ntr2ntr Posted June 16, 2024 Report Share Posted June 16, 2024 AP News: ఆంక్షలను ఎత్తేసిన చంద్రబాబు సర్కార్.. ఇకపై ఆ రోడ్డులో సామాన్యులూ వెళ్లొచ్చు.. మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న విశాలమైన రోడ్‌పై ఆంక్షలను ఎత్తేశారు. ఆ రోడ్డుపై వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇస్తూ చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకుంది.. అమరావతి: మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న విశాలమైన రోడ్‌పై ఆంక్షలను ఎత్తేశారు. ఆ రోడ్డుపై వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇస్తూ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ప్రజలకు విశాలమైన రహదారి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో రోడ్లు గుంతలమయమైనా పట్టించుకోని జగన్ (Former CM Jagan).. తన ఇంటి ముందు మాత్రం జిగేల్ మనేలా రోడ్డు వేయించుకున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం తాడేపల్లిలో అప్పటివరకు లాండ్ మార్క్‌గా వున్న భారత మాత విగ్రహాన్ని సైతం జగన్ సర్కార్ తొలగించింది. విగ్రహం తొలగింపుపై అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. అలాగే ఈ రోడ్డు నిర్మాణం కోసం అప్పట్లో కరకట్ట వెంబడి ఉన్న వందలాది పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులోనూ పక్షపాతం వహించనట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. వలంటీర్‌గా పని చేస్తున్న శివ శ్రీ అనే మహిళ.. తన ఇల్లు కూల్చొద్దంటూ తిరుగుబాటు చేసింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను (Janasena president Pawan Kalyan) తన సమస్యను విన్నవించుకుంది. దీంతో ఆమెపై జగన్ సర్కార్ కక్షకట్టి, వలంటీర్ విధుల నుంచి తొలగించింది. దీనికితోడు రాత్రికి రాత్రే ఆమె ఇంటిని జేసీబీలతో కూల్చేఇశారు. ఇలా వందలాది మంది పేదల ఇళ్లను తొలగించి కోట్లు ఖర్చుపెట్టి రోడ్డు నిర్మించుకున్న జగన్.. దానికి ఇరువైపులా లాండ్ స్కేపింగ్, డిజైనర్ లైటింగ్ ఏర్పాటు చేయించుకున్నారు. ఇన్నాళ్లూ భద్రత పేరుతో మూసిన రోడ్డును.. చంద్రబాబు నాయుడు సీఎం అవగానే తెరవడంతో తాడేపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Tuqlaq 2 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted June 16, 2024 Author Report Share Posted June 16, 2024 Quote Link to comment Share on other sites More sharing options...
ramannar Posted June 16, 2024 Report Share Posted June 16, 2024 38 minutes ago, ntr2ntr said: Vadiki kadupu ubbipoi malabadhakam vaste who is responsible? Quote Link to comment Share on other sites More sharing options...
Boom1 Posted June 16, 2024 Report Share Posted June 16, 2024 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.