psycopk Posted August 9 Author Report Share Posted August 9 Manish Sisodia: మనీశ్ సిసోడియాకు బెయిల్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు 09-08-2024 Fri 11:34 | National మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే వైకుంఠపాళీ ఆడినట్లేనని సుప్రీం వ్యాఖ్య 17 నెలల తర్వాత బయటకు రానున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. లిక్కర్ పాలసీ కేసులో సుమారు 17 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సిసోడియా జైలు నుంచి బయటకు అడుగుపెట్టనున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణను సాగదీయడం సరికాదని, వేగంగా విచారణ పూర్తిచేయాలని కోరే హక్కు సిసోడియాకు ఉందని పేర్కొంది. ట్రయల్ జరుగుతోందనే పేరుతో అనుమానితుడిని నిరవధికంగా జైలులో ఉంచుతామని అంటే ఒప్పుకోబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ కేసును విచారించారు. సిసోడియాను మళ్లీ ట్రయల్ కు పంపడమంటే అతడితో వైకుంఠపాళీ ఆడించినట్లేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కూడా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘ కాలంపాటు జైలులో ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు. బెయిల్ ఇవ్వకపోవడం అనుమానితుడిని శిక్షించడంగా భావించకూడదనే విషయాన్ని కింది కోర్టులు మరిచిపోయాయంటూ జస్టిస్ బీఆర్ గవాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ సాక్షులుగా పేర్కొన్న 493 మంది ఇచ్చిన స్టేట్ మెంట్ లలోనూ మనీశ్ సిసోడియా కేసు ట్రయల్ ను మరింత పొడిగించేందుకు ఎలాంటి అవకాశాలు తమకు కనిపించలేదని వ్యాఖ్యానించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 9 Author Report Share Posted August 9 KTR: కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుంది: కేటీఆర్ 09-08-2024 Fri 15:22 | Telangana కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడి జైల్లో ఉన్న కవిత 11 కిలోలు తగ్గారన్న కేటీఆర్ ఛార్జిషీట్ దాఖలు చేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుందని భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో తన సోదరికి బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న కవిత 11 కిలోలు బరువు తగ్గినట్లు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశాక ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో మనీశ్ సిసోడియాకు ఇప్పటికే బెయిల్ లభించినట్లు చెప్పారు. సుంకిశాల ప్రమాదాన్ని దాచిపెట్టారు సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమన్నారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును మొదలుపెట్టారని, అయితే దానిని నల్గొండ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా హైదరాబాద్‌కు నీటికష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం సుంకిశాల ఉపయోగపడుతుందన్నారు. కృష్ణానదికి నాలుగేళ్లు నీళ్లు రాకపోయినా ఈ ప్రాజెక్టు కారణంగా ఇబ్బందులు ఉండవన్నారు. అదే ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నీటికోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ హయాంలో ప్రణాళికలు రూపొందించామన్నారు. సుంకిశాల ఘటనను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలన్నారు. ఆగస్ట్ 2న ఉదయం 6 గంటలకు సుంకిశాల ప్రమాదం జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా? లేక విషయాన్ని దాచిపెట్టారా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోతే అది సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలిందన్నారు. పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుంకిశాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మున్సిపల్ శాఖను తనవద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటన ఎన్నికల సమయంలో జరిగినప్పటికీ దానిని దాచిపెట్టలేదన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లతో కలిసి సుంకిశాలను త్వరలో బీఆర్‌ఎస్ బృందం సందర్శిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతల చిల్లర ప్రచారానికి ప్రకృతే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 16 Author Report Share Posted August 16 Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు: రేవంత్ రెడ్డి 16-08-2024 Fri 13:19 | Telangana అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావును నియమిస్తారన్న రేవంత్ కవితకు బెయిల్ కూడా వస్తుందని వ్యాఖ్య కవితను రాజ్యసభకు పంపుతారని జోస్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని... విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని... వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted August 16 Report Share Posted August 16 Governor ante south Bihar ki a north Bihar ki antunna @Android_Halwa Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 16 Report Share Posted August 16 49 minutes ago, TOM_BHAYYA said: Governor ante south Bihar ki a north Bihar ki antunna @Android_Halwa Scene maripoindi kaka…ipudu Bihar ne maroka andhra ani antunaru…Bihar la opposition ollu law akd order ni chusi inkoka andhra laaga tayar ayitundi ani criticise chestunaru Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted August 16 Report Share Posted August 16 26 minutes ago, Android_Halwa said: Scene maripoindi kaka…ipudu Bihar ne maroka andhra ani antunaru…Bihar la opposition ollu law akd order ni chusi inkoka andhra laaga tayar ayitundi ani criticise chestunaru Aithe south andhra na north andhra na ? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 16 Report Share Posted August 16 3 hours ago, TOM_BHAYYA said: Aithe south andhra na north andhra na ? South north antha jaggadi time la.. Ipudu antha Chandra Pradesh antunaru.. Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted August 16 Report Share Posted August 16 5 hours ago, psycopk said: Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు: రేవంత్ రెడ్డి 16-08-2024 Fri 13:19 | Telangana అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావును నియమిస్తారన్న రేవంత్ కవితకు బెయిల్ కూడా వస్తుందని వ్యాఖ్య కవితను రాజ్యసభకు పంపుతారని జోస్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని... విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని... వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. Veedu enti Venu Swamy manchi completion isthunnadu… Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 17 Author Report Share Posted August 17 13 hours ago, megadheera said: Veedu enti Venu Swamy manchi completion isthunnadu… Deal set… announcement ee late Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 17 Author Report Share Posted August 17 Ktr comedy…to pacify pinkies KTR: రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు: కేటీఆర్ వ్యంగ్యం 16-08-2024 Fri 19:11 | Telangana బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఆయన చెప్పినటుంటి స్టోరీలు తానూ అల్లగలనని వ్యాఖ్య అమెరికాకు ట్రంప్ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమోనని వ్యంగ్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ విలీనమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి చెప్పినటుంటి స్టోరీలు తాను కూడా చాలా చెప్పగలనన్నారు. "రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అవుతాడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా... ఈయనే అవుతాడేమో మరి. ట్రంప్ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో" అని వ్యంగ్యంగా అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 17 Author Report Share Posted August 17 Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం... కేసీఆర్‌కు ఏఐసీసీ పదవి... కవితకు రాజ్యసభ: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు 16-08-2024 Fri 17:06 | Telangana సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం కోర్టులపై బురద చల్లవద్దని సూచన బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు రావడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, కవితకు బెయిల్ వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానంపై బురద జల్లి కోర్టుల ప్రతిష్ఠను దిగజార్చడం సరికాదన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు పెట్టుకొని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకే ఉందని గుర్తు చేశారు. ఇందులో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేస్తే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమే అన్నారు. కవితకు బెయిల్ విషయంలో కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రజలు ఛీత్కరించుకున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని... కాంగ్రెస్ ఉబలాటం చూస్తుంటే కవితను రాజ్యసభకు పంపినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీల తీరు "నేను కొట్టినట్లు చేస్తా... నువ్వు ఏడ్చినట్లు చెయ్" అన్నట్లుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా అనేక అంశాల్లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలను వెలికితీసి కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపించాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted August 17 Report Share Posted August 17 1 hour ago, psycopk said: Deal set… announcement ee late lol.. akkade unnava thatha deal set ayye tappudu… vileenam kaka pothe baga disappoint ayye laga unnav kada Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 17 Author Report Share Posted August 17 44 minutes ago, megadheera said: lol.. akkade unnava thatha deal set ayye tappudu… vileenam kaka pothe baga disappoint ayye laga unnav kada https://www.instagram.com/reel/C9NKwFPy8FE/?igsh=MWh6Y3k4Z2I0eHBlbQ== Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted August 17 Report Share Posted August 17 Kavita ki bail vaste, BRS, BJP tho merge ithee, peopels antha edavalaa vella drams chudatani ki? Congress kee benfit ayyiddii ee merging antaa Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted August 17 Report Share Posted August 17 6 hours ago, psycopk said: https://www.instagram.com/reel/C9NKwFPy8FE/?igsh=MWh6Y3k4Z2I0eHBlbQ== 😁 née time nadusthundi.. kaaniyyi 😁 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.