Jump to content

వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి ఈసీ అభ్యంతరం చెప్పింది...  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి: చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu: వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి ఈసీ అభ్యంతరం చెప్పింది...  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి: చంద్రబాబు 

31-03-2024 Sun 16:12 | Andhra
  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సందేహాలు
  • ప్రజలకు ఊరటనిచ్చిన ఎన్నికల సంఘం... పెన్షన్ల పంపిణీకి ఓకే
  • అయితే వాలంటీర్లను వినియోగించవద్దని ఆదేశాలు
  • రాష్ట్ర సీఎస్, సీఈవోలకు చంద్రబాబు లేఖ 
 
Chandrababu wrote AP CS and CEO on pensions distribution

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

ఈసీ నిర్ణయంపై రాష్ట్ర సీఎస్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో... ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.
20240331fr66093e1dc48c9.jpg20240331fr66093e2633df8.jpg

Link to comment
Share on other sites

Chandrababu: మేం వచ్చాక కొత్త జిల్లా ప్రకటిస్తాం: మార్కాపురంలో చంద్రబాబు 

31-03-2024 Sun 17:18 | Andhra
  • ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఈ సీఎంకు లేదన్న చంద్రబాబు
  • హూ కిల్డ్ బాబాయ్ అంటే జగన్ కు తెలియదట అంటూ ఎద్దేవా 
 
Chandrababu assures Markapur as new distrcit

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తాము అధికారంలోకి వచ్చాక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని వెల్లడించారు. 

కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రామాయపట్నం పోర్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా పండిస్తారని ఏషియన్ పల్ప్ పరిశ్రమను తెచ్చానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏషియన్ పల్ప్ పరిశ్రమ పారిపోయిందని తెలిపారు. నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారని మండిపడ్డారు. 

ఈ ముఖ్యమంత్రికి విశ్వసనీయత ఉందా?

ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. గత ఎన్నికల ముందు ఏం చెప్పాడు?... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడా లేదా? కేంద్రం మెడలు వంచకపోగా, తానే మెడలు దించాడు. అదీ నీ విశ్వసనీయత! ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చాడా? ఎంతసేపూ నీ వ్యక్తిగత కేసులు తప్ప, రాష్ట్రాన్ని పట్టించుకుంది లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్నా... ఇదీ నీ విశ్వసనీయత. 

మద్యపానాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు... రద్దు చేశాడా అని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డీఎస్సీ ఇవ్వకపోడం నీ విశ్వసనీయత. మేం వచ్చాక నా మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే అని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. 

హూ కిల్డ్ బాబాయ్ అంటే  జగన్ కు తెలియదట!

హూ కిల్డ్ బాబాయ్ అంటే మీకందరికీ తెలుసు. కానీ జగన్ కు తెలియదంట. నిందితుడ్ని పక్కనపెట్టుకుని, బాధితులను జైలుపాలు చేయాలని చూస్తున్నాడు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావ్ జగన్! బాబాయిని ఎవరు చంపారంటే ఇప్పటికీ చెప్పడు. మాట్లాడితే కలియుగం అంటాడు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగం మహిమ. 

బాబాయ్ ని చంపేవాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మనకు కావాలా? కంటైనర్ లో డబ్బులు పంపించేవాళ్లు మీకు కావాలా? ప్రజాసేవ చేసి మీ జీవితాలు మార్చేవాళ్లు మీకు కావాలి. మీ తరఫున పోరాడినందుకు మా గతి ఏమైందో మీరంతా చూశారు. ఎంతమందిపై కేసులు పెట్టారో, ఎంతమందిని జైల్లో పెట్టారో మీకు తెలియదా? ఇప్పటికీ కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదు" అంటూ  చంద్రబాబు పేర్కొన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: మీరు నా కంటే ఫాస్ట్... 'వివేకం' సినిమాపై చంద్రబాబు స్పందన 

31-03-2024 Sun 15:15 | Andhra
  • వివేకానందరెడ్డి జీవితకథ ఆధారంగా వివేకం
  • యూట్యూబ్ లో రిలీజ్
  • ప్యాలెస్ గుట్టు తెలిసిందా అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
 
Chandrababu talks about Vivekam movie

వైఎస్ వివేకానందరెడ్డి జీవితగాథపై రూపొందించిన 'వివేకం' అనే చిత్రం యూట్యూబ్ లో రిలీజైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ... "ఇవాళ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. 'వివేకం' అని ఎవరో ఒక సినిమా తీశారు. ఆ సినిమా చూడండి మీరు. మీలో ఆ సినిమా ఎంత మంది చూశారు? ప్యాలెస్ గుట్టు తెలిసిందా? మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు...  మీకన్నీ తెలుసు తమ్ముళ్లూ... కానీ ముందుకు రారు" అని వ్యాఖ్యానించారు. 

ఇక, తన ప్రసంగం ముగించిన అనంతరం చంద్రబాబు... సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ డీజే బాక్సుల్లోంచి వస్తున్న పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 

వివేకా బయోపిక్ గా తెరకెక్కిన వివేకం చిత్రానికి యూట్యూబ్ లో తొలిరోజే మిలియన్ వ్యూస్ లభించాయి. టీమ్ ఎస్ క్యూబ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.

Link to comment
Share on other sites

Chandrababu: ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు.. అనుమానమే లేదు... గేమ్ ఈజ్ ఓవర్: ఎమ్మిగనూరులో చంద్రబాబు 

31-03-2024 Sun 14:57 | Andhra
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన చంద్రబాబు
  • ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని ఎద్దేవా
  • కూటమి అన్ స్టాపబుల్ అంటూ ధీమా 
 
Chandrababu speech in Yemmiganur

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభలో వాడీవేడిగా ప్రసంగించారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని అన్నారు. జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు అని వెల్లడించారు. ఇంత మధ్యాహ్నం వేళ ఎండను కూడా లెక్కచేయకుండా జనం వచ్చారు... ఈ మీటింగ్ చూశాక అనుమానమే లేదు... గేమ్ ఈజ్ ఓవర్... కూటమి అన్ స్టాపబుల్... ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ (టీడీపీ) తొక్కుకుంటూ పోతుంది... గ్లాసు (జనసేన) కూడా ఎక్కడిక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది... పువ్వు (బీజేపీ) కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది... అని మూడు పార్టీల కూటమి గురించి చంద్రబాబు వివరించారు. 

జగన్ కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్టు అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా... రాష్ట్రంలో కరవు కనిపించడం లేదా? తాగడానికి నీళ్లు ఉన్నాయా? ఇక్కడ జగన్ కు బిందెలతో నిరసన తెలిపారు... అవునా, కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

కానీ... అన్ని ఊళ్లకు నీళ్లిచ్చాను, నా ముద్ర ఉంది అని చెప్పుకుంటున్నాడు... ఏంటి నీ ముద్ర, ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా? ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి వేయని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా? అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

"రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. నేను గతంలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, ఇతడు ముష్టి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ప్రాంతానికి హెచ్ఎల్ సీ, గురు రాఘవేంద్ర, గుండ్రేవుల ప్రాజెక్టులే శరణ్యం. ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర తప్ప వేరే నీళ్లు రావు. అలాంటి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళితే, ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు. 

ఈ ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి ఉంది. నేను మీకు అండగా ఉంటా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా... ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తును మార్చుతా. 

ఈ ఎమ్మిగనూరు గడ్డపై నుంచి చెబుతున్నా... జగన్ రాయసీమ ద్రోహి... ఒక్క ఓటు కూడా వేయొద్దు. ఈ ప్రాంతంలో అనేక వెనుకబడిన కులాల వారికి అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చాం. టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. బీసీలను గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ" అని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Chandrababu: వెధవల్లారా... మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పాను: చంద్రబాబు 

31-03-2024 Sun 14:24 | Andhra
  • నేడు మూడు జిల్లాల్లో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభకు హాజరైన టీడీపీ అధినేత
  • బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
 
Chandrababu fires on fake propaganda

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు తప్పుడు వార్తలు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాయగాళ్లు వచ్చారని అన్నారు. వెధవల్లారా... మీకు సిగ్గులేదు... ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పానని, కానీ ఫేక్ వార్తలతో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, చంద్రబాబు ఇవాళ కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. ఎమ్మిగనూరు సభ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం (క్లాక్ టవర్ సెంటర్)లో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బాపట్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ప్రజాగళం సభ జరగనుంది.

Link to comment
Share on other sites

Just now, jaathiratnalu2 said:

Asalu EC complaint chesi apinchibdi CBN to Hild and not to give pentions 

And now he is acting as innocent 

Mi e pulkas athi Telivi takkukoleka last time chepputo motto 23 ichharu .. Inka buddi maraledu

Yes ycp vallu volunteers tho elections pracharam cheyistunaru…adi tappu kada?

Link to comment
Share on other sites

47 minutes ago, psycopk said:

Yes ycp vallu volunteers tho elections pracharam cheyistunaru…adi tappu kada?

EC already suspended few folks and they stoped campaign … 

Daniki pensions and other benefits apart kada 

  • Like 1
Link to comment
Share on other sites

9 minutes ago, jaathiratnalu2 said:

EC already suspended few folks and they stoped campaign … 

Daniki pensions and other benefits apart kada 

Suspend chesindhi few ne anna, inka villages lo vichalavidiga YCP kosam working valu 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

 

Chandrababu: వెధవల్లారా... మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పాను: చంద్రబాబు 

31-03-2024 Sun 14:24 | Andhra
  • నేడు మూడు జిల్లాల్లో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభకు హాజరైన టీడీపీ అధినేత
  • బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
 
Chandrababu fires on fake propaganda

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు తప్పుడు వార్తలు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాయగాళ్లు వచ్చారని అన్నారు. వెధవల్లారా... మీకు సిగ్గులేదు... ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పానని, కానీ ఫేక్ వార్తలతో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, చంద్రబాబు ఇవాళ కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. ఎమ్మిగనూరు సభ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం (క్లాక్ టవర్ సెంటర్)లో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బాపట్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ప్రజాగళం సభ జరగనుంది.

Ee age lo kuda rojuki 2 meetings attend avuthunadu, great CBN, inka vuu 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Bendapudi_english said:

Suspend chesindhi few ne anna, inka villages lo vichalavidiga YCP kosam working valu 

Ippudu pentions aapite work cheyakubda vuntara cheppu .. pensions appubchadam valla .. it will give negative mark on TDP party 

  • Like 1
Link to comment
Share on other sites

4 minutes ago, jaathiratnalu2 said:

Ippudu pentions aapite work cheyakubda vuntara cheppu .. pensions appubchadam valla .. it will give negative mark on TDP party 

Pension aapamani EC analedhu anna, as usual YCP propaganda nadusthundhi, volunteers tho pampodhu ani EC chepthundhi.

TDP ki nastam emi ledhu anna, pension and padhakalu thisukune valu elago YCP ki vestharu kothaga vache nastam emi ledhu 

Link to comment
Share on other sites

Just now, Bendapudi_english said:

Pension aapamani EC analedhu anna, as usual YCP propaganda nadusthundhi, volunteers tho pampodhu ani EC chepthundhi.

TDP ki nastam emo ledhu anna, pension and padhakalu thisukune valu elago YCP ki vestharu kothaga vache nastam emi ledhu 

TDP party complaint on volunteers not to work and EC lo anta mana valle.. This first step in poll management , Where is required suppport from BJP. It is the main reason to alliance with TDP , where they don’t have 2% voting also 

Link to comment
Share on other sites

6 minutes ago, jaathiratnalu2 said:

TDP party complaint on volunteers not to work and EC lo anta mana valle.. This first step in poll management , Where is required suppport from BJP. It is the main reason to alliance with TDP , where they don’t have 2% voting also 

Exactly idhi correct, anthe kani pension apeyamani complaint cheyaledhu anna 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...