Jump to content

Kootami manifesto released today


psycopk

Recommended Posts

 

Manifesto: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... వివరాలు ఇవిగో! 

30-04-2024 Tue 16:04 | Andhra
  • చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం
  • హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్
  • వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్
 
Chandrababu and Pawan Kalyan releases Alliance manifesto

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోను పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు...
 

  • ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500.... 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు
  • తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం'
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
  • డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 
  • దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
 
  • రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు
  • మెగా డీఎస్సీపై తొలి సంతకం
  • ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్
 
  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
  • బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 
  • బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం
  • స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ... నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత
  • చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
 
  • తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల  ద్వారా రాజ్యాధికారంలో భాగం
  • బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన... దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నిధుల కేటాయింపు
  • బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు... ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత
  • యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం... అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం
  • గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు
 
  • చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం
  • దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం... వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
  • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్
  • వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్... రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు
  • రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం... 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 
  • ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్
 
  • సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం
  • జీవో.217 రద్దు 
  • మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం
  • చిన్న స్థాయి పోర్టులకు చేయూత
  •  స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు
  • ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు
  • చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు
  • వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ
 
  • ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు
  • అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా
  • ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు... ఏవియేటర్లపై సబ్సిడీలు
  • సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం
  • విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్
  • కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 
  • రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన
 
  • చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ
  • ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు... అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం
  • ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం... పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన
  • భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన
 
  • యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం
  • ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు
  • అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత
  • ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 
  • మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు... కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు... వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక
 
  • ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు... పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు... దశల వారీగా బకాయిల చెల్లింపు
  • ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు
  • సీపీఎస్ పై అధ్యయనం చేసిన సమస్య పరిష్కారానికి కృషి 

 

Link to comment
Share on other sites

10 minutes ago, Sucker said:

He is not responsible for this manifesto. PK ganni gatti ga pattukuntaru. Hope TDP win avvali baby_dc1

You are wrong.

Pawala gadi ki gelichina odina poyedi em ledhu vachedi em ledhu package kakunda…

inka kootami odithene vadiki better.., maku alliance lo thakkuva seats ichharu…pothu dharmam lo bhaganga thyagam cheskunnam… leka pothe sweep chese vallam…ani 2029 daka party survive aytadi…

Link to comment
Share on other sites

ayina inko 2 weeks lo elections pettukni ipudu manifesto endho...applies to all major parties.

intha kalam deni basis meedha pracharam chesaro.....hatha vidhi...

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

Where is AP BJP president 

Send this not agreed by BJP  on manifesto 

if they don’t have agreement on manifesto itself , what they can do to people 

CBN promises/manifaesto ni nammatam  chala kastam

TDP manifesto - last Time, 10 % success rate 

Jagga manifesto-  60 % succes rate with flaw of development activities 

Still at this time most of people believe Jagga from manifesto side 

 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...