Jump to content

June 4th— End of jaganasura — modi


psycopk

Recommended Posts

 

Narendra Modi: జూన్ 4వ తేదీతో వైసీపీ ప్రభుత్వానికి ఆఖరు: ప్రధాని మోదీ ట్వీట్ 

08-05-2024 Wed 22:14 | Andhra
  • విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
  • రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రధానిలో ఉత్సాహం
  • సందేహమే లేదు... ఏపీ ప్రజలు కూటమివైపేనంటూ ట్వీట్
  • వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వెల్లడి
  • కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా
 
PM Modi says YCP govt will be a thing of past from June 4

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారన్న విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతతో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

ఏపీ అధికార పక్షం వైసీపీ పైనా ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ల ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. 

ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు. 

ఏపీలో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చాలని, పారిశ్రామిక వృద్ధిని పెంచాలని, సేవల రంగంలోనూ ఏపీ తనదైన ముద్రను వేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రజలకు వరప్రసాదం అనదగ్గ ఉత్పాదకశక్తికి అవసరమైన ఉత్తేజాన్ని ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. 

ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పురోగతి కోసం తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటుందని, రాష్ట్రంలో పోర్టుల ఆధారిత అభివృద్ధి జరిగేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. అదే సమయంలో మత్స్య రంగానికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. తదుపరి తరం మౌలిక సదుపాయాల రంగానికి తమ ప్రాధాన్యత కొనసాగుతుందని, 

రహదారుల వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, విమానయాన అనుసంధానత అభివృద్ధికి తాము చేయాల్సింది చాలా ఉందని మోదీ తెలిపారు. అంతేకాకుండా, బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వివరించారు. 

 

Link to comment
Share on other sites

adi alage cheppali le 

taravata jagan gaadi thoka modi thatha daggarene undi so automatic ga 25 MPs in AP will support BJP

Link to comment
Share on other sites

 

Chandrababu: విజయవాడ రోడ్ షోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పందన 

08-05-2024 Wed 23:10 | Andhra
  • విజయవాడలో ప్రజాగళం రోడ్ షో సక్సెస్ కావడంతో కూటమిలో ఆనందం
  • ప్రధాని మోదీ సైతం సంతోషంగా ట్వీట్ చేసిన వైనం
  • ప్రధాని ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు
  • మరపురాని రోడ్ షో అంటూ వ్యాఖ్యలు
  • విలువైన సమయాన్ని కేటాయించారంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్
 
Chandrababu and Pawan Kalyan reacts on Vijayawada road show grand success

విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల కూటమి నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై ట్వీట్ చేశారు. 

తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమన స్పందన వెలిబుచ్చారు. ప్రధాని మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. 

ఇది నిజంగా మరపురాని రోడ్ షో అని పేర్కొన్నారు. విజయవాడ రోడ్ షో ఫొటోలను మోదీ ఎక్స్ లో పంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ... ఈ అద్భుతమైన గ్లింప్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింది అని చంద్రబాబు వివరించారు. 

పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. "ప్రధాని మోదీ గారూ... ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం" అంటూ పవన్ పేర్కొన్నారు. 

 

Link to comment
Share on other sites

24 minutes ago, Raisins_72 said:

:giggle:
 

@psycopk - Nenu appudey cheppina, meeru malli malli moyaali ani 😂😂 Vintega ! 

jagan ni tappa andarini mosaru tammullu. 

asalu PK ni pawala ani peru pettinde tammullu kada 

  • Upvote 1
Link to comment
Share on other sites

28 minutes ago, lollilolli2020 said:

jagan ni tappa andarini mosaru tammullu. 

asalu PK ni pawala ani peru pettinde tammullu kada 

antey cinemaalu veru politricks veru ani ala pk ki muddu peru pettaru

Link to comment
Share on other sites

3 minutes ago, Naaperushiva said:

antey cinemaalu veru politricks veru ani ala pk ki muddu peru pettaru

cover drive lu oddanna 

Link to comment
Share on other sites

45 minutes ago, lollilolli2020 said:

jagan ni tappa andarini mosaru tammullu. 

asalu PK ni pawala ani peru pettinde tammullu kada 

Jagan ni kuda mostharu, last time Nayakudu avasaram ayithe Jagan tho kuda kalustha ani statement ichaadu. Vaadiki antey Siggu Yeggu ledhu, mana Pulkas ki konchem ayina Self Respect vundaali kadha attaanti leader ni guddi ga nammuthunnaaru just bcoz of “Casette” ! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...