Jump to content

Amit shah and CBN


psycopk

Recommended Posts

Amit Shah: కూటమిని గెలిపించండి... ఏపీలో అభివృద్ధి సంగతి మేం చూసుకుంటాం: అమిత్ షా

05-05-2024 Sun 13:48 | Andhra
  • లేపాక్షి ఆలయం, సత్యసాయి బాబాకు నమస్కరించి ప్రసంగం ప్రారంభం
  • అరాచక పాలనపై పోరాడేందుకే ఏపీలో కూటమి కట్టామన్న కేంద్ర హోంమంత్రి
  • ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడమే పొత్తు లక్ష్యమని వివరణ
Central Minister Amit Sha Speech At Dharmavaram Prajagalam Sabha

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక పాలనకు ముగింపు పలకడానికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఏపీలో అవినీతిపై జరుగుతున్న పోరాటానికి మద్ధతు తెలిపేందుకే తాను రాష్ట్రానికి వచ్చానని వెల్లడించారు. ఈమేరకు ధర్మవరంలో కూటమి తరఫున ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. సభావేదికపై ఆసీనులైన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మిగతా నేతలందరికీ నమస్కారం తెలిపారు. శ్రీరాముడు జటాయువును కలుసుకున్న పవిత్ర భూమి హిందూపూర్ కు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పూజలందుకున్న సత్యసాయి బాబాకు ఈ సందర్భంగా నమస్కరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. అమిత్ షా హిందీలో ప్రసంగించగా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ నేత సత్య కుమార్ తెలుగులోకి అనువదించారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోక్ సభ తో పాటు శాసన సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని అమిత్ షా చెప్పారు. ఈ ఎన్నికల్లో అవినీతిపై, అక్రమార్కులపై పోరాడేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన నడుం బిగించాయని వివరించారు. ఈ పోరాటానికి బలం చేకూర్చడానికే తాను ఈ రోజు ధర్మవరం వచ్చానని తెలిపారు. ఏడు దశలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ రెండు దశలలో మోదీ సెంచరీ పూర్తి చేశారని (వంద సీట్లు గెల్చుకున్నారని) చెప్పారు. మూడో దశ పోలింగ్ లో 400 సీట్లు సాధించే దిశగా దూసుకెళుతున్నారని అమిత్ షా వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎందుకు కట్టామంటే..
ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేయడానికి కారణమేంటని తనను మీడియా మిత్రులు అడిగారని అమిత్ షా చెప్పారు. కూటమి లక్ష్యం ఏంటని అడిగిన ప్రశ్నకు ఈ సభావేదికగా జవాబిస్తానని వివరించారు. 

‘ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ చేతులు కలిపారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏకమయ్యాయి. రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్థుల ఆటకట్టించేందుకే పొత్తు పెట్టుకున్నాం. ఏపీలో అవినీతి పాలనకు ముగింపు పలికేందుకే పొత్తు పెట్టుకున్నాం. ల్యాండ్ మాఫియా పీచమణచడానికి, అమరావతిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి పొత్తుపెట్టుకున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునఃస్థాపితం చేయడానికి పొత్తు పెట్టుకున్నాం. తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తుపెట్టుకున్నాం. జగన్ రెడ్డీ... గుర్తుంచుకో... బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వం.

 రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగును అంతరించిపోకుండా చూసుకుంటాం. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను  గెలిపించండి... రాష్ట్ర అభివృద్ధిని మాకు వదిలేయండి. 

పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో  బీజేపీ కీలకపాత్ర పోషించింది.  ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు.‘ అని అమిత్ షా పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Chandrababu: అందరి అనుమానాలు పటాపంచలు చేసిన అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

05-05-2024 Sun 14:38 | Andhra
  • ధర్మవరంలో ఎన్డీయే కూటమి సభ
  • హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు
  • ధర్మవరం దద్దరిల్లిందన్న టీడీపీ అధినేత
  • పొత్తు ఎందుకుని చాలామందికి అనుమానాలున్నాయని వెల్లడి
  • అన్ని అనుమానాలకు అమిత్ షా స్పష్టమైన సమాధానం చెప్పారని వివరణ
Chandrababu said he appreciates Amit Shah for clarified doubts on Alliance

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ధర్మవరంలో కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగం అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ మూడు పార్టీలు కలిసి మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లిందని అన్నారు. నడి ఎండల్లో మీటింగ్ పెట్టినా జనం పోటెత్తారని, జనాన్ని చూసి ఎండలు కూడా భయపడుతున్నాయని ఛమత్కరించారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వం... మరోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారు అని చంద్రబాబు వివరించారు. 

"మేం చేస్తున్నది ధర్మపోరాటం... ధర్మాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధం కావాలి. ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పొత్తు ఎందుకున్న వారి ప్రశ్నకు అమిత్ షా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజలు గెలవాలి... దుర్మార్గుడ్ని ఇంటికి పంపించాలి అని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 

ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేశాడు... మూడు ముక్కలాటతో ఏ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటాం. అమరావతిని ప్రపంచపటంలో పెట్టే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుంది. 

అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా సైకోని... ఇక ఏ ముఖం పెట్టుకుని తిరుగుతావ్? పోలవరంకు కట్టుబడి ఉన్నాం... పూర్తి చేస్తామని ప్రధాని మోదీ కూడా స్పష్టంగా చెప్పారు. అవినీతి వల్లే పోలవరం ఆలస్యం అయిందని అమిత్ షా కూడా చెప్పారు" అని చంద్రబాబు వివరించారు.

"పెన్షన్ల కోసం వృద్ధులను పొట్టనబెట్టుకుంటోందీ ప్రభుత్వం. మండుటెండలో సచివాలయాలకు రమ్మని పిలిచారు... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచించింది. దాంతో బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేసి వృద్ధులను మళ్లీ ఇబ్బంది పెట్టారు. ఇలాంటి శవరాజకీయాలు చేసే ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి. కూటమి గెలిచి అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ను ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు పింఛనును రూ.6 వేలకు పెంచుతాం. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇస్తాం. 

గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపాడు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్ కు ముందే తెలుసు. ఓడిపోతానన్న భయంతోనే జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవో జగన్ చెప్పాలి. 

నాడు మేం ఉచితంగా ఇసుక ఇచ్చాం... ఇవాళ ఇసుక దొరికే పరిస్థితి లేకుండా చేశారు. మేం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం తెస్తాం. రాయలసీమ లేపాక్షి భూములు కొట్టేయాలని చూశారు. ఇప్పుడు మన భూములపై మనకు హక్కు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు? మన భూమి మనం అమ్ముకోవాలన్నా జగన్ అనుమతి కావాలంట! జగన్ ను గద్దె దింపి, వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Amit Shah: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి జగన్ ను, రాహుల్ ను పిలిచాం... ఇద్దరూ రాలేదు: అమిత్ షా

05-05-2024 Sun 14:56 | Andhra
  • ధర్మవరంలో కూటమి సభ
  • హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా
  • మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక రామమందిరం నిర్మించామని వెల్లడి
Amit Shah slams YS Jagan in Dharmavaram rally

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఐదు నెలల్లోనే అయోధ్య కేసు గెలిచామని, రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశామని, మందిరం నిర్మించడమే కాకుండా, అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశామని వివరించారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పంపామని, కానీ వారు ఇద్దరూ రాలేదని అమిత్ షా ఆరోపించారు. 

ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. జగన్ రూ.13.50 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిపై రుద్దారని అమిత్ షా పేర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్... రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను ప్రోత్సహించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా పునర్ నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. 

ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి... అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి... డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా పరుగులు తీస్తుందో మీరే చూస్తారు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 

అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేక సమావేశం!

ధర్మవరం సభ సందర్భంగా అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరు, రాష్ట్రంలో కొందరు అధికారుల వైఖరి గురించి కూడా అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్చకు వచ్చాయి. కాగా, నివేదికల ప్రకారం కూటమిదే అధికారమని, ఊహించనిదానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని, జగన్ ప్రభుత్వంపై అత్యధిక శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Rajnath Singh: జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు సరిగా లేవు: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

05-05-2024 Sun 16:39 | Andhra
  • కడప జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశం
  • హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
  • ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా
  • ఏపీ ప్రగతిలో మోదీ పాత్ర కీలకం అని వెల్లడి 
Rajnath Singh attends BJP workers meeting in Kadapa district

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ ఏపీకి విచ్చేశారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి కూటమి అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, భూపేశ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు సరిగా లేవని విమర్శించారు. కేంద్రం ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడించారు. కానీ ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చి జగన్ అంతటితో చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశం, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతాయని చెప్పారు. ఏపీలో కూటమి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను భారీ మెజారిటీతో  గెలిపించాలని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రగతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకం అని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నరసింహారావుకు కూడా భారతరత్న ఇచ్చిన ఘనత మోదీది అని కొనియాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మోదీ సర్కారు లక్ష్యం అని తెలిపారు. 

అయోధ్య రామమందిరం అనేది హిందువుల 500 ఏళ్ల కల అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. మోదీ సర్కారు ఆ కల నెరవేర్చిందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు ముస్లిం మహిళలకు గొప్ప ఊరట అని తెలిపారు.

Link to comment
Share on other sites

Chandrababu: మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?: తంబళ్లపల్లెలో చంద్రబాబు

05-05-2024 Sun 18:13 | Andhra
  • అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అని వెల్లడి
  • 400 ఎంపీ సీట్లతో ఎన్డీయే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా
  • మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత 
Chandrababu speech in Tamballapalle

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం అమిత్ షా హాజరైన ధర్మవరం సభలో పాల్గొన్న చంద్రబాబు... ఆ సభ ముగిసిన అనంతరం తంబళ్లపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ముసురు కాపు వర్గం జనాభా ఎక్కువని, అందుకే సామాజిక న్యాయం కోసం ముసురు కాపు వర్గానికి చెందిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చానని చంద్రబాబు వెల్లడించారు. 

ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని, 400 ఎంపీ సీట్లతో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్నారని నమ్మకం వెలిబుచ్చారు. నరేంద్ర మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? తాకడానికి ఎవరైనా వస్తే మసైపోతారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా ఉన్న బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అని కొనియాడారు. కిరణ్ కుమార్ అనుభవంతో పోల్చితే ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని పేర్కొన్నారు. పదవుల కోసం కాళ్ల దగ్గర కూర్చున్న బచ్చా అని విమర్శించారు. 

"నడమంత్రపు సిరి వచ్చింది, కొవ్వెక్కింది, ఆంబోతు మాదిరిగా తయారయ్యాడు... ఆంబోతును ఇలాగే వదిలేస్తారా ఎవరైనా? మా ఊరికి నీళ్లు రావడంలేదని ఏడు నెలల గర్భిణీ అడిగింది. అడిగితే పాపమా... నిన్ను అడగడానికి వీల్లేదా... నువ్వేమైనా దేవుడి బిడ్డవా? దీన్ని బట్టి నువ్వొక అరాచక శక్తివని నిరూపించుకున్నావ్. ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయిపై దాడి చేస్తే, మన జయచంద్రారెడ్డి మనుషులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులూ... తప్పుడు కేసులు పెడతారే మా మీద... ఓ గర్భిణీని కొట్టారే... సిగ్గనిపించడంలేదా? మీకేమాత్రం బాధనిపించలేదా? 

దేవుడు స్క్రిప్టు తిరగరాశాడు... ఈ నెల 13వ తేదీన ఓటింగ్... జూన్ 4వ తారీఖున కౌంటింగ్... గెలిచేది మనమే! చిత్తుచిత్తుగా ఓడిపోయేది వైసీపీ! వైసీపీ ఇంటికి... మన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు, జయచంద్రారెడ్డి పార్లమెంటుకు వెళతారు... అప్పుడు చూపిస్తా మన తడాఖా! 

సమైక్యాంధ్రప్రదేశ్ కు నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. హుందాతనంతో మెలగడం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దిరెడ్డీ! నేను కన్నెర్ర చేసుంటే ఈ అంగళ్లుకు వచ్చేవాడివా, పుంగనూరులో ఉండేవాడివా నువ్వు? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మాకు రోషం లేదనుకుంటున్నావా...? నీ కొమ్ములు విరిచేస్తా, నీ కొవ్వు తగ్గిస్తాం... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. 

ఈ రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వేమో పుంగనూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రివి కావాలి... నీ తమ్ముడు వలస పక్షి తంబళ్లపల్లెకు రావాలి... తంబళ్లపల్లె మీ తాత జాగీరా? నీ కొడుకు ఎంపీ కావాలి... ముగ్గురూ కలిసి దోచేయాలి... అడిగితే దాడులు చేస్తారా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Link to comment
Share on other sites

21 minutes ago, TOM_BHAYYA said:

Gorre kas(h)ayonne nammudhhi

 

ado Shem lo Sh aa

or Kashyam loni Sh aa

sSa_j@il

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...