Jump to content

Yenda kalam lo yendina panta nu parisilinchina lafangi

psycopk

Recommended Posts

KCR: ముగ్దూంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ 

05-04-2024 Fri 14:09 | Telangana
  • కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్
  • మధ్యాహ్నం గంగుల కమలాకర్ నివాసంలో భోజనం
  • సాయంత్రం సిరిసిల్లలో మీడియా సమావేశం
 
KCR Polam Baata

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 'పొలంబాట' కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి కేసీఆర్ ముగ్దూంపూర్ కు చేరుకుని, అక్కడి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతోందని కేసీఆర్ కు రైతులు తెలిపారు. రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్... రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని... రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు.

అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటకి బయల్దేరారు. ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం బోయినపల్లి మండలంలో ఎండిపోయిన పంటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని చెపుతున్నారు.  

Link to comment
Share on other sites

KTR: విద్యార్థినులతో కలిసి ఫ్రూట్ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగిన కేటీఆర్  

05-04-2024 Fri 15:03 | Telangana
  • ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేటీఆర్
  • ఎండ వేడిమికి కాస్త విరామం తీసుకున్న వైనం
  • విద్యార్థినులతో కాసేపు గడిపిన కేటీఆర్
 
KTR with school students

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా మొత్తం సమయాన్ని ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎండల్లోనే ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ప్రచారం సందర్భంగా ఎండ వేడిమికి కాస్త విరామం తీసుకుని కొంత సమయాన్ని స్కూలు విద్యార్థినులతో కేటీఆర్ గడిపారు. ఓ ఫ్రూట్ జ్యూస్ షాపులో వారితో కలిసి పండ్ల రసాన్ని తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
20240405fr660fc49e6ca7c.jpg20240405fr660fc4a958383.jpg20240405fr660fc4b5f08e9.jpg

Link to comment
Share on other sites

KTR: బీజేపీ నేత‌ల‌ 'ప్రధాని' వ్యాఖ్యలపై కేటీఆర్ చుర‌క‌లు..! 

05-04-2024 Fri 09:48 | Telangana
  • బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాని విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత సెటైరిక‌ల్ ట్వీట్
  • భార‌త తొలి ప్ర‌ధాని సుభాష్ చంద్ర‌బోస్ అంటూ నోరు జారిన నటి కంగనా రనౌత్
  • ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు  
 
Where did all these people graduate from KTR satirical tweet on BJP

బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాన‌మంత్రి విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' (ట్విట‌ర్) వేదిక‌గా చుర‌క‌లు అంటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న‌ సినీ నటి కంగనా రనౌత్ ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన‌ చర్చా వేదిక‌లో మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స్వాతంత్ర భార‌త తొలి ప్ర‌ధాని అని నోరు జారారు. ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు. 

"ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌న తొలి ప్ర‌ధాన‌మంత్రి అని అంటారు. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నేత మ‌హాత్మాగాంధీ మ‌న ప్ర‌ధాని అని చెబుతారు. అస‌లు వీళ్లంతా ఎక్క‌డి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో?" అని కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Link to comment
Share on other sites

Harish Rao: రేవంత్ రెడ్డి పక్క పార్టీ వాళ్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు: హరీశ్ రావు విమర్శ 

05-04-2024 Fri 16:26 | Telangana
  • 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో మోసం చేశారని మండిపాటు
  • సీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు ఇచ్చారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్న సిద్దిపేట ఎమ్మెల్యే
 
Harish rao targets Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని... పక్క పార్టీ వాళ్ల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రైతులను గాలికి వదిలేశారని... 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే దారికి వచ్చి హామీలను అమలు చేస్తారన్నారు. మెదక్ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా మెదక్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ... ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపివేయించారని విమర్శించారు. దుక్కికో.. నాటుకో ఉపయోగపడే రైతుబంధు డబ్బులు పంట కోతకొచ్చినా రాలేదన్నారు. రైతుబంధు కోసం తాము ఉంచిన డబ్బులు కాంగ్రెస్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్ మోటర్లు కాలిపోతున్నాయన్నారు. రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లిచ్చామని... రెండు పంటలు పండించుకునేలా నీళ్లిచ్చామన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగాయని ఎద్దేవా చేశారు. పెన్షన్ పెరగలేదని... పైగా జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. అన్న వస్త్రాలకు పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లుగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. ఆడబిడ్డల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తామని మోసం చేశారన్నారు. కల్యాణలక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తానని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు.

కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు ఇచ్చారని, చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని మోసం చేశారన్నారు. ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్‌కు ఓటేయాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారని... కానీ మోసపోయారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. దుబ్బాక ప్రజలను బీజేపీ రఘునందన్ రావు మోసం చేశారన్నారు. రఘునందన్ రావుని దుబ్బాక ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పదేళ్లలో సామాన్యులకు బీజేపీ చేసిందేమీ లేదని... పైగా పెట్రోల్, డీజిల్‌, అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయన్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Kcr monna vachadu 200 mandi chacharu annadu… revant simple ga oke aa 200 list ivu annadu .. anta silent… 🤣🤣🤣

Meeru only scamgress press meets ee chustara? KTR already sent the list of 218 farmers to media and gumpu mestri.

  • Upvote 2
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

KCR: ముగ్దూంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ 

05-04-2024 Fri 14:09 | Telangana
  • కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్
  • మధ్యాహ్నం గంగుల కమలాకర్ నివాసంలో భోజనం
  • సాయంత్రం సిరిసిల్లలో మీడియా సమావేశం
 
KCR Polam Baata

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 'పొలంబాట' కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి కేసీఆర్ ముగ్దూంపూర్ కు చేరుకుని, అక్కడి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతోందని కేసీఆర్ కు రైతులు తెలిపారు. రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్... రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని... రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు.

అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటకి బయల్దేరారు. ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం బోయినపల్లి మండలంలో ఎండిపోయిన పంటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని చెపుతున్నారు.  

Bayya nevu eppudu congress ni kooda mosthunnava.. ennallu only tdp anukunna 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Kcr monna vachadu 200 mandi chacharu annadu… revant simple ga oke aa 200 list ivu annadu .. anta silent… 🤣🤣🤣

Nee bonda, already 200 names list release chesindru kavalante Twitter lo velli chudu, KTR sent those names to Revanth. 

  • Haha 1
Link to comment
Share on other sites

KCR: లోక్ సభ ఎన్నికల తర్వాత 10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్ 

05-04-2024 Fri 17:30 | Telangana
  • పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్న కేసీఆర్
  • పొలంబాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన 
  • మొదట కరీంనగర్ రూరల్‌ జిల్లా, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన
 
KCR call for Medigadda muttdi after election

లోక్ సభ ఎన్నికల తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. పొలంబాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

మొదట కరీంనగర్ రూరల్‌ జిల్లా ముగ్ధుంపూర్‌లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. అండగా ఉంటామంటూ రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శాభాష్‌పల్లి వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. 

Link to comment
Share on other sites

Harish Rao: మీ మేనిఫెస్టోకు ఏమైనా విలువ ఉందా?: రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ 

05-04-2024 Fri 18:27 | Telangana
  • మేనిఫెస్టో పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని... ఆ తర్వాత విస్మరించడం కాంగ్రెస్‌‌కు అలవాటే అన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే పలుమార్లు చూశామని... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం చేయవద్దని సూచన
  • బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ ఇచ్చిందన్న హరీశ్ రావు
  • అలాంటి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకువస్తామని చెప్పడం విడ్డూరమన్న హరీశ్ రావు
 
Harish Rao open letter to Rahul Gandhi

మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయవద్దని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టో పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని... ఆ తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే పలుమార్లు చూశామని... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం చేయవద్దని కోరారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని ఎంపీ టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకువస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మోసం చరిత్రలో చాలాసార్లు రుజువైందన్నారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఆ రెండు సందర్భాల్లో అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో మీరే అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారని... కానీ అమలు చేయలేని మేనిఫెస్టో ఎందుకని ప్రశ్నించారు.

మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉందా? ఇప్పటి వరకు ఒక్క దానినైనా అమలు చేశారా? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో మాకు చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేదనే విషయం ఇప్పటికే రుజువైందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మీరు చెప్పడం లేదని విమర్శించారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడంపై శ్రద్ధ లేని మీకు కొత్త హామీలు ఇచ్చే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకుంటే మీ ఎత్తుగడలు సాగబోవని హెచ్చరించారు.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

KTR: బీజేపీ నేత‌ల‌ 'ప్రధాని' వ్యాఖ్యలపై కేటీఆర్ చుర‌క‌లు..! 

05-04-2024 Fri 09:48 | Telangana
  • బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాని విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత సెటైరిక‌ల్ ట్వీట్
  • భార‌త తొలి ప్ర‌ధాని సుభాష్ చంద్ర‌బోస్ అంటూ నోరు జారిన నటి కంగనా రనౌత్
  • ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు  
 
Where did all these people graduate from KTR satirical tweet on BJP

బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాన‌మంత్రి విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' (ట్విట‌ర్) వేదిక‌గా చుర‌క‌లు అంటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న‌ సినీ నటి కంగనా రనౌత్ ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన‌ చర్చా వేదిక‌లో మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స్వాతంత్ర భార‌త తొలి ప్ర‌ధాని అని నోరు జారారు. ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు. 

"ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌న తొలి ప్ర‌ధాన‌మంత్రి అని అంటారు. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నేత మ‌హాత్మాగాంధీ మ‌న ప్ర‌ధాని అని చెబుతారు. అస‌లు వీళ్లంతా ఎక్క‌డి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో?" అని కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Eedu mari adigi mari minguthunnadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...