో దీనికి బానిసలైపోతున్నారు... వాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్... నాకు తెలిసిన ఓ ఉదాహరణ చెబుతాను సార్ అని ఒక మాట చెప్పాడు. 

ఇది విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇలాంటివి కొన్ని లక్షలు ఉన్నాయి. విజయవాడలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకుని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. 

ఆ కాలనీలోకి గంజాయి వాడకం ప్రవేశించింది. వాళ్ల అబ్బాయికి కూడా గంజాయి అలవాటైంది. అదొక వ్యసనంలా మారిపోయింది. దాంతో ఆ దంపతులు తమ పిల్లవాడ్ని హాస్టల్ లో చేర్చితే బాగుపడతాడు అని ఆలోచించారు. ఆ కుర్రాడ్ని హాస్టల్ లో చేర్చారు. 

కానీ, గంజాయికి బానిసైన ఈ కుర్రాడు హాస్టల్ నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగాడు... తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్లు కట్టడి చేయడంతో, డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులతో గంజాయి తాగేవాడు. దాంతో, ఆ అబ్బాయిని హైదరాబాదులోని ఓ పునరావాస కేంద్రంలో చేర్చి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. చేతికందిన బిడ్డ ఆ విధంగా నాశనమైపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించి ఉంటారో చూడండి. రేపు మీ బిడ్డలు కూడా అలాగే అయిపోతే పరిస్థితి ఏంటి? 

రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంతో ప్రజల జీవితాలను, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక మద్యం సీసా రూ.60 ఉంటే... ఇప్పుడెంతకు అమ్ముతున్నారు? అది తాగినా కిక్ రాకపోతే, మళ్లీ ఇంకో క్వార్టర్ తాగుతున్నారు. ఆ విధంగా రోజుకు రూ.400 ఖర్చు చేస్తున్నారు. తిండి లేక, ఇల్లు గడవక మీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి! 

ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? మీలో ఇంకా చైతన్యం రాకపోతే ఎలా? మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్ మోహన్ రెడ్డి. గంజాయి పరిస్థితిపై సమీక్ష చేయడం నీకు చేతకాదా? ఐదేళ్లు దద్దమ్మ ముఖ్యమంత్రి లాగా ఉన్నావా? నేను చెబుతున్నా... నేను ముఖ్యమంత్రిని అయ్యాక 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అమ్మేవాడు ఎవడైనా ఉంటే, వాడు ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు... అదీ నా పరిపాలన. 

గంజాయికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి. చేతకాని దద్దమ్మలు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను సీఎంగా ఉంటే... వాటిని దిగుమతి చేసుకున్నవాడ్ని, వాడికి సపోర్ట్ చేసినవాడ్ని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేసేవాడ్ని... అదీ తెలుగుదేశం పార్టీ సమర్థత. 

జగన్ రెడ్డీ... కల్లబొల్లి మాటలు, సమాజాన్ని నాశనం చేసే మాటలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతోంది. ఒకప్పుడు నేను ఐటీ విప్లవం తీసుకువచ్చి తెలుగు యువతను ప్రపంచం నలుమూలలకు పంపించాను. 

కానీ, ఇప్పుడు మన యువత గంజాయి, జే బ్రాండ్ మద్యం, డ్రగ్స్ కు అలవాటుపడి నిర్వీర్యం అయిపోతున్నారు... అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఉక్రోషం. ఇవాళ మాంచి ఎండలో మీటింగ్ పెట్టినా మీరు పెద్ద ఎత్తున తరలివచ్చారంటే.. ఈ ప్రభుత్వం పట్ల మీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది" అని చంద్రబాబు వాడీవేడిగా ప్రసంగించారు. 

 

Link to comment
Share on other sites

Chandrababu: నా చదువు గురించి జగన్ మాట్లాడుతున్నాడు... ఇప్పుడు నేను అడుగుతున్నా!: చంద్రబాబు 

30-03-2024 Sat 17:49 | Andhra
  • నాయుడుపేటలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడి
  • జగన్... ఇంతకీ నువ్వేం చదివావు? అంటూ చంద్రబాబు ఎదురుదాడి
  • కొత్తగా కంటైనర్ డ్రామాకి తెరలేపారని వ్యాఖ్యలు
 
Chandrababu satires on CM Jagan Mohan Reddy

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుడ్ని చిత్తు చిత్తుగా ఓడించి, ప్యాకప్ చేసి పంపించేయాలని పిలుపునిచ్చారు. 

జగన్ మోహన్ రెడ్డీ... నువ్వేం చదివావు?

నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నేనొక మాట చెప్పా. నా మాదిరిగా రెండు గంటల సేపు ఎండలో నిలుచుని మీటింగ్ చెప్పు... నీ కథేంటో తేలుతుంది అని చెప్పా. నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా... ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివా, 1974లో చదివా, ఆర్థికశాస్త్రంతో చదివా. 

ఇప్పుడు నేను అడుగుతున్నా... జగన్ మోహన్ రెడ్డీ నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? మీకు తెలుసా జగన్ ఏ యూనివర్సిటీలో చదివాడో... దాని పేరు రహస్య యూనివర్సిటీ! ఇలాంటి ఫేక్ ఫెలోస్ నా గురించి మాట్లాడుతున్నారు.

ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు

బాబాయ్ గొడ్డలివేటు చూశారు, కోడికత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. కంటైనర్ పెట్టి ఇంట్లో నుంచి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించారు. గ్రామాల్లో అప్పుడే స్టాక్ పెట్టేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి డబ్బులు పంపించి, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు.

మీ ఆటలు సాగవు... ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికి ఒకరు బయటికి రావాలి, మీ ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలి, ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి, ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని మిమ్మల్నందరినీ కోరుతున్నాను" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Chandrababu: నా బ్రాండ్ ఇది... జగన్ బ్రాండ్ అది: ప్రొద్దుటూరులో చంద్రబాబు 

30-03-2024 Sat 14:09 | Andhra
  • కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో భారీ సభ
  • ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు
  • జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని విమర్శలు
  • ఈయనకు కనీసం శ్రీశైలం ఎక్కడుందో తెలుసా? అంటూ ఎద్దేవా 
 
Chandrababu speech at Proddutur

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏంచేశావు? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు అని విమర్శించారు. కానీ తెలుగదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని ఉద్ఘాటించారు. 

కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు

జగన్ కు నీటి విలువ తెలియదని, కనీసం ప్రాజెక్టుల గురించి కూడా తెలియదని విమర్శించారు. శ్రీశైలం ఎక్కడుందో ఈయనకు తెలుసా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజోలిబండ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలియదని, కానీ అన్నీ తెలిసినట్టు నటిస్తుంటాడని వ్యాఖ్యానించారు. 

ఈయన కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అని, అందుకే ఇతడిని కరకట్ట కమలహాసన్ అని పిలుస్తుంటానని వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో గెలిపించిన పులివెందుల ప్రజలు కూడా ఇక జగన్ ను నమ్మరని, ఎందుకు నమ్మరో కూడా చెబుతానని చంద్రబాబు వివరించారు. జనంలో విపరీతమైన మార్పు వచ్చిందని అన్నారు. ట్రెండు మారిందని, ఎన్నికల్లో వైసీపీ బెండు తీయడం ఖాయమని పేర్కొన్నారు. 

పవన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా

ఇవాళ్టి సభలో జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా, పేదలకు న్యాయం జరగడమే ఆశయంగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు, జగన్ ఎలాంటివాడో నేను చిన్నప్పటి నుంచి చూశాను... కరుడుగట్టిన దుర్మార్గుడు ఈ జగన్... అందుకే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పొత్తు పెట్టుకుంటున్నామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనను ఈ ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 

ట్యాంకు నిండుగా ఉంటేనే నీళ్లొస్తాయి

రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ట్యాంకు నిండుగా ఉంటే, కుళాయి తిప్పతే నీళ్లు వస్తాయి, అదే ట్యాంకులో నీళ్లు లేకపోతే, కుళాయి తిప్పినప్పుడు అడుగున ఉన్న ఉన్న బురద వస్తుంది. ఈ దోపిడీదారుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పరిస్థితి తీసుకువచ్చాడు. 

జగన్ కు సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్  వచ్చి ఉంటే కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా వాళ్ల కొనుగోలు శక్తి పెరిగేది. దాంతో, పరోక్షంగా మరింతమందికి ఉపాధి కలిగేది. నేను కియా మోటార్స్ విషయంలో అదే చేశాను. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ కు నేనే ప్రారంభోత్సవం చేశాను. కరవుసీమ అనంతపురంలో తయారైన కియా కార్లు ప్రపంచమంతా పరుగులు తీస్తున్నాయంటే అదీ తెలుగుదేశం పార్టీ విజన్. 

అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ను రాయలసీమకు తీసుకువచ్చాను... అది నా బ్రాండ్. ఓసారి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్లీ శంకుస్థాపన చేయడం జగన్ బ్రాండ్. ప్రజలను మోసం చేయడం, పరిశ్రమలను తరిమివేయడం జగన్ బ్రాండ్. నేను జాకీ పరిశ్రమను తీసుకువస్తే, అది ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కల్పించారు. అమరరాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. కప్పం కట్టలేక, వీళ్ల దౌర్జన్యాలు భరించలేక పరిశ్రమలు పారిపోతే యువతకు ఉద్యోగాలు వస్తాయా? 

ముద్దులు పెట్టాడు... బుగ్గలు నిమిరాడు... మీరు ఐసైపోయారు!

గత ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను, మా చిన్నాన్న ఉండేవాడు, ఆయనను కూడా చంపేశారు అని తలమీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... దాంతో జనాలు ఐసైపోయారు... ఏదో చేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు జనాలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. 

సీమలో 52 సీట్లలో 49 సీట్లలో వైసీపీని గెలిపించారు... ఎప్పుడైనా సరే... సీమలో ఇంత మంది ప్రజలు నాపై నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను? ఎన్ని రోడ్లు వేశాను? ఏం మంచి పనులు చేశాను? అని ఈ జగన్ ఒక్కరోజైనా ఆలోచించాడా? ఎంతసేపటికీ ఏం ఆలోచించాడు... అవినాశ్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలి? ఇదే ఆలోచన తప్ప సీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే నా కల నెరవేరేది

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకువరావాలన్నది నా కల. పోలవరం నీళ్లు రాయలసీమకు వస్తే ఈ ప్రాంతాన్ని కొట్టే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాను. నాగార్జునసాగర్ వరకు నీళ్లు తీసుకురావాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, పట్టిసీమను పూర్తి చేశాను. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచర్ల వచ్చేవి, అప్పుడు రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది... నా జీవితాశయం నెరవేరేది. కానీ ఈ దుర్మార్గుడు వచ్చి మీ గొంతు కోశాడు. ఈ కడప జిల్లాలో ఒక పరిశ్రమ అయినా వచ్చింది, కనీసం పులివెందులో అయినా ఒక్క కంపెనీ అయినా పెట్టారా? 

మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో భావిస్తే... మనకే నష్టం

అతడిపై మీకు ఇంకా కోపం రాలా! మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో, మనవాడు అనో, లేక మన కులం అనో, మన మతం అనో మీరు భావిస్తున్నట్టున్నారు. ఆ భావన మీలో ఇంకా ఉన్నట్టుంది.. ఆ భావన పోకపోతే మనకే నష్టం. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా, పరిశ్రమలను తరిమివేసే వ్యక్తిని మనం క్షమిస్తామా? నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఇక్కడే పుట్టాను... ఇప్పుడే హామీ ఇస్తున్నా... ఈ రాయలసీమను రతనాలసీమగా మార్చుతా... మీ రుణం తీర్చుకుంటా. కులాన్ని చూడొద్దండీ... చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...