Jump to content

నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతుల స్వీకరణ


psycopk

Recommended Posts

Chandrababu: నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతుల స్వీకరణ 

03-08-2024 Sat 07:33 | Andhra
Today CM Chandrababu went to NTR Bhavan to receive requests from people and party lines
 

 

  • నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్న సీఎం చంద్రబాబు
  • గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
  • సమస్యల పరిష్కారం కోసం విన్నవించుకోనున్న బాధితులు
  • నామినేటెడ్ పదవుల కోసం నాయకుల వినతులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు.. నేతలు, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించడంతో నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన కనబడుతోంది. అయితే వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో తనే స్వయంగా అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
  
ఈ క్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బాధితులు, ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవిస్తుండగా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు పలువురు నామినేటెడ్ పదవుల కోసం అభ్యర్థనలు అందజేస్తున్నారు.
Link to comment
Share on other sites

Chandrababu: పౌర సరఫరాల శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష .. అధికారులకు కీలక ఆదేశాలు 

03-08-2024 Sat 06:40 | Andhra
CM Chandrababu review of civil supplies department Key instructions to officials
 

 

  • ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు తేవాలని చంద్రబాబు ఆదేశం
  • పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు
  • రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఫౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్న సీఎం చంద్రబాబు .. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం 
రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని.. దీని వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సీఎం పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని చెప్పారు. 2019కి ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా.. అయిదేళ్లలో  వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ.41,550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైశాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యం అవుతుందని చెప్పారు.

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే మరిన్ని సరుకులు 
ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మార్కెట్ లో కందిపప్పు ధర రూ.180 రూపాయలు ఉండగా, ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కు, బియ్యం కూడా కేజీ రూ.48లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సిఎం సూచించారు. తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు. 

బియ్యం డోర్ డెలివరీ వాహనాలను ఏం చేద్దాం?
బియ్యం డోర్ డెలివరీ విధానం కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు (ఎండీయూ) కొనుగోలు చేశారని, అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

Chandrababu: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి.. చంద్రబాబు అభినందనలు 

03-08-2024 Sat 07:45 | Andhra
CM Chandrababu congratulated the young lady of Kuppam for her rare recognition
 

 

  • మిస్ యూనివర్స్ – ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి
  • కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిసిన చందన
  • అభినందించిన ముఖ్యమంత్రి
కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి చందన జయరాం అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యారు.
 
ముంబై‌లో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన పాల్గొననున్నారు. తన నియోజకవర్గం కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు చందన అర్హత సాధించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Chandrababu: ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష.. లిక్కర్ స్కాంపై సీఐడీ దర్యాప్తు మొదలవుతుందన్న చంద్రబాబు! 

03-08-2024 Sat 09:26 | Andhra
CM Chandrababu took a key decision on the AP liquor scam
 

 

  • గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని సీఎం ఆదేశాలు    
  • నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదని స్పష్టీకరణ 
  • సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ తెస్తామని వెల్లడి 
ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వారం రోజుల్లో మొదలవుతుందని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న కారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు.  సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని...దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు.
 
నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించకూడదు
ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని  కాపాడాలని అన్నారు. మద్యం సేవించే వారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ...తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యతలేని మద్యం లేకుండా చేస్తే కొంత వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని అన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని అన్నారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని...ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు వచ్చిన ఆదాయాన్నంతా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు.
 
సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త లిక్కర్ పాలసీ

రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తరువాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త మద్యం విధానంపై వచ్చే ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని, గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్యం విధానం ఆదాయం కోణంలో కాకుండా....అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

 

IIT Madras: అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటన 

03-08-2024 Sat 09:30 | Andhra
A team of experts from IIT Madras visited the capital region of Amaravati today
 

 

  • నిన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల గృహ సముదాయాలను పరిశీలించిన ఐఐటీ హైదరాబాద్ నిపుణులు
  • సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతను పరిశీలించనున్న మద్రాస్ ఐఐటీ బృందం
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఈరోజు (శనివారం) ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనున్నది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతను నిపుణులు అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం జరిగింది. అయితే గత వైసీపీ సర్కార్ ఐదేళ్లుగా ఆ నిర్మాణ పనులను పట్టించుకోలేదు. దీంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ తదితర నిర్మాణాలు నీటిలో నానుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటీ ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
  
ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) హైదరాబాద్ ఐఐటీ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు పరిశీలించారు. ఈరోజు కూడా రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలను పరిశీలించనున్నారు. కాగా ఈ రోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం  .. ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్ఠతను పరిశీలించనుంది. సీఆర్డీఏ అధికారులతో కలిసి వీరు నిర్మాణాలను పరిశీలిస్తారు. తర్వాత ఈ రెండు బృందాలు ప్రభుత్వానికి నివేదికను అందించనున్నాయి. 

 

 

Link to comment
Share on other sites

NP Rama Krishna Reddy: ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి 

03-08-2024 Sat 09:57 | Andhra
NP Ramakrishna Reddy Named Managing Director of AP Metro Rail
 

 

ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. టీడీపీ గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన అమరావతి మెట్రో రైల్ ఎండీగా పనిచేశారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు నివేదికల తయారీ, వాటిని కేంద్ర పరిశీలనకు పంపడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. 

ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే సమయంలో టీడీపీ అధికారం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో 31 మే 2021న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మరోమారు ఆయనను అదే పదవిలో నియమించింది. కాగా, ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేఎం రావును ప్రభుత్వం రిలీవ్ చేసింది.
Link to comment
Share on other sites

CM Chandrababu: రికార్డులు తారుమారు చేశారు.. ప్ర‌తీ మండ‌లంలోనూ భూకుంభ‌కోణం ఎదురుచూస్తోంది: చంద్ర‌బాబు 

03-08-2024 Sat 13:38 | Andhra
CM Chandrababu Media Meeting In Amaravathi
 

 

అమ‌రావ‌తిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బాధితుల నుంచి స్వీక‌రించిన విన‌తుల‌న్నింటిని ప‌రిష్క‌రించ‌డ‌మే మా ల‌క్ష్యం అని అన్నారు. రెవెన్యూ సంబంధిత స‌మ‌స్య‌ల‌పైనే అధికంగా ఫిర్యాదులు అందాయ‌ని తెలిపారు. 

రెవెన్యూ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైన అధికారుల‌పై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డిన అధికారుల‌పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు. రికార్డులు తారుమారు చేశార్న సీఎం.. ప్ర‌తీ మండ‌లంలోనూ భూకుంభ‌కోణం జరిగింద‌న్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...