psycopk Posted July 31 Report Share Posted July 31 KTR: ఆర్థిక పరిస్థితి తెలుసు.. రుణమాఫీకి మీరెన్ని తంటాలు పడుతున్నారో కూడా తెలుసు: కేటీఆర్ 31-07-2024 Wed 11:39 | Telangana రుణమాఫీకి పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు తేవడం కష్టమని తెలుసునన్న కేటీఆర్ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్న మీరు నిద్రలేని రాత్రులు గడిపి... మాకూ నిద్రలేకుండా చేస్తున్నారని చురక కాంగ్రెస్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని విమర్శ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తమకు తెలుసునని... రుణమాఫీ చేయడానికి మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం) ఎన్ని తంటాలు పడుతున్నారో కూడా తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిరిగల... లక్ష్మీగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఈ ప్రభుత్వానికి సరికాదన్నారు. దివాలా తీశామని చెప్పుకుంటే ఎలా? మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని మనమే తిట్టుకుంటే ఎలా? అని నిలదీశారు. మా వ్యాపారం దివాలా తీసిందని, మాకు అప్పులు ఉన్నాయని చెబితే పెట్టుబడిదారులు వస్తారా? అని ప్రశ్నించారు. నిధులు అవసరమైతే ఎఫ్ఆర్బీఎంను పెంచమని కేంద్రాన్ని అడగాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి వరకు మేం కూడా అక్కడే (అధికారంలో) ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు తెలుసునని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసునని చెప్పారు. రుణమాఫీ చేయడానికి మీరు కూడా తంటాలు పడుతున్న విషయం తెలుసునన్నారు. మీరు నిద్రలేని రాత్రులు గడిపి... మాకూ నిద్రలేకుండా చేస్తున్నారు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు తేవడం ఎంత కష్టమో తమకు తెలుసునని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి మూడు గంటల వరకు సభను నడిపి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. తమకూ నిద్రలేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వ పెట్టుబడితో పేదలు బాగుపడాలన్నారు. కేసీఆర్ ఫోబియా కానీ వీళ్లతో (కాంగ్రెస్ ప్రభుత్వం) బాధేమిటంటే కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తామని చెబుతుంటారని... కానీ చెరిపివేయలేని, తుడిచివేయలేని... దాచివేయలేనివి కేసీఆర్ ఆనవాళ్లు అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను ఎలా చెరపగలుగుతారు? అని నిలదీశారు. 'కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్... కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్... భగీరథ నల్లా నీళ్ళలో కేసీఆర్... పాలమూరు జలధారలో కేసీఆర్... సీతారామ ఎత్తిపోతలలో కేసీఆర్... గురుకుల బడిలో కేసీఆర్... యాదాద్రిగుడి యశస్సులో కేసీఆర్... విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్... మెడికల్ కాలేజీ వైద్య, విద్య విప్లవంలో కేసీఆర్... కలెక్టరేట్ల భవనాల కాంతుల్లో కేసీఆర్... కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్... మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్... టీ హబ్, టీ వర్క్స్ సృజనలో కేసీఆర్... వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్... అతిపెద్ద అంబేడ్కర్ మెరుపుల్లో కేసీఆర్... అమరదీపం ఆశయాల్లో కేసీఆర్' అన్నారు. మధ్యలో శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ... త్వరగా ముగించాలని కోరారు. కొత్త గవర్నర్ వస్తున్నారని, ఈరోజు ప్రమాణ స్వీకారానికి మనం హాజరు కావాల్సి ఉందని, కాబట్టి త్వరగా ముగించాలని కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ స్పందిస్తూ... గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అందరం వెళదామని, కానీ ద్రవ్య వినిమయ బిల్లు ముఖ్యమైనది కాబట్టి సభను వాయిదా వేసి, గవర్నర్ ప్రమాణ స్వీకారం తర్వాత తిరిగి ప్రారంభించి అర్ధరాత్రి వరకు నడుపుకుందామన్నారు. అయితే పది నిమిషాల్లో ముగించాలని మంత్రి మరోసారి సూచించారు. ఎన్నికలకు ముందు రజినీకాంత్... ఎన్నికల తర్వాత గజినీకాంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. తులం బంగారం, స్కూటీ వంటి హామీల పరిస్థితి ఏమిటన్నారు. కోతలు, ఎగవేతలు, కత్తిరింపులతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరపు ఆర్భాటాలు, దుబారా ఖర్చులు తగ్గించాలని సూచించారు. రుణమాఫీ ఒకే దఫా చేయనప్పటికీ ప్రకటనలు మాత్రం ఇప్పటికి రెండుసార్లు ఇచ్చారని ఆరోపించారు. ఇలాంటి దుబారా ఖర్చును చేయవద్దన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ బాండ్ పేపర్ పైన సంతకం పెట్టి మరిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు రజినీకాంత్... ఎన్నికల తర్వాత గజినీకాంత్ అంటే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం డెవలప్మెంట్ ఏజెంట్‌గా ఉండాలి తప్ప రికవరీ ఏజెంట్లా ఉండవద్దని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిపక్ష పార్టీగా తాము నిలదీస్తామన్నారు. ప్రజలకు 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై రికవరీ ఛార్జిషీట్ వేయాలన్నారు. ప్రజలకు వీరు 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇస్తే... దానికి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఇస్తామన్న తులం బంగారం ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి బంగారం దొరకడం లేదా? లేక దేశంలో బంగారం నిల్వలు తగ్గాయా? ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, మహిళలు వీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని, కానీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. గోబెల్స్‌ను మించి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు, పరీక్షలు జరిగితే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు ఇచ్చి 30వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Thummala: గతంలో కంటే భిన్నంగా త్వరలో రైతు భరోసా విధివిధానాలు: తుమ్మల నాగేశ్వరరావు 31-07-2024 Wed 10:33 | Telangana రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని వ్యాఖ్య రూ.31 వేల కోట్ల రుణమాఫీ ఒకే పంట కాలంలో చేస్తున్నట్లు వెల్లడి పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని హామీ రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నామని, గతంలో కంటే భిన్నంగా సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న రెండో విడత రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ ఒకే పంట కాలంలో చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామన్నారు. త్వరలో రైతు భరోసా విధివిధానాలు సిద్ధమవుతాయన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఆయన రైతులను కోరారు. దీనిపై ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేయాలని రైతులను కోరుతున్నామన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ 31-07-2024 Wed 12:06 | Telangana కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని కేటీఆర్ విమర్శ అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా? అని అడుగుదామని సవాల్ రైతుల కోసమే రైతుబంధు తెచ్చామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. తమ హయాంలో పరీక్షలు జరిగి, ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు. 'అశోక్ నగర్ చౌరస్తాకు సెక్యూరిటీ లేకుండా వెళ్దాం... అక్కడి యువకులను అడుగుదాం... రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెబితే నేను రాజీనామా చేసి వెళ్తా. అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినా సరే'నని కేటీఆర్ సవాల్ చేశారు. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకోవద్దని సూచించారు. విద్యార్థులు పోస్టులు పెంచమంటే పోలీస్ జులుం, పరీక్షలు వాయిదా వేయమంటే అరెస్టులు... ఇదేమిటని నిలదీశారు. వాయిదా వేయమని విద్యార్థులు అడిగితే... వారిని సన్నాసులు అని సీఎం అనడం సరికాదన్నారు. ఎవరైతే అధికారం ఇచ్చారో... ఆ నిరుద్యోగులను పట్టుకొని కోచింగ్ సెంటర్ల కోసం వాయిదా కోరుతున్నారని ఆరోపించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయమంటే సంక్షోభం... కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు.. కాంగ్రెస్ రాగానే సాగునీరు కట్ అయి పంటలు ఎండిపోయాయి... రైతుబంధు కూడా కట్ అయిందని విమర్శించారు. అందుకే రైతుబంధు తెచ్చాం రైతుల బతుకులు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్లు రైతులకూ ఇవ్వాలన్నారు. అందుకే తాము రైతుబంధును తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి... రైతు వెన్ను విరిగి... పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలో పదుల ఎకరాలు ఉన్న రైతులు కూడా నీరు లేక పంటలు పండించే పరిస్థితి లేక... బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అందుకే తాము రైతుబంధు తెచ్చామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకివ్వలేదు: సీతక్క ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీల పెన్షన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పెన్షన్ తీసేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు: శ్రీధర్ బాబు దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిన బీఆర్ఎస్కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గుజరాత్ వద్దన్న ఫసల్ బీమా మనకెందుకు?: కేటీఆర్ ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ వద్దని చెబుతున్న ఇందులోకి మనం వెళ్లడం ఏమిటన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అని చెబుతూ... రెండుసార్లు ప్రకటన ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే 16 వేల కోట్లు అయిందని, మరి మీరు లక్షన్నర రుణమాఫీ చేస్తే రూ.12 వేల కోట్లే ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఎన్ని కోతలు జరుగుతున్నాయో దీనిని బట్టి తెలుసుకోవచ్చన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం! 31-07-2024 Wed 13:05 | Telangana కేటీఆర్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న సీఎం బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెప్పించారన్న ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం మాత్రమే పాక్షికంగా తెప్పించామని కేటీఆర్ సమాధానం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడేననీ... పదేళ్లుగా మాత్రం చెడిందన్న కేటీఆర్ 10 నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై కేటీఆర్ వందల ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం సాగింది. తనకు ఇచ్చిన సమయాన్ని సభను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకున్నాయని... ప్రజల అనుభవాలు ప్రజలకు ఉన్నాయని... అందుకే ఆ ప్రజలే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలపై రేవంత్ వర్సెస్ కేటీఆర్ బతుకమ్మ చీరలను మీరు సిరిసిల్ల కార్మికులతో నేయించలేదని... వారికి పని ఇవ్వలేదని... సూరత్ నుంచి కొన్నారని నేను స్పష్టంగా ఆరోపిస్తున్నానని... దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభలో అధికారి పేరు తీయకూడదని (అంతకుముందు కేటీఆర్ సభలో ఓ అధికారి పేరు తీయడాన్ని ఉద్దేశించి) పెద్దపెద్ద చదువులు చదువుకున్న వారికి తెలుసో లేదో తనకైతే తెలియదని... కాని ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు తెలుసు అన్నారు. 610 జీవో ఉన్నా... ముల్కీ రూల్ ఉన్నా... తెలంగాణలోని ప్రతి ఉద్యోగానికి తనకు అర్హత ఉందని.. కానీ గుంటూరులో చదువుకున్న వారికి అర్హత ఉందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. తాను గుంటూరు కాలేజీలోనే చదువుకున్నానని.. కానీ 610 జీవో ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుంది తప్ప ప్రైవేటు రంగానికి కాదని కేటీఆర్ అన్నారు. తాను ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేశానని... 610 జీవో వర్తించదని గుర్తించాలని సమాధానం చెప్పారు. ఇక బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెప్పించారని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ మొదటి సంవత్సరం మాత్రమే అక్కడి నుంచి కొంతమేర తెప్పించామన్నారు. సిరిసిల్లలో అప్పటికి అప్పుడు కోటి చీరలు చేయలేం కాబట్టి పాక్షికంగా అక్కడి నుంచి మొదటి సంవత్సరం మాత్రమే తెప్పించామన్నారు. ఇక తాను అధికారి పేరును తీసుకున్నానని... బిజినెస్ రూల్స్ చదివానని... అధికారిని ప్రత్యేక అటెండీగా పిలువవచ్చునన్నారు. రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడే: కేటీఆర్ రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడేనని కేటీఆర్ అన్నారు. ఆయన పద్దెనిమిదేళ్లుగా తనకు తెలుసునన్నారు. గత పదేళ్ల నుంచి ఆయనకు, తమకు చెడిందన్నారు. పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు 1800 కోట్లు ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను విడుదల చేశామన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Revanth Reddy: ఈ తమ్ముడిని అలా మోసం చేసింది కాబట్టే... జాగ్రత్త అంటూ కేటీఆర్‌ని హెచ్చరించా: సబితపై రేవంత్ రెడ్డి ఫైర్ 31-07-2024 Wed 13:51 | Telangana తనను కాంగ్రెస్‌లోకి సబితక్క ఆహ్వానించిన మాట వాస్తవమేనన్న సీఎం మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని చెప్పి.. బీఆర్ఎస్లో చేరారని ఆగ్రహం ఈ తమ్ముడికి అండగా ఉంటానని సబితక్క మోసం చేశారన్న సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమను నమ్మవద్దని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి చెప్పడంపై సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ... తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పారని, అది వాస్తవమేనని.. కానీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే అండగా నిలబడతానని తనకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. అందుకే కేటీఆర్‌ను హెచ్చరించానని అభిప్రాయపడ్డారు. 'ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది. ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని నేను చెప్పాను... పెద్ద లీడర్వు అవుతావు... పార్టీకి, నీకు భవిష్యత్తు ఉంటుందని నాతో చెప్పానని సబితక్క అంటున్నారు. అది వాస్తవం. అయితే ఇది మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. కాబట్టి దీనికి కొనసాగింపుగా జరిగిన చర్చను కూడా నేను సభలోనే పెట్టాలి. వారి మాటను విశ్వసించి.. సొంత అక్కగా భావించి... కుటుంబ సంబంధాల నేపథ్యంలో... ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాన'ని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను పార్లమెంట్‌కు పోటీ చేయమని చెప్పారని పేర్కొన్నారు. మల్కాజ్గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని చెప్పి... అండగా ఉంటానని సబితక్క తనకు మాట ఇచ్చారని, కానీ పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చాక ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు. 'తమ్ముడిగా తనను పిలిచి... మల్కాజ్‌గిరిలో అండగా ఉంటానని ప్రోత్సహించి.. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించాక కేసీఆర్ మాయమాటలకు... అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి దక్కించుకొని తమ్ముడిని మోసం చేసింది కాబట్టే ఈరోజు ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పాను. ఇది నిజమా? కాదా? అని సబితక్కను అడగండి' అని సీఎం ఆవేశంగా అన్నారు. ఆరోజు తనను ప్రోత్సహించి మోసం చేశారని, ఇప్పుడు తమకు నీతులు చెబుతారా? అని మండిపడ్డారు. అయినా తాను కేటీఆర్‌కు చెప్పిన సమయంలో ఎవరి పేరూ తీసుకోలేదన్నారు. అయినా సబితక్క స్పందించడం విడ్డూరమన్నారు. కొత్త గవర్నర్ గారు వస్తున్నారని... ఆయనను ఆహ్వానించడానికి వెళ్తున్నానని... ఇంకా ఏమైనా ఉంటే ఆ తర్వాత వచ్చి సమాధానం చెబుతానని ముఖ్యమంత్రి అన్నారు. తాను తిరిగి వచ్చాక అందరికి కలిపి సమాధానం చెబుతానన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డికి నాపై ఇంత కక్ష ఎందుకు?: సబితా ఇంద్రారెడ్డి 31-07-2024 Wed 13:27 | Telangana నీ వెనుక ఉన్న అక్కలను నమ్ముకోవద్దని కేటీఆర్‌తో రేవంత్ రెడ్డి చెప్పడమేమిటని ఆగ్రహం మేం ఏం మోసం చేశామని ఆ మాటలు అంటున్నారని ఆగ్రహం సీఎం తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. 'నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు... మోసం చేస్తార'ని కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం... ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానన్నారు. పార్టీలోకి రా తమ్ముడు... వస్తే ఈ పార్టీకి (కాంగ్రెస్) భవిష్యత్తులో ఆశాకిరణం అవుతావని రేవంత్ రెడ్డికి చెప్పింది తానే అన్నారు. ముఖ్యమంత్రివి అవుతావని కూడా రేవంత్ రెడ్డికి ఆనాడే చెప్పానన్నారు. అలా చెప్పలేదని గుండెమీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని... తనపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటన్నారు. తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేశారు. 'ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో చేరారు? అక్కడున్న వారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్లారో చర్చ పెట్టుకుందాం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటిమీద వాలితే కాల్చేస్తానని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చెప్పారు. మరి ఇప్పుడు తమ పార్టీ నుంచి చేర్చుకున్న వారు ఎంతమంది ఉన్నారు?' అని నిలదీశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Eedu okadu nanu guthichandi ani leka pote kosukunta antadu… Harish Rao: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు 31-07-2024 Wed 15:57 | Telangana మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ సమావేశాలను హుందాగా నిర్వహించామని వ్యాఖ్య కాంగ్రెస్ దురహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న మాజీ మంత్రి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమన్నారు. 'నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి గారు వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం.' అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా? రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే మేము చేసిన తప్పా? విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా? అని ఆయన ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని... కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నారని హరీశ్ రావు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted July 31 Report Share Posted July 31 Meeru marara all fake news Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted July 31 Report Share Posted July 31 Samara.. neeku maa jagananna baaga time ichinattunnadu.. TG meeda paddavu 😁 2 Quote Link to comment Share on other sites More sharing options...
Propmgr Posted July 31 Report Share Posted July 31 Pulka gaallu AP gurnchi yedistr better…. super six ani elections mundu cheppi won ainanka munda lekka yedustu thuch antundu nakka baava 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 3 minutes ago, Propmgr said: Pulka gaallu AP gurnchi yedistr better…. super six ani elections mundu cheppi won ainanka munda lekka yedustu thuch antundu nakka baava now you understand when pakka state paytms involve about AP politics and wish for its destruction... from my side.. i wish good for both states. i am just sharing news.. Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted July 31 Report Share Posted July 31 3 minutes ago, Propmgr said: Pulka gaallu AP gurnchi yedistr better…. super six ani elections mundu cheppi won ainanka munda lekka yedustu thuch antundu nakka baava Thagubothu luccha gaadu 2018 lo CM ayyaka Govt form chesi cabinet kurchesariki 2-3 months pattindhi. Aa thavtuavhata ayina sakkaga paalan chesaada ante farm lo thagi padunnaadu. Maa thikkodu 2019 lo CM ayyaka nava rathnalu lo ammavadi lanti programme start cheyyadaniki 7 months pattindhi. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.