Jump to content

పెద్దిరెడ్డి భూ బాధితులు 24 మండలాల్లో 482 మంది


southyx

Recommended Posts

Peddireddy: కబ్జాదారులు.. పెద్దిరెడ్డి సోదరులు, వైకాపా నేతలే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూకబ్జాల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరులే పాత్రధారులంటూ బాధితులు పెద్దఎత్తున ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆధ్వర్యంలో జరిగిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చి విచారించి న్యాయం చేయాలని అర్జీలిచ్చారు.

Updated : 29 Jul 2024 05:33 IST
 
 
 
 
 
 

24 మండలాల్లో 482 మంది  భూ బాధితులు
ప్రైవేటు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 229 ఫిర్యాదులు
మదనపల్లెలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
తిరుపతి, శ్రీకాళహస్తిలోనూ రూ.వందల కోట్ల భూముల స్వాహా
వాటిపైనా విచారణ కోరుతున్న ప్రజాసంఘాలు

ap280724main9a.jpg

ఈనాడు, అమరావతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూకబ్జాల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరులే పాత్రధారులంటూ బాధితులు పెద్దఎత్తున ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆధ్వర్యంలో జరిగిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చి విచారించి న్యాయం చేయాలని అర్జీలిచ్చారు. మొత్తం 24 మండలాల నుంచి 482 మంది బాధితులు ముందుకురాగా.. వాటిలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, 22(ఎ), ఆర్‌ఓఆర్‌ జాబితాలకు సంబంధించి 376 ఫిర్యాదులందాయి. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి, అనుచరులు, ఇతర నేతలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని ఆక్రమించారంటూ 229 మంది ఫిర్యాదులిచ్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రాంతాల్లో జరిగిన అక్రమాలనూ బయటకు తీసి, విచారణ జరిపించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.

మదనపల్లె, కురబలకోట, పుంగనూరు మండలాల్లోనే అత్యధికంగా 

మొత్తం 482 ఫిర్యాదులు అందగా.. అందులో మదనపల్లె మండలం నుంచి 179, కురబల కోట మండలం నుంచి 60, పుంగనూరు మండలం నుంచి 48 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై  ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక అందించనున్నారు. 

మదనపల్లెలో ప్రైవేటు భూముల కబ్జాపై 55, ప్రభుత్వ భూముల ఆక్రమణపై 28, నిషేధిత 22ఏ జాబితా నుంచి తొలగింపుపై 13, ఆర్‌ఓఆర్‌కు సంబంధించి 36 ఫిర్యాదులు వచ్చాయి. కురబలకోట మండలంలో ప్రైవేటు భూముల కబ్జాపై 23, ప్రభుత్వభూముల ఆక్రమణలపై 10, 22ఏ జాబితా నుంచి తొలగించారంటూ 4, ఆర్‌ఓఆర్‌పై 13 ఫిర్యాదులందాయి. పుంగనూరు మండలంలో ప్రైవేటు భూముల ఆక్రమణపై 26 మంది ఫిర్యాదులిచ్చారు. బి.కొత్తకోట, నిమ్మనపల్లి మండలాల నుంచి 22 చొప్పున, చౌడేపల్లి 20, మొలకలచెరువు 18, పీలేరు 17, కలికిరి 16, పెద తిప్ప సముద్రం 12, వాల్మీకిపురం మండలంలో 11 మంది అర్జీలిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు సంబంధించి 229 ఘటనల్లో వైకాపా నేతలు, ఇతర పార్టీల నేతల ప్రమేయం ఉందని అధికారులు గుర్తించారు. 

రూ.వందల కోట్ల విలువైన భూములకు లెక్కలేవీ? 

వైకాపా హయాంలో.. తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట చుట్టుపక్కల సుమారు రూ.600 కోట్ల విలువైన భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేసినట్లు అనధికార అంచనా. ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నివేదిక తయారు చేయగా.. సుమారు 210 చోట్ల వివిధ సర్వే నంబర్లలో భూఅక్రమాలు జరిగాయని తేలింది. కొన్నింటికి రుణాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో పాత్ర ఉన్న కొందరు అధికారులు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. శ్వేతపత్రం తయారీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపిన వాటిలో వీటిని తప్పించి.. 10 చోట్ల మాత్రమే అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలన్నీ జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద ఉంటాయి. ప్రభుత్వం ఈ దిశగా విచారణ చేయిస్తే రూ.వందల కోట్ల అక్రమాలు బయటపడతాయి.

ap280724main9b.jpg

https://www.eenadu.net/telugu-news/ap-top-news/the-encroachers-are-the-peddireddy-brothers-and-ysrcp-leaders/2501/124139616

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...