Jump to content

బాపట్ల జిల్లాలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటనలో నిందితుల అరెస్ట్👍👍


southyx

Recommended Posts

అభినందనలు Anitha Vangalapudi... బాగా వర్క్ చేశారు👍🤝
పోలీసులకు అభినందనలు👍👏
బాపట్ల జిల్లాలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటనలో నిందితుల అరెస్ట్👍👍
Cr.No: 169/2024 U/s 302,376-D, 379, 212 IPC of Chirala Rural Police Station, Bapatla District.
కేసు నమోదు చేసిన 48 గం.ల లోపు ముద్దాయిలని అరెస్ట్ చేసిన చీరాల రూరల్ సిఐ గారు.
కేసు వివరాలను వెల్లడించిన బాపట్ల ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు
ముద్దాయి వివరాలు:
1.దేవరకొండ విజయ్ s/o బాబు 26 సం,, ఎరుకుల, చుక్కయపేట ఒకటో వార్డు, ఈపురుపాలెం, చీరాల మండలం.
2. కారంకి మహేష్ s /o లీలా వరప్రసాద్, 22 సం,, గౌడ, పోతురాజుసీల, ఈపురుపాలెం, చీరాల.
౩. .దేవరకొండ శ్రీకాంత్ s/o శ్రీను, 24 సం,, ఎరుకుల, చుక్కయపాలెం ఒకటవ వార్డ్, ఈపురుపాలెం, చీరాల మండలం.
ముద్దాయిల అరెస్ట్ సమయం ప్రదేశం :: 22.06.2024 సాయంత్రం 07.00 గంటలకు హాయ్ రెస్టారెంట్ దాటినా తరువాత ఓడరేవు పోవు రోడ్డులో సుమారు 50 మీటర్ల దూరంలో.
జూన్ 21న శుక్రవారం ఉదయం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈపురుపాలెం గ్రామంలోని సీతారాం పేట వద్ద జరిగిన యువతిపై లైంగిక దాడి ఆపై హత్య కేసును సవాలుగా తీసుకొని 48 గం.ల లోపు జిల్లా పోలీస్ అధికారులు ఛేదించారు. జూన్ 22న శనివారం సాయంత్రం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు కేసు వివరాలను వెల్లడించారు.
కేసు వివరాలు: హతురాలు ఇంటర్ వరకు చదవుకొని, ఇంటి వద్ద కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన కుటుంభం ను పోషిస్తూ ఉన్నట్లు, తేదీ 21.06.2024 ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో హతురాలు తన ఇంటికి దగ్గరలో ఉన్న రైలు పట్టాల సమీపానికి బహిర్భూమికి వెళ్ళినట్లు, ఐతే ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె కోసము వెతకగా, నేర స్థలం లో హతురాలు చనిపోయి, శరీరంపై బట్టలు లేకుండా, రక్తం ముక్కుల నుండి, మానం నుండి కారుతూ ఉండటంతో ఎవరో గుర్తు తెలియని వారు హతురాలిని మానభంగం చేసి, చంపి ఉంటారు అని హతురాలి తల్లి పంజుల కామాక్షి ఇచ్చిన రిపోర్ట్ మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr.No: 169/2024 U/s 302,376 IPC గా కేసు నమోదు చేసినారు.
నేరం జరిగిన తీరు:
మత్తుకు బానిసలైన నిందితులు జూన్ 21 ఉదయం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఇద్దరు నిందితులు బలవంతంగా చెట్లపొదలలోకి తీసుకు వెళ్ళి ,నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడిచేసి నోరు ముక్కు మూసి హత్య చేసినారు. వారికీ మరొక అతను సహకరించి నాడు.
ముద్దాయిల నేర చరిత్ర:
A-1 ముద్దాయి అయిన దేవరకొండ విజయ్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయి ఉన్నవి. అందులో ఒకటి మర్డర్ కేసు. ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ నెంబర్ 63 ఉన్నది. A-3 ముద్దాయి అయిన దేవరకొండ శ్రీకాంత్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయి ఉన్నవి. అందులో ఒకటి మర్డర్ కేసు, ఒక Attempt to murder కేసు. ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ నెంబర్ 45 ఉన్నది. వీరిద్దరికీ A-2 ముద్దాయి కారంకి మహేష్ సహాయకారిగా ఉన్నాడు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచార ఆపై హత్య ఘటనను, ఆంధ్ర ప్రదేశ్ DGP గారు, సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ IGP గారు సవాలుగా తీసుకొని ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు, పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్త్నట్లు, ఒక్కొక్క బృందం CI, SI మరియు సిబ్బంది ఉండి , వివిధ కోణములలో వేగవంతంగా దర్యాప్తు చేసి 48 గంటలలోపు, నేరానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. FSL టీం, clues team లు నేరస్తలం నకు పిలిపించి, నేర స్తలం లో ఉన్న అన్ని రకముల సాక్షాధారములు సేకరించినారు. అదే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని నేరస్తలం నకు పంపినారు. హోం మంత్రి గారు ప్రభుత్వం తరుపున హతురాలి కుటుంభం కు 10 లక్షల రూపాయల exgratia అందచేసారు. వీరు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలై ఉద్దేశపరకంగా యువతిపై అత్యాచారం చేసి హతమార్చడం జరిగిందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడం చేయడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల DSP బేతపూడి ప్రసాద్ గారి పర్యవేక్షణలో యువతి పై జరిగిన అత్యాచార మరియు హత్య కేసును దర్యాప్తు సాగించిన చీరాల రూరల్ CI నిమ్మగడ్డ సత్యనారాయణ గారు యువతి తల్లి తండ్రులు, ఇతర సాక్షులు చెప్పిన సమాచారం ఆధారంగా, నేరస్థలాన్ని పరిశీలించి భౌతిక సాక్షాదారాలను పరిగణలోకి తీసుకొని ముద్దాయి దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ లు నేరం చేసినట్లు నిర్ధారించుకొని జూన్ 22 శనివారం 2024 సాయంత్రం 07.00 గంటలకు ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది
కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్షాదారాలను, నిపుణుల నివేదికను త్వరితగతిన పొంది ఒకదానికొకటి క్రోడీకరించుకుని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై అభియోగ పత్రం దాఖలు చేసి, న్యాయస్థానంలో ముద్దాయికి కఠినమైన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని SP గారు తెలిపారు. మహిళల పై నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
448911353_433887352852869_67350623105120
 
Link to comment
Share on other sites

How is A1 Vijay devarakonda still roaming freely despite having prior murder case on them ?

Link to comment
Share on other sites

Ye chetta yadava kaka ee news ni edit chesindi motham thappule..... Chadavaleka chacha... any way hope these guys are real culprits... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...