Jump to content

ఈ ఏడాది చంద్ర‌బాబుకు అన్నీ మంచి శకునములే


psycopk

Recommended Posts

Chandrababu: ఈ ఏడాది చంద్ర‌బాబుకు అన్నీ మంచి శకునములే..! 

09-04-2024 Tue 14:23 | Andhra
  • మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు  
  • ఈ ఏడాది చంద్ర‌బాబుకు బాగా క‌లిసి వ‌స్తుందన్న‌ పంచాంగ‌క‌ర్త మాచిరాజు వేణుగోపాల్
  • బాబుకు అధికార యోగం ఉంద‌న్న పంచాంగ‌క‌ర్త‌
  • ఈసారి ఎన్నిక‌ల్లో కూట‌మికి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్ల‌మెంట్ సీట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డి
  • ఈ ఏడాది చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డ‌తార‌ని జోస్యం
  • త్రిమూర్తుల క‌ల‌యిక‌తో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
 
Chandrababu participate in Ugadi Festival Celebrations in Mangalagiri TDP office

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఉగాది వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ప్ర‌ముఖ పంచాంగ‌క‌ర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం చంద్ర‌బాబుకు బాగా క‌లిసి వ‌స్తుంద‌న్నారు. 

ఈ ఏడాది చంద్ర‌బాబుకు అధికార యోగం ఉంద‌ని పంచాంగ‌క‌ర్త తెలిపారు. ఈసారి ఎన్నిక‌ల్లో కూట‌మి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్ల‌మెంట్ స్థానాల్లో జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేస్తుంద‌న్నారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డ‌తార‌ని తెలిపారు. అలాగే త్రిమూర్తుల క‌ల‌యిక‌తో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. మోదీని బ్ర‌హ్మాగా, ప‌వ‌న్‌ను విష్ణువుగా, చంద్ర‌బాబును ఈశ్వ‌రుడిగా ఆయ‌న‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Pawan Kalyan: క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: పవన్ కల్యాణ్ 

09-04-2024 Tue 14:32 | Andhra
  • చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైనం
  • ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి
 
Pawan Kalyan participates Ugadi celebrations in Chebrolu

జనసేనాని పవన్ కల్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేశారు. అనంతరం వారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. 

క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. 

ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని, క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

Chandrababu: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు 

09-04-2024 Tue 15:00 | Andhra
  • వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు
  • వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ
  • జగన్ అవకాశవాద రాజకీకయం చేస్తున్నారని మండిపాటు
 
Chandrababu promise to Volunteers

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు చెపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఆయన వాలంటీర్లకు తీపి కబురు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే... తాము అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

నిన్న, మొన్న వాలంటీర్లను రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెచ్చారని... ఇప్పుడు వాలంటరీ వ్యవస్థే లేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారా, రహస్య జీవో ఏదైనా ఇచ్చారా అని సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించరు. మళ్లీ సీఎం ఎయితే  తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని జగన్ అన్నారని... అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా అని అడిగారు. అవకాశవాద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

వాలంటీర్లను రాజీనామా చేసి, వైసీపీ కోసం పని చేయమంటున్నారని... రాజీనామా చేయనివారిని రాజీనామా చేయకుండానే పార్టీ కోసం పని చేయాలని కూడా చెపుతున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తే కేసులు నమోదవుతాయని... కేసులు నమోదైతే వాలంటీర్లకు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలని సూచించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు

Link to comment
Share on other sites

Happy Ugadi Samara 

But e Panchangam cheppe vallu e party ki chebite valla Gurunchi manchi cheyappali kada anna

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 2 months later...
On 4/9/2024 at 3:04 AM, jaathiratnalu2 said:

Happy Ugadi Samara 

But e Panchangam cheppe vallu e party ki chebite valla Gurunchi manchi cheyappali kada anna

Yes bro 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...