Jump to content

Chandrababu- ఎల్లుండి పోలింగ్... ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu- ఎల్లుండి పోలింగ్... ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు 

11-05-2024 Sat 19:24 | Andhra
  • మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • నేటి సాయంత్రంతో ముగిసిన ప్రచార పర్వం
 
Chandrababu open letter to AP people ahead of May 13 polling

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిబంధనల నేపథ్యంలో, నేటి సాయంత్రంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని నినదించారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. 

2014లో రాష్ట్రం విడిపోయిందని, అనేక కష్టనష్టాలతో నాడు టీడీపీ ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టిందని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి దిశగా నడిపించామని పేర్కొన్నారు. 2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని స్పష్టం చేశారు. 

కానీ మోసపూరిత హామీలతో జగన్ అధికారంలోకి వచ్చి, అధికారం చేపట్టినప్పటి నుంచే విధ్వంసక, అరాచక పాలనకు తెరదీశారని విమర్శించారు. వ్యవస్థలను చెరబట్టి, ప్రశ్నించే ప్రజలను, విపక్షాలను అణచివేశారని ఆరోపించారు. 

ఇప్పుడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే అవకాశం వచ్చిందని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని అరాచకాలకు ముగింపు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిక్షణ అనే అజెండాతో ముందుకువచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు నిండుమనసుతో ఓటేసి గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.
20240511fr663f77b9100f5.jpg

Link to comment
Share on other sites

Chandrababu: పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలి రావాలి: చంద్రబాబు పిలుపు 

11-05-2024 Sat 20:43 | Andhra
  • ఎల్లుండి మే 13న ఏపీలో పోలింగ్
  • రాష్ట్ర దశ, దిశను మార్చే పోలింగ్ అంటూ చంద్రబాబు ట్వీట్
  • ప్రజా చైతన్యం వెల్లివిరియాలన్న టీడీపీ అధినేత  
 
Chandrababu calls Andhra people in other states should come to vote

రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడిందని, మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవసరాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు... ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. 

"ప్రజా చైతన్యం వెల్లివిరియాలి... రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం. మీతో పాటు మరో నలుగురు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి. మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే. నిర్భయంగా, నిజాయతీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Chandrababu: తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు 

11-05-2024 Sat 21:48 | Andhra
  • నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • చిత్తూరులో చివరి ప్రజాగళం సభ నిర్వహించిన చంద్రబాబు
  • సభ అనంతరం తిరుమల పయనం
 
Chandrababu visits Tirumala this evening

ఏపీలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కాగా, ఈ ఎన్నికల్లో చివరి ప్రజాగళం సభను చంద్రబాబు చిత్తూరులో నిర్వహించారు. ఈ సభ ముగిసిన వెంటనే ఆయన తిరుమల వెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ వర్గాలు తీర్థ ప్రసాదాలు అందజేశాయి. 

చంద్రబాబు రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు చంద్రబాబు అభివాదం చేశారు. కాగా, చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్టు బయల్దేరారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...