Jump to content

ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనమేం చేయాలనేదే ముఖ్యం: టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు


psycopk

Recommended Posts

TDP Parilamentary Meeting: ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనమేం చేయాలనేదే ముఖ్యం: టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు 

20-07-2024 Sat 18:01 | Andhra
TDP Parliamentary meeting led by CM Chandrababu concluded
 

 

  • జులై 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం 
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు. 

కేంద్రంతో సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించామని, ఆ దిశగా ఎంపీలు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలు రాష్ట్రమంత్రులను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని చంద్రబాబు సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపైనా నేటి సమావేశంలో చర్చించారు. 

కాగా, ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు
Link to comment
Share on other sites

Kinjarapu Ram Mohan Naidu: ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

20-07-2024 Sat 19:43 | Andhra
Union minister Ram Mohan Naidu said today meeting held in a new style
 

 

  • ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు
  • టీడీపీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు
  • ఎంపీలందరికీ రాష్ట్రంలో, కేంద్రంలో ఒక్కో మంత్రిత్వ శాఖను కేటాయించారన్న రామ్మోహన్
  • ఎంపీలు రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధుల్లా పనిచేస్తారని వెల్లడి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బలంగా సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఒక కొత్త పద్ధతిలో నేటి సమావేశం జరిగిందని వెల్లడించారు. అందుకే, ఎప్పుడూ లేని విధంగా, ఎంపీల సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా చంద్రబాబు ఆహ్వానించారని తెలిపారు. 

"కొత్త పద్ధతి ఏంటంటే... ఎంపీలందరికీ ఒక్కొక్కరికి రాష్ట్రంలోని ఒక మంత్రిత్వ శాఖను, కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖను కేటాయించారు. తద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధులుగా పనిచేసే ఒక అదనపు బాధ్యతను ఎంపీలకు అప్పగించారు. ఆ బాధ్యతను మేం సక్రమంగా నిర్వర్తిస్తాం. 

అయితే, ఏపీని అప్పుల ఊబి నుంచి, కష్టాల నుంచి బయటికి తీసుకురావాలంటే కేంద్రం తాలూకు సహకారం తప్పనిసరి. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, కేంద్రం పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ ఎంపీలందరం దృష్టి సారిస్తాం. 

ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ప్రశ్నే లేదు. ఆ మేరకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతాం. విజయనగరం జిల్లాలో ఉన్న మెగ్నీషియం గనులను రాష్ట్రానికి కేటాయించాలి, వాటి లీజులను పునరుద్ధరించాలి అని మేం ప్రస్తావించాం... వాటి లైసెన్స్ లను పునరుద్ధరించాలి అని సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మేం ఎంత పట్టుదలతో పనిచేస్తున్నామో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. 

విశాఖ రైల్వే జోన్ గురించి పదేళ్లుగా నేను చాలా శ్రమించాను. భూమికి సంబంధించిన సమస్యతో దానికి అవాంతరం ఏర్పడింది. దానిపై విశాఖ జిల్లా కలెక్టర్ తో మాట్లాడాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్ కూడా దీనిపై అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్ కు కావాల్సిన భూమి విషయంలో చర్యలు వేగవంతం చేసి, త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తాం" అని రామ్మోహన్ నాయుడు వివరించారు.
Link to comment
Share on other sites

Pemmasani Chandra Sekhar: అతను రోడ్డు మీదికి వస్తే రాష్ట్రాభివృద్ధి వెనక్కి వెళుతుంది: కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని 

20-07-2024 Sat 18:34 | Andhra
Pemmasani comments on Jagan
 

 

  • దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపడతామన్న జగన్
  • జగన్ వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందన్న పెమ్మసాని
  • నాడు చంద్రయ్యను చంపేస్తే జగన్ ఎందుకు మాచర్ల వెళ్లలేదన్న పెమ్మసాని
  • ఇప్పుడు ఢిల్లీలో నిరసన తెలిపే అర్హత జగన్ కు లేదని స్పష్టీకరణ
ఏపీలో గత 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపడతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంపై కేంద్ర రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. జగన్ వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. అతను రోడ్డు మీదికి వస్తే రాష్ట్రాభివృద్ధి అంత వెనక్కి వెళ్లిపోతుందని స్పష్టం చేశారు. 

"జగన్ కు నిరసన తెలిపే అర్హత ఎక్కడుంది? మాచర్లలో చంద్రయ్యను అతి కిరాతకంగా చంపారు. అదీ... రాజకీయ హత్య అంటే! ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేయాలని చూస్తున్నారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య ఎలా అవుతుంది? మాచర్లలో జరిగింది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వు ఏం చేశావ్? బయటికి వచ్చావా? మాచర్ల వెళ్లావా? 

రాష్ట్రాన్ని అత్యంత అవినీతిమయంగా, ఘోరంగా, అభివృద్ధి లేకుండా చేశారు. నీకేం అర్హత ఉందని ఢిల్లీ వెళతావు? ఢిల్లీలో ఎక్కడికి వెళ్లినా ఏపీ గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్ గురించి ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఢిల్లీలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆయన ఖ్యాతి పాకిపోయింది!" అంటూ పెమ్మసాని విమర్శనాస్త్రాలు సంధించారు.
Link to comment
Share on other sites

Ante delhi lo jaffanna aratipandu tokkatho samanam ani ee meeting lo CBN declare chesara..oh my jagga.. aratipandu tokka jagganna Darna delhi lo bokka..

Link to comment
Share on other sites

CBN does have some unique ideas. It will be interesting to know which MP was assigned which ministry. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...