Jump to content

AP cs jawahar reddy pedda luchaa la unnadu ga


psycopk

Recommended Posts

 

Varla Ramaiah: సీఎస్ జవహర్ రెడ్డి బరితెగించి భూబకాసురుడి అవతామెత్తారు: వర్ల రామయ్య 

25-05-2024 Sat 21:10 | Andhra
  • సీఎస్ జవహర్ రెడ్డిపై భూ అక్రమాల ఆరోపణలు
  • కుమారుడికి కట్టబెట్టేందుకే సీఎస్ జీవో నెం.596 విడుదల చేశారన్న వర్ల
  • ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడీ కూడా ఉందని వెల్లడి
  • జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి ఎయిర్ పోర్టుల్లో నిఘా పెట్టాలని విజ్ఞప్తి
 
Varla Ramaiah slams CS Jawahar Reddy

దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. విశాఖలో దళితుల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు మింగేయాలని ప్రయత్నించడం మహా ఘోరం అని వ్యాఖ్యానించారు. 

పేదవాడి భూమిని కొట్టేయడమే సీఎస్ జవహర్ రెడ్డి చట్టమా? సుమారు రూ.4 వేల కోట్ల విలువగల 800 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడికి అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో నెం.596 విడుదల చేయడం ఘోరాతి ఘోరం అని పేర్కొన్నారు. 

"రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలబడాల్సిన సీఎస్సే బరితెగించి భూబకాసురుని వేషం వేస్తే రాష్ట్రంలో న్యాయం చేసేదెవరు? అన్యాయం జరుగుతుందయ్యా... మాకు న్యాయం చెయ్యండి అని ఎవరినైతే వేడుకుంటామో అతనే అన్యాయాలు చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. 

పేదవారు, ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయండని సీఎస్ జవహర్ రెడ్డిని మేము వేడుకున్నా... చస్తే చావనివ్వండి అన్నట్లు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. పేద ప్రజల ఉసురు పోసుకోవడం వలనే సీఎస్ జవహర్ రెడ్డి భూభాగోతం బయటపడింది. 

ఉత్తరాంధ్రలో దాదాపు 60 శాతం భూములను కడప వాళ్లే కొట్టేశారు. కడప వాళ్లకి ఇక్కడ పనేంటని మంత్రి ధర్మాన కూడా అన్నారు. పేద దళితుల (మాల, మాదిగలు) జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను మదించిన ఏనుగుల్లాంటి ఇటువంటి అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కొట్టేయడం దుర్మార్గం, పాపం కూడా. 

దళితుల భూములు కొనకూడదు, ఆక్రమించకూడదు అని చట్టాలున్నా ఎంతోమంది అధికారులు, బరితెగించిన రాజకీయ పెద్దలు, డబ్బు మదంతో కొట్టుమిట్టాడుతున్న వారు దళితుల భూములను, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొద్దో గొప్పో ధనాన్ని వాళ్ల ముఖాన కొట్టి... కోట్లు విలువు చేసే అసైన్డ్ భూములను దోచేశారు. 

రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే, దళితుల భూములను చేజిక్కించుకుని, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి, వారు కుమారుల్లాంటి ఘరానా పెద్దలను వదలకుండా శిక్షించడం ఖాయం. వారి వద్ద నుండి అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్ భూములను కొట్టేసిన భూబకాసురులపై ఒక కమిషన్ వేయాలని కూడా మా అధినేతను కోరుతాం. 

సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కట్టడి చేయాలి. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలి. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలి. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. 

ఈ భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి, ఈ కేసులో పూర్తి నిజానిజాలు బయటకు తీయాలి. దీనిలోని భూ కబ్జాదారులపై, భూ దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలి. జవహర్ రెడ్డి పదవీవిరమణ చేయకముందే విచారణ పూర్తి చేయాలి. ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాలి. 

గత ఐదేళ్లుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన భూ క్రయ విక్రయాలపై కూడా మరో కమిషన్ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతాం" అంటూ వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

 

Link to comment
Share on other sites

Ayy jagan…why are doing this silly things… mana visionary dog laga allocate lands to load ethhali ramana supremely court judge 

  • Haha 2
Link to comment
Share on other sites

Somireddy Chandra Mohan Reddy: ‘చీఫ్’ కాదు చీప్ సెక్రటరీ.. ఏపీ సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్ 

26-05-2024 Sun 11:58 | Andhra
  • ఇప్పటి వరకూ ఏ సీఎస్ కూడా ఇంతలా దిగజారలేదంటూ ట్వీట్
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఎలా అంగీకరిస్తారంటూ మండిపడ్డ టీడీపీ నేత
  • రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చారంటూ తీవ్ర విమర్శలు
 
TDP Leader Somireddy Chandramohan Reddy Tweet on AP CS Jawahar Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వ కార్యదర్శి కూడా ఇంతలా దిగజారలేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.

జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ అని విమర్శించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని, కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించారని మండిపడ్డారు. జగన్‌కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేశారని, జగన్ దోచుకున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్ గా మారిపోయారని జవహర్ రెడ్డిపై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఒక సీఎస్‌గా ఎలా అంగీకరించారంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ రైతూ అడగకున్నా రీసర్వేను వారిపై ఎలా రుద్దుతారు, వారసత్వంగా వచ్చిన పొలాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారని నిలదీశారు. పోలింగ్ సందర్భంగా రాజకీయ హింస చోటుచేసుకుంటే అదుపు చేయడంపైన దృష్టి పెట్టకుండా కన్ఫర్డ్ ఐఏఎస్ ల ఫైల్ గురించి ఆలోచించడమేంటని సోమిరెడ్డి మండిపడ్డారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...