Jump to content

Chandrababu కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక


psycopk

Recommended Posts

Chandrababu కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక 

11-06-2024 Tue 11:30 | Andhra
Chandrababu unanimously elected as the leader of the alliance legislative party
 
  • సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్‌ కల్యాణ్‌
  • ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్న కూటమి నేతలు 
  • బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరింగింది. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్‌ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్‌ ఆహ్వానం పలకనున్నారు. కాగా, బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక తనను ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు.

Link to comment
Share on other sites

Chandrababu Naidu: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు: చంద్రబాబు 

11-06-2024 Tue 12:13 | Andhra
TDP Chief Chandrababu Naidu Speech
 
  • ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న టీడీపీ అధినేత
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపించారని ప్రశంస 
  • పవన్‌ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనన్న చంద్రబాబు

ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు.

ఇక పవన్‌ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలసి పనిచేశామన్నారు. దాంతో ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం అన్నారు. అటు బీజేపీ పోటీచేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది సత్తాచాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Link to comment
Share on other sites

 

Chandrababu Naidu: తప్పు చేసినవారిని వదిలిపెట్టబోను.. చంద్రబాబు వార్నింగ్ 

11-06-2024 Tue 12:56 | Andhra
TDP Chief Chandrababu Naidu Warning
 
  • తప్పు చేసినవాడిని క్షమించి వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందన్న చంద్రబాబు  
  • తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య 
  • విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు

తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. "తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను బుధవారం నాలుగోసారి ప్రమాణం చేయబోతున్నానని.. రేపటి ప్రమాణానికి ఉన్న ప్రాధాన్యత వేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనపై బాధ్యత పెరిగిందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ వచ్చి పరామర్శించడమే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని బాబు గుర్తు చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కలిసొచ్చిందన్నారు. 

ఇక పవన్‌, తాను కలిసి జిల్లా పర్యటన చేశామన్నారు. అటు బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారని, విజయవాడలో కూటమి రోడ్ షోను మోదీ అభినందించారని గుర్తుచేశారు. తాను ఎప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానని పేర్కొన్నారు. తనకు ప్రజాహితమే తెలుసన్నారు. 

 

Link to comment
Share on other sites

Amaravati: అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు 

11-06-2024 Tue 13:13 | Andhra
Andrapradesh Capital Amaravathi Says Chandrababu
 
  • విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్న చంద్రబాబు 
  • సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదని వ్యాఖ్య
  • కేంద్రం సహకారంతో పోలవరం పూర్తిచేస్తామని వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తామందిరిపైనా ఉందన్నారు.

గత పాలనలోనే పోలవరం దాదాపుగా పూర్తి..
సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం శిథిలమైంది..
గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. ‘సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్ తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం’ అని చెప్పారు.

ప్రతి అడుగూ ప్రజాహితమే..
సీఎం పర్యటనల సందర్భంగా షాపులు, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయడం జరగదన్నారు. ‘ఐదు నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దు’ అని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని, ప్రతీ నిర్ణయం, ప్రతీ అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Andhra Pradesh: ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి: గవర్నర్ ను కోరిన కూటమి నేతలు 

11-06-2024 Tue 13:31 | Andhra
ap nda leaders meet governor request to invite them to form govt
 
  • ఏపీ గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు  
  • కూటమి తరఫున చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడి
  • గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లేఖ సమర్పణ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశం అయ్యారు.

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం రాజ్ భవన్ వెలుపల అచ్చెన్నాయుడు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారన్నారు.

Link to comment
Share on other sites

Purandeswari: అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదు: పురందేశ్వరి 

11-06-2024 Tue 12:04 | Andhra
BJP AP Chief Purandheswari Speech At NDA Meet
 
  • ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారన్న పురందేశ్వరి  
  • గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని వ్యాఖ్య 
  • కూటమికి అనూహ్య విజయం కట్టబెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి చెప్పారు. అయితే, ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈమేరకు మంగళవారం జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు.

ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు.. కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురందేశ్వరి చెప్పారు. ‘చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కల్యాణ్ శక్తి.. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చింది’ అని చెప్పారు. ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురందేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఐదేళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించకుండా మన కార్యకర్తలను శాంతింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. పురందేశ్వరి బలపరిచారు.

Link to comment
Share on other sites

Pawan Kalyan: అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలి: పవన్ కల్యాణ్ 

11-06-2024 Tue 11:39 | Andhra
need to develop ap unifiedly says pawan kalyan
 
  • రాష్ట్ర ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారన్న పవన్ 
  • 5 కోట్ల మంది ప్రజలు మన పాలనపై ఆశలు పెట్టుకున్నారని వివరణ 
  • కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య 

రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకుగాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు.

మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తుచేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు.

Link to comment
Share on other sites

Janasena: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ 

11-06-2024 Tue 10:47 | Andhra
pavan kalyan elected as janasena legislature party leader
 
  • ప్రతిపాదించిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్
  • ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్యేలు
  • మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశం

జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.

ఈ భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వారితో చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారని పురందేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...