Jump to content

Revant and team at Google and Apple


psycopk

Recommended Posts

Revanth Reddy: కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి బృందం 

10-08-2024 Sat 14:37 | Telangana
Revanth Reddy visits Google head office
 

 

  • గూగుల్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు
  • నిన్న సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం
  • తెలంగాణను 'ఫ్యూచర్ స్టేట్' పిలుద్దామని పిలుపు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం

హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం 'ది ఫ్యూచర్ స్టేట్'కు పర్యాయపదంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిన్న ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరించారు.మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి... అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఔటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదమని, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని, అలాగే కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని గుర్తు చేశారు. భారత్‌లో రాష్టాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్నారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నామని... తెలంగాణ 'ఫ్యూచర్ స్టేట్'గా పిలుద్దామని ప్రకటించారు. 

ఈ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని... అందుకే అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.
Link to comment
Share on other sites

Telangana: కాలిఫోర్నియాలోని 'ఆపిల్ పార్క్‌'ను సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం 

09-08-2024 Fri 20:46 | Telangana
TG delegation visits Apple California headquarters
 

 

  • తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలను ఆపిల్ ఇంక్ ప్రతినిధులకు వివరించిన బృందం
  • పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అనువైన ప్రదేశమని సీఎం ట్వీట్
  • శంతను నారాయణన్‌తోనూ సమావేశమైన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి బృందం కాలిపోర్నియాలోని క్యూపర్టినోలోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం... టెక్ దిగ్గజ అధికారులకు వివరించింది.

ఆపిల్ పార్క్‌ను సందర్శించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనేక రంగాలలో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణకు అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో పలు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని... హైదరాబాద్, తెలంగాణ గురించి బలంగా గళం వినిపించడానికి అనువైన ప్రదేశమన్నారు.

తాను, తన సహచర మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు ఆపిల్ ఇంక్ ప్రతినిధులను కలిసి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ గురించి వివరించామన్నారు. తమ మధ్య స్నేహపూర్వక, ప్రోత్సాహకర చర్చలు జరిగాయని, ఇవి హైదరాబాద్‌కు, తెలంగాణకు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

శంతను నారాయణన్‌తో సీఎం భేటీ

కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ను కూడా సీఎం కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన ప్రకారం, ఇరువురి మధ్య స్నేహపూర్వక, ఫలవంతమైన చర్చలు జరిగాయి.

'అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయమైన టెక్ విజనరీలో ఒకరిగా, స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉన్న శంతను నారాయణ్‌ను కలవడం కూడా ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న నారాయణన్ హైదరాబాద్ 4.0 విజన్‌కు మద్దతివ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...