Jump to content

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు... ముఖ్యాంశాలు ఇవిగో


psycopk

Recommended Posts

 

Chandrababu: ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు... ముఖ్యాంశాలు ఇవిగో! 

26-07-2024 Fri 13:23 | Andhra
AP CM Chandrababu releases white paper on finance
 

 

  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు
  • నేడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించిన వైనం
ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు. అదే సమయంలో 58 శాతం జనాభా ఉంది. అక్కడ్నించే సమస్యలు ప్రారంభం అయ్యాయని, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. 

"రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సేవల రంగం తెలంగాణకు వెళితే, ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. 

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం రూ.95 వేలుగా ఉంది. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.93,903. అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కి పెరిగింది.

2014లో వ్యవసాయం ఏపీలో 33 శాతం, తెలంగాణలో 19 శాతం ఉండేది. 2014లో పరిశ్రమలు ఏపీలో 23 శాతం ఉంటే, తెలంగాణలో 19 శాతం ఉన్నాయి. 2014లో సేవల రంగం ఏపీలో 44 శాతం ఉంటే, తెలంగాణలో 61 శాతానికి విస్తరించింది. ఒక్క హైదరాబాద్ వల్లనే సేవల రంగంలో రెండు రాష్ట్రాల మధ్య 17 శాతం తేడా నెలకొంది. 

ఇక, రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిది. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుంది. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉండడం కలిసొచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళుతుంది. రూ.1167 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం చేకూరింది. 

విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేశాం. కాకినాడ సెజ్ కు 8 వేల ఎకరాల భూమి సేకరిస్తే, గత ప్రభుత్వ హయాంలో అంతా మార్చేశారు. రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చాం. 

కానీ, 2019 తర్వాత తప్పుడు పాలనతో పరిస్థితి తారుమారైంది. అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా రూ.12,250 కోట్ల మేర అదనపు భారం పడింది. అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రూ.9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారు. 101.16 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేస్తే, ఎన్జీటీ రూ.5 కోట్ల జరిమానా వేసింది. 

పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోగా... అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1.29 లక్షల కోట్ల నష్టం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్ధారణలో జాప్యం కారణంగా రూ.45 వేల కోట్లు, డ్యామేజీలు, మరమ్మతులతో మరో రూ.4,900 కోట్లు, జల విద్యుత్ ఉత్పాదనలో జాప్యం కారణంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. 

గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబించారు. మేం కేటాయించిన 227 ఎకరాల భూములను ఉపసంహరించుకుని, పరిశ్రమలను తరిమేశారు. మా హయాంలో 5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. 20 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి బడ్జెట్ లో 34 శాతం ఖర్చు చేశాం. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చాక పన్నులు విపరీతంగా పెంచేశారు. విద్యుత్ చార్జీలు పెరిగాయి, ఆర్టీసీ చార్జీలు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్ను విధించారు. 

ఇవాళ్టికి రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు. ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉంది. తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టు అప్పులు బయటికొస్తున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336 పెరిగింది. మరోవైపు ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. 

మరి డీబీటీ అన్నారు కదా... ఎక్కడికి కొట్టుకుపోయింది? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? పేదవాడికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాలు చేయలేదన్న విషయం ఈ గణాంకాల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది" అంటూ చంద్రబాబు వివరించారు. 

 

 

Link to comment
Share on other sites

Jagan: రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఇదే: జగన్ 

26-07-2024 Fri 13:48 | Andhra
Jagan reveals how much debt state govt have
 

 

  • ఇవాళే ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • ఏపీ అప్పులు రూ.9.74 లక్షల కోట్లు అని ప్రకటన
  • అదే సమయంలో తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్
  • రాష్ట్ర అప్పులపై వివరణ
  • ఏపీకి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లు అని వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం అని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. 

సాధారణ బడ్జెట్ అయితే... ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటిని చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లోమీడియాకు వేదం అని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. 

"ఇటీవలే మనందరికీ మొదటి స్టోరీ పరిచయం చేశారు. అదేంటంటే... రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అనేదే ఆ స్టోరీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్లే తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాడట. రాష్ట్రం నిజంగానే ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందా అనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించి, వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. 

రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాల్లోనూ, గవర్నర్ ప్రసంగంలోనూ తీసుకొచ్చాడు. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు, ఆయన మీడియా ఊదరగొడుతున్నది ఏంటంటే... రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందట. 

ఓవైపు రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని చెబుతూనే, మరోవైపు సూపర్-6 పథకాలు అన్నారు, సూపర్-7, సూపర్-10 అన్నారు. దేనికదే ప్రత్యేకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. చివరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలందర అడుగుతున్నారు. దాంతో, ఎన్నికల్లో తాను చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పు అంశాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే మళ్లీ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. 

కానీ వాస్తవం చెప్పాలంటే... అక్కడ రూ.14 లక్షల కోట్ల అప్పు నిజంగానే ఉందా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేనిది ఉన్నట్టు ఎలా చెప్పగలడు? బడ్జెట్ పత్రాల్లో ఇవన్నీ చూపించక తప్పదు కదా. కానీ, అవన్నీ చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రివ్యూ అన్నాడు, అధికారుల ట్రాన్స్ ఫర్ అన్నాడు... చివరికి గవర్నర్ ప్రసంగానికి వచ్చే సరికి రూ.14 లక్షల కోట్లను కాస్తా రూ.10 లక్షలకు తగ్గించాడు. 

ఆ రూ.10 లక్షల కోట్ల విషయంలో అయినా గవర్నర్ తో నిజాలు చెప్పించాడా అంటే అదీ లేదు. ఓసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. నేను చెప్పేవన్నీ ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లలోని వివరాలు. చంద్రబాబు అనే వ్యక్తి గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించాడు, శ్వేతపత్రం పేరుతో మరీ అబద్ధాలు ఆడుతున్నాడు. 

జూన్ నెల వరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.5.18 లక్షల కోట్లు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ.1,18,051 కోట్ల అప్పు ఉంటే... 2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.2,71,798 కోట్ల అప్పు ఉంది. 

జూన్ లో మా పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1.06 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేని రుణాలు రూ.1.23 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తమ్మీద పూర్తిస్థాయిలో రాష్ట్ర అప్పులు చూస్తే రూ.7.48 లక్షల కోట్లు" అని జగన్ వివరించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...