psycopk Posted July 22 Report Share Posted July 22 Raghu Rama Krishna Raju: జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడిన రఘురాజు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే! 22-07-2024 Mon 12:20 | Andhra హాయ్ జగన్ అని పలుకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన రఘురాజు ప్రతి రోజు అసెంబ్లీకి రావాలన్న ఉండి ఎమ్మెల్యే జగన్ పక్కన సీటు కేటాయించాలని కేశవ్ ను కోరిన రఘురాజు జగన్ పక్కన కూర్చుంటే మజా ఉంటుందని వ్యాఖ్య జగన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమన్న రఘురాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో ముచ్చటించారు. జగన్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే సమయానికి... అప్పటికే అక్కడ ఉన్న రఘురాజు... 'హాయ్ జగన్' అని పలుకరించారు. జగన్ ముందుకు కదిలిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి, ఆయన వరుసలో కూర్చున్నారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందనగా... లేచి వెళ్లి జగన్ పక్కన రఘురాజు కూర్చున్నారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ... రోజూ అసెంబ్లీకి వస్తాను, మీరే చూస్తారని అన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు రఘురాజును అసెంబ్లీ లాబీలోకి పిలిపించారు. జగన్ తో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. అసెంబ్లీకి ప్రతి రోజు రావాలని జగన్ కు చెప్పానని రఘురాజు మీడియాకు వివరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడుతూ... అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరారు. దీనికి సమాధానంగా అలాగేనని కేశవ్ నవ్వుతూ చెపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జగన్ పక్క సీటును మీరు ఎందుకు కోరుకుంటున్నారని రఘురాజును మీడియా ప్రశ్నించగా... మజా ఉంటుందని, మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. జగన్ ను రోజూ ర్యాగింగ్ చేస్తారా? అని పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే ప్రశ్నించగా... ర్యాగింగ్ చేస్తానో, మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని అన్నారు. జగన్ కు షేక్ హ్యాండ్ ఎందుకిచ్చారని మీడియా ప్రశ్నించగా... అది తన ధర్మం అని చెప్పారు. మీ షేక్ హ్యాండ్ పట్ల జగన్ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా... జగన్ ఎలా రెస్పాండ్ అయినా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమని అన్నారు. అసెంబ్లీలో జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే... ఆయనకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెపుతానని తెలిపారు. మరోవైపు జగన్ తో రఘురాజు మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Raghu Rama Krishna Raju: అసెంబ్లీలో జగన్ పక్కన కూర్చున్న రఘురామకృష్ణరాజు 22-07-2024 Mon 11:16 | Andhra నేటి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం పక్కపక్క సీట్లలో కూర్చున్న జగన్, రఘురాజు జగన్ తో ముచ్చటించిన రఘురాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి రోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూర్చున్నారు. సభ ప్రారంభానికి ముందు జగన్ తో మాట్లాడేందుకు రఘురాజు ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చోవడం ఆసక్తిని రేకెత్తించింది. జగన్, రఘురాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ జరిగింది. జగన్ చెవిలో రఘురాజు ఏదో చెప్పగా... ఆ వెంటనే జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే, జగన్ తో ఆర్ఆర్ఆర్ ఏం మాట్లాడారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Raghu Rama Krishna Raju: జగన్ డిమాండ్ నాకు అంతుపట్టకుండా ఉంది: రఘురామకృష్ణరాజు 22-07-2024 Mon 12:46 | Andhra ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్ పై రఘురాజు ఎద్దేవా శాంతిభద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య వినుకొండ హత్య విషయంలో చంద్రబాబుపై విమర్శలు సరికాదన్న రఘురాజు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని... అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏమిటో తనకు అంతుపట్టకుండా ఉందని చెప్పారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించుకునేందుకు కొందరికి డబ్బులిచ్చి, వారిని తీసుకొచ్చి, వారితో జగన్ కు దండాలు పెట్టించి, వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ నిర్మాణానికి భూములు, నిధులు ఇచ్చిన రాజా వాసిరెడ్డి రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Eedi ragging debbaki paripoyadu… YSRCP: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు 22-07-2024 Mon 14:15 | Andhra ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా... జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి సభకు వచ్చారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. అనంతరం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు. జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అటు, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు. సభ నుంచి వెలుపలికి వచ్చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Pattu mani 1hr levu house lo… nee mohaniki cbn bhayapdatam… silly psyco jagan Jagan: చంద్రబాబు భయపడుతున్నారు.. 24న ఢిల్లీలో నిరసన చేపడుతున్నాం: జగన్ 22-07-2024 Mon 15:57 | Andhra కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమయిందన్న జగన్ హామీలు అమలు చేయని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్య ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని విమర్శ కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోందని ఎద్దేవా చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి స్పష్టంగా కనిపిస్తోందని జగన్ చెప్పారు. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే... పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’, ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో... ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’ అని అన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని... ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షమని చెప్పారు. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉందని, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పారు. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయమని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారని అన్నారు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉందని చెప్పారు. తనతో పాటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ, నిరసన కార్యక్రమం ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంతో, మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Comedy king 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post psycopk Posted July 22 Author Popular Post Report Share Posted July 22 3 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 Clash in delhi 2 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted July 22 Report Share Posted July 22 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.