Jump to content

పెద్దయ్యారు.. ‘వెళ్లిపోండి!’


Undilaemanchikalam

Recommended Posts

They all came to America with their parents when they didn't know much. Grew up there. Studied. Some people also got jobs. All this is legal. But.. as it is now, you are 21 years old. "Leave our country," says the US government. As a result, they had to leave their beloved country, their parents and relatives and return to a 'homeland' they knew nothing about. The US President's Office itself has admitted that there are about 2.5 lakh such people, most of whom are Indians. 

Who are they?

When Zefrina was seven years old, her parents left India for work in America. She went on an H-4 (Dependent) visa as a dependent child of her parents. Her parents who are on H-1B visa... have applied for permanent residence (green card) in America. But it is still pending. Meanwhile Zefrina turned 21 years old. She is now forced to leave America and go to India. 

Roshan, who went with his parents as a child, grew up in America. He studied there. Recently turned 21. Both parents are still on H-1B visas. He returned to India a few months ago and is staying with his relatives, who does not know how it will be.
Praneetha, who came to Texas with her parents at the age of 8, is working as a cloud engineer in an American semiconductor company. After 15 years, her US residence has now become inaccessible. 
why..

Parents who come to the US on employment are allowed to accompany their children (temporarily in the nonimmigrant visa category). If the parents get a green card before the child turns 21, it's like getting permanent residency. Otherwise, if they do not get a green card before turning 21, their temporary dependent visa status will be cancelled. This is called 'age out'. Their name will be removed from the parent's green card application. As a result, it will be sent from America. Otherwise you have to apply for another type of temporary visa to stay there. If you can't do that, you have to leave America.

USA: పెద్దయ్యారు.. ‘వెళ్లిపోండి!’

వారంతా.. పెద్దగా ఊహ తెలియనప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడే పెరిగారు. చదువుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలూ వచ్చాయి. ఇదంతా చట్టబద్ధమే. కానీ.. ఇప్పుడు ఉన్నట్లుండి ‘మీకు 21 ఏళ్లు నిండాయ్‌. మా దేశాన్ని వదిలి వెళ్లండి’ అంటోంది అమెరికా ప్రభుత్వం.

2.5 లక్షల మంది విదేశీ యువతపై వేలాడుతున్న అమెరికా వీసా కత్తి
గ్రీన్‌కార్డుల ఆమోదంలో ఆలస్యం ఫలితం 
వీరిలో అత్యధికులు భారతీయులే
ఈనాడు ప్రత్యేక విభాగం

పెద్దయ్యారు.. ‘వెళ్లిపోండి!’

వారంతా.. పెద్దగా ఊహ తెలియనప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడే పెరిగారు. చదువుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలూ వచ్చాయి. ఇదంతా చట్టబద్ధమే. కానీ.. ఇప్పుడు ఉన్నట్లుండి ‘మీకు 21 ఏళ్లు నిండాయ్‌. మా దేశాన్ని వదిలి వెళ్లండి’ అంటోంది అమెరికా ప్రభుత్వం. దీంతో తమదనుకున్న దేశాన్ని, అక్కడే ఉన్న తల్లిదండ్రులను, బంధువులను విడిచి తమకేమీ తెలియని ‘స్వదేశానికి’ తిరిగి రావాల్సిన పరిస్థితి వారికి తలెత్తింది. ఇలాంటి వారు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారని, వారిలో భారతీయులే ఎక్కువని అమెరికా అధ్యక్ష కార్యాలయమే స్వయంగా అంగీకరించింది. 

ఎవరు వీరు..

జెఫ్రీనాకు ఏడేళ్ల వయసున్నప్పుడు... తల్లిదండ్రులు భారత్‌ నుంచి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లారు. తల్లిదండ్రులపై ఆధారపడ్డ బిడ్డగా ఆమె హెచ్‌-4 (డిపెండెంట్‌) వీసాపై వెళ్లింది. హెచ్‌-1బీ వీసాపై ఉన్న ఆమె తల్లిదండ్రులు... అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌ కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదింకా పెండింగ్‌లోనే ఉంది. ఇంతలో జెఫ్రీనాకు 21 ఏళ్లు నిండాయి. అమె ఇప్పుడు బలవంతంగా అమెరికాను వదిలి భారత్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. 

  • తల్లిదండ్రులతో చిన్న పిల్లాడిగా వెళ్లిన రోషన్‌ అమెరికాలోనే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఇటీవలే 21 ఏళ్లు నిండాయి. తల్లిదండ్రులింకా హెచ్‌-1బీ వీసాలపైనే ఉన్నారు. దీంతో ఎలా ఉంటుందో తెలియని భారత్‌కు కొద్ది నెలల కిందట తిరిగి వచ్చి బంధువులవద్ద ఉంటున్నాడు.
  • 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలసి టెక్సాస్‌ వచ్చిన ప్రణీత అమెరికన్‌ సెమీకండక్టర్‌ కంపెనీలో క్లౌడ్‌ ఇంజినీరుగా పని చేస్తోంది. 15 ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నివాసం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. 

ఎందుకిలా..

ఉద్యోగాల మీద అమెరికా వచ్చే తల్లిదండ్రుల వెంట వారి పిల్లల్ని (నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా కేటగిరీలో తాత్కాలికంగా) అనుమతిస్తారు. పిల్లలకు 21 ఏళ్లు నిండేలోపు తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డు వస్తే వారికీ శాశ్వత నివాసం దొరికినట్లే. అలాకాకుండా 21 ఏళ్లు నిండేలోపు గ్రీన్‌కార్డు రాకుంటే వారి తాత్కాలిక డిపెండెంట్‌ వీసా హోదా రద్దవుతుంది. దీన్నే ‘ఏజ్‌ ఔట్‌’ అంటారు. వారి పేరు తల్లిదండ్రుల గ్రీన్‌కార్డు దరఖాస్తు నుంచి తొలగిపోతుంది. ఫలితంగా అమెరికా నుంచి పంపించేస్తారు. లేదంటే అక్కడే ఉండటానికి మరోరకం తాత్కాలిక వీసాలకు దరఖాస్తు చేసుకోవాలి. అందుకు వీలు లేకుంటే అమెరికాను వదిలి వెళ్లాల్సిందే.

 

అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సేవల (యూఎస్‌సీఐఎస్‌) గణాంకాల ప్రకారం... గత నవంబరు నాటికి 10 లక్షల మందికిపైగా భారతీయులు.. గ్రీన్‌కార్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.


ప్రభుత్వం ఏం చేస్తోంది..

21 ఏళ్ల వయసొచ్చిందనే కారణంగా లక్షల మంది యువతరంపై వీసా వేటు వేలాడుతోందని, కాంగ్రెస్‌లో తీర్మానమో, చట్టమో చేయడంద్వారా వారిని ఆదుకోవాలని కోరుతూ 43 మంది రిపబ్లికన్, డెమోక్రటిక్‌ పార్టీల సెనెటర్లు బైడెన్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘ఇంప్రూవ్‌ ద డ్రీమ్‌’ అనే సంస్థ వీరి పక్షాన 100 మంది సెనెటర్లను కలిసి విజ్ఞప్తి చేసింది. కానీ అది కొలిక్కి రావడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదీ రాజకీయాంశంగా మారుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న విదేశీ యువతపై ఇమిగ్రేషన్‌ కత్తి వేలాడటానికి రిపబ్లికన్లే కారణమని అధికార డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికార ప్రతినిధి తాజాగా బహిరంగ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఇక్కడే ఎదిగి, ఇక్కడే చదివి... గ్రీన్‌కార్డులకు దరఖాస్తులు చేసి, అమెరికాలోనే ఉండాలని కలలుగంటున్న విదేశీ యువతను ఆదుకోవాలని మేం ప్రతిపాదించాం. ఇందుకోసం సెనెట్‌లో ఇరుపక్షాలూ కలిసి తీర్మానించాలని కోరాం. కానీ రిపబ్లికన్లు అడ్డుకున్నారు. మా ప్రయత్నాలకు రెండుసార్లు గండికొట్టారు’ అని శ్వేతసౌధం మీడియా ప్రతినిధి వివరించారు.

‘తల్లిదండ్రులతో వచ్చి అమెరికాలో చదువుకున్న వారిలో 87శాతం మంది సైన్స్, గణితం, ఇంజినీరింగ్, మెడిసిన్, ఆరోగ్య రంగాల్లో నిపుణులే. ఇలాంటి నిపుణులైన యువతను అమెరికా కోల్పోవడం దారుణం. అంతే కాదు ఇదే తమ దేశమని భావించిన వారిని ఉన్న పళంగా దేశాన్ని విడిచి, తల్లిదండ్రులు, స్నేహితులను విడిచి వెళ్లిపొమ్మనటం అత్యంత అమానవీయం. వారిక్కడే ఉండటం ఆర్థికంగా అమెరికాకు లాభదాయకం. అత్యంత కీలకమైన ఈ అంశంపై రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలసికట్టుగా మానవీయ దృక్పథంతో ప్రాధాన్య క్రమంలో నిర్ణయం తీసుకోవాలి.’

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...