Jump to content

అవినీతి సొమ్ములో కొంత కక్కించారు!


ntr2ntr

Recommended Posts

వైసీపీ ప్రభుత్వ అండతో పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డ పల్నాడు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(పూడా) వైస్‌చైర్మన్‌ శ్రీనివాసరెడ్డిపై రియల్టర్లు తిరగబడ్డారు.

 

అవినీతి సొమ్ములో కొంత కక్కించారు!
 

 

 

 

‘పూడా’ వైస్‌ చైర్మన్‌ అవినీతిపై రియల్టర్ల తిరుగుబాటు

వైసీపీ అండ చూసుకొని రెచ్చిపోయారని కార్యాలయం వద్ద ధర్నా

బెదిరించి వసూలు చేసిన రూ.7 కోట్లు కక్కాలని డిమాండ్‌

అప్పటికప్పుడు రూ.50 లక్షలు చెల్లించిన శ్రీనివాసరెడ్డి

అవినీతి సొమ్ములో 

వైసీపీ ప్రభుత్వ అండతో పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డ పల్నాడు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(పూడా) వైస్‌చైర్మన్‌ శ్రీనివాసరెడ్డిపై రియల్టర్లు తిరగబడ్డారు. ఇంతకాలం నోరుమెదపకుండా ఆయన అడిగినట్లు.. చెప్పినట్లు చేసిన రియల్‌ వ్యాపారులు.. తమ నుంచి వసూలు చేసిన మొత్తాలను కక్కాలంటూ నరసరావుపేటలోని పూడా కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని వైస్‌ చైర్మన్‌ గజ్జల శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో గజ్జల కంగుతిన్నారు. అప్పటికప్పుడు రూ.50లక్షల రూపాయలను తిరిగిచ్చేశారు. నరసరావుపేట కేంద్రంగా పూడాను గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి వైస్‌ చైర్మన్‌గా గతంలో జడ్పీ సీఈవోగా పనిచేసిన గజ్జల శ్రీనివాసరెడ్డిని నియమించింది. అయితే నిబంధనలు, ప్లాన్ల మాటున ఆయన అక్రమ వసూళ్లకు తెరలేపారని బాధితులు ఆరోపించారు. జిల్లాలో అనధికార లేవుట్లను 258 వరకు గుర్తించి నోటీసులు జారీ చేశారు. వెంచర్ల క్రమబద్ధీకరణకు సంబంధం లేకుండా ఒక్కొక్క వెంచర్‌ నుంచి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం తమ నుంచి రూ.3.72 కోట్లు వసూలు చేశారన్నారు. అలాగే డీవియేషన్‌ ఉన్న భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లను గుర్తించి రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలా రూ.3 కోట్లకు పైగా వసూలు చేశారని చెబుతున్నారు. పలువురు కాంట్రాక్టర్లు కూడా పూడా కార్యాలయానికి వచ్చి తమను తీవ్రంగా నష్టపరిచారంటూ వైస్‌ చైర్మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసినా జీరో ఖాతా కింద చూపించారని, ఆయన కారణంగా తాము అప్పుల పాలై ఆస్తులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళనతో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

రూ.50 లక్షలు తిరిగిచ్చేసిన వైస్‌ చైర్మన్‌

కార్యాలయం వద్ద ఆందోళనతో కంగుతిన్న అవినీతి తిమింగలం దిగిరాక తప్పలేదు. వసూలు చేసిన అవినీతి సొమ్ములో రూ.50 లక్షలు కక్కించారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్ములో శ్రీనివాసరెడ్డి కొంత తిరిగి ఇచ్చారని బాధితులు తెలిపారు. 3 గంటల వ్యవధిలోనే రూ.50 లక్షలు చెల్లించడం గమనార్హం. తమ ఆందోళనతో చేసిన తప్పును ఆయన అంగీకరించినట్లు బాధితులు తెలిపారు. ఒక్క రొంపిచర్ల మండలంలోనే ఈ అధికారి చేసిన ఆర్థిక అరాచకం వల్ల రూ.15 కోట్ల బిల్లులు రాలేదని బాధితులు చెప్పారు. ఓ కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్ల బిల్లులు ఇవ్వకుండా పనులు జరగలేదని తప్పుడు సర్టిఫికేట్‌ ఇచ్చారన్నారు. దాచిన ఎం.బుక్‌లను కాంట్రాక్టర్ల వారీగా తిరిగి ఆ శాఖ అధికారులకు అప్పగించేందుకు పోలీసుల సమక్షంలో ఒప్పందం జరిగిందన్నారు. రెండు రోజుల్లో ఎం.బుక్‌లు తిరిగి ఇవ్వకపోతే మళ్లీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Ila prajalu andaru adikarula inti mundu dharna chesi, Avineeti dabbulni vaapus teesukunne roju ravali ani aa god ni praying 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...