Jump to content

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు... అమిత్ షాతో భేటీ


psycopk

Recommended Posts

Chandrababu నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు... అమిత్ షాతో భేటీ 

16-07-2024 Tue 07:19 | Andhra
Chandrababu to go Delhi today
 

 

  • 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి చంద్రబాబు
  • సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న ఏపీ సీఎం
  • అమిత్ షాతో భేటీలో విభజన సమస్యలపై చర్చించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. 

ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈరోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశముంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ 

15-07-2024 Mon 20:52 | Andhra
JSW Group CMD Sajjan Jindal met AP CM Chandrababu
 

 

  • చంద్రబాబుతో సమావేశం అద్భుతంగా జరిగిందన్న సజ్జన్ జిందాల్
  • ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ చంద్రబాబు రిప్లై
ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ ఉదయం చంద్రబాబుతో అద్భుతమైన సమావేశం జరిగిందని సజ్జన్ జిందాల్ వెల్లడించారు.

ఏపీ శక్తిసామర్థ్యాలను లోకానికి చూపించేందుకు, ఏపీ ప్రజలకు అవకాశాలు సృష్టించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీ ఒక డైనమిక్ రాష్ట్రం అని, కలిసి పనిచేసేందుకు, రాష్ట్ర పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని సజ్జన్ జిందాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు."మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషదాయకం సజ్జన్ జిందాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఏపీ ప్రజలకు సరికొత్త అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడానికి మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 
20240715fr66953e8952bc2.jpg20240715fr66953e9446185.jpg
Link to comment
Share on other sites

 

Chandrababu: బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతాన్ని కూడా వదల్లేదు: సీఎం చంద్రబాబు 

15-07-2024 Mon 17:19 | Andhra
CM Chandrababu releases white paper on natural resources
 

 

  • సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడి
  • మైనింగ్, క్వారీ లీజుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
  • ఇసుక విధానంలో తప్పుడు పద్ధతులు అవలంబించారని విమర్శలు
  • మడ అడవులను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడించారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. కర్నూలు జిల్లాలో రవ్వలకొండ ఉంది... బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం... దాన్ని కూడా కొట్టేశారు... ఒక చారిత్రక ప్రదేశం... దీని జోలికి వెళ్లకూడదు అనే విచక్షణ కూడా లేకుండా దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 

ఇసుక అంశంలో తప్పుడు విధానం తెచ్చి, ఇష్టానుసారం దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఖనిజాల తవ్వకాల్లోనూ ప్రభుత్వానికి రూ.1000 కోట్లకు పైగా నష్టం జరిగిందని అన్నారు. 

అదే సమయంలో ప్రత్యర్థులు మైనింగ్ ను ఆపివేయించడం, జరిమానాలు వేయించడం వంటి చర్యలకు పాల్పడ్డారని, అటవీభూముల్లో లీజు లేకుండానే మైనింగ్ కు చేశారని ఆరోపించారు. గనుల కేటాయింపులో మొదట వచ్చిన వారికి మొదట నిబంధనలకు తూట్లు పొడిచారని, పర్యావరణ నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేపట్టారని విమర్శించారు. ఓ పద్దతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి, పర్యావరణానికి హాని కలిగించడంపై సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని తెలిపారు. 

అడవులను కూడా వీరి దోపిడీకి వేదికలుగా చేసుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీభూముల్లో ఖనిజాల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ, ఇళ్ల  నిర్మాణం కోసం మడ అడవుల ధ్వంసం వంటి అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో  జరిగాయని చంద్రబాబు వివరించారు.

"ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకువచ్చారు. ఇసుక తవ్వకాల్లో అక్రమంగా భారీ యంత్రాలను ఉపయోగించారు. ఇసుక తవ్వకాల కోసం నదులు, కాలువల మీద కూడా రోడ్లు వేసే పరిస్థితికి వచ్చారు. అధికారులను డిప్యుటేషన్ పై తెచ్చుకుని మరీ అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. 

కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీగా ఇసుక దందాలు నడిచాయి. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 

సాధారణంగా అటవీ శాఖను, గనుల శాఖను ఒకే వ్యక్తి ఇవ్వరు... కానీ వైసీపీ హయాంలో ఈ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు... ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్ స్పెక్షన్ల పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో సైతం అక్రమ మైనింగ్ జరిగిందంటే వీళ్ళు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. 

ఎర్రచందనాన్ని వీళ్లే స్మగ్లింగ్ చేసుకుని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకెళ్లేవారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. స్మగర్లను ఎంకరేజ్ చేయడం అనేది డేంజరస్ ట్రెండ్. ఇక, పుంగనూరు, కార్వేటినగరం ప్రాంతాల్లో 6.725 ఎకరాల అటవీభూముల్లో మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు. పల్నాడు ఏరియాలో ఇష్టానుసారం అడవుల నరికివేతకు పాల్పడ్డారు. ఇలాంటివి ఒకట్రెండు కాదు చాలా ఉన్నాయి. 

అదే సమయంలో కాకినాడ జిల్లాలో  58 ఎకరాల మేర మడ అడవులను ధ్వంసం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తే ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా కూడా వేసింది" అని చంద్రబాబు వివరించారు. 

 

 

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

Jaggadi arrest kosame na ? Bharati ni nomination eyamantava ?

Jaggadni arrest chesi mundu Vijay Sai Reddy ni BJP lo join cheskuntaaru...Vaditho patu 11 MPs will follow ani talk.

Link to comment
Share on other sites

Just now, 11_MohanReddy said:

Jaggadni arrest chesi mundu Vijay Sai Reddy ni BJP lo join cheskuntaaru...Vaditho patu 11 MPs will follow ani talk.

Chas…adi dhebba ante..!!! Atu Rajya Sabha MP’s…itu state …mothaniki jagadi chapter close..!!

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Chas…adi dhebba ante..!!! Atu Rajya Sabha MP’s…itu state …mothaniki jagadi chapter close..!!

Anduke Jaggad Vijay Sai Reddy ranku story expose chesaadu...he is not stupid. 

Link to comment
Share on other sites

3 minutes ago, 11_MohanReddy said:

Anduke Jaggad Vijay Sai Reddy ranku story expose chesaadu...he is not stupid. 

Ante aata lo aratipandu mana sendranna ae na ?

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Ante aata lo aratipandu mana sendranna ae na ?

Sendranna ki Jaggad chesina tappulu presentation lo chupinche dhyaasa vaadni jail ki pampinchadamlo ledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...