Jump to content

Repu aaina kuturu gurinchi matladutada?? Leka pekka lotu irukundi ani vadilesada?


psycopk

Recommended Posts

8 hours ago, psycopk said:

 

KCR: రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్... ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్ ఇదే... 

30-03-2024 Sat 18:38 | Telangana
  • ఎండిపోయిన... దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్న కేసీఆర్
  • రేపు నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ అధినేత
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీ
  • రోడ్డు మార్గంలోనే ప్రయాణించనున్న కేసీఆర్
 
BRS chief KCR to tour in Telangana tomorrow

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను... అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు ఆయన సూర్యాపేట‌, నల్గొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో పర్యటిస్తారు.

కేసీఆర్ రేపటి షెడ్యూల్ ఇదీ..

కేసీఆర్ ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మొదట జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10:30 గంట‌ల‌కు చేరుకుంటారు. అక్క‌డ ఎండిపోయిన పంటపొలాల‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 11:30 గంట‌ల‌కు సూర్యాపేట జిల్లాలోని తుంగ‌తుర్తి మండ‌లం, అర్వ‌ప‌ల్లి మండ‌లం, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో పర్యటిస్తారు. మ‌ధ్యాహ్నం 1 గంటలకు సూర్యాపేట రూర‌ల్ మండ‌లం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంట‌లకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లంచ్ చేస్తారు. 

మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌లకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటల‌ను పరిశీలిస్తారు. సాయంత్రం ఆరు గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి ఎర్ర‌వెల్లికి బయలుదేరి వెళ్తారు. రోడ్డు మార్గంలోనే ప్రయాణించి రాత్రి ఏడు గంటలకు ఎర్రవెల్లి చేరుకుంటారు.

no need in media..no use....

brs gelisi untw.. cbn .brs tho pothu pettukuntadu 

gelavadaniki nana sankalu nakutunadu 

mana balayyya aemo simham single antadi.. ipudemo gumpu ayaru.. 

Link to comment
Share on other sites

Kuturu ni vadilesadu…

udayamam time lo chanipoyina valla anadarinj udyaam musugu vesinatu malli ade trying to gain sympathy..

oka key point missing enti ante.. 100days lo jarigevi ani previous gov side effects ee… lafangi yedava

KCR: 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్త పాలనా?: రేవంత్ సర్కారుపై కేసీఆర్ ఫైర్ 

31-03-2024 Sun 20:43 | Telangana
  • ఇవాళ 3 జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్
  • రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని వెల్లడి
  • 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరణ
  • తెలంగాణను ఇలా చూస్తాననుకోలేదని వ్యాఖ్యలు 
 
KCR take a dig at Revanth Reddy govt

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించి, పలు ప్రాంతాల్లో పంట పొలాలను సందర్శించారు. నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిన పంట చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించారు. 

అనంతరం కేసీఆర్ స్పందిస్తూ, మూడు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించానని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పంట  నష్టంతో కన్నీరుమున్నీరవుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశామని రైతులు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని వారు బాధపడుతున్నారని వివరించారు. 

100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో ఇంత దుర్భర పరిస్థితి చూస్తానని అనుకోలేదని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24×7 విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. ఆనాడు కరెంట్ పోతే వార్త... ఈనాడు కరెంట్ ఉంటే వార్త అని వ్యాఖ్యానించారు. 

రైతులకు బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో నాడు కరెంట్ పోకుండా విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దామని అన్నారు. నేషనల్ పవర్ గ్రిడ్ కు హైదరాబాద్ ను అనుసంధానించామని, హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామని వివరించారు. అలాంటిది, ఇప్పుడు మళ్లీ పవర్ జనరేటర్లు, ఇన్వర్టర్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. 

ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మిషన్ భగీరథను పూర్తి చేశామని కేసీఆర్ వెల్లడించారు. కానీ ఇప్పుడు మిషన్ భగీరథను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని, పవర్ ఫెయిల్యూర్ కు ఎవరిది బాధ్యత? అని నిలదీశారు. 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమైన పాలనా? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబరు 9న చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో ఎండిన పంటలకు పరిహారంగా ఎకరాకు.25 వేలు చెల్లించాల్సిందేని అన్నారు. 

సమస్యలపై ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని, ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజవకర్గాల్లో బీఆర్ఎస్ దీక్షలు చేపడుతుందని కార్యాచరణ ప్రకటించారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికీ, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...