Jump to content

Jogi and jogi = budida


psycopk

Recommended Posts

Jogi Ramesh: చంద్రబాబు ఇంటిపై దాడి కేసు... జోగి రమేశ్‌కు నోటీసులిచ్చిన పోలీసులు 

13-08-2024 Tue 13:48 | Andhra
Mangalagiri police notices to Jogi Ramesh
 

 

  • మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు
  • కొడుకు రాజీవ్ అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేశ్
  • కక్ష సాధింపు రాజకీయాలు సరికాదని వ్యాఖ్య
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు, జోగి రమేశ్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి.

వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

కొడుకు అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేశ్

తన కొడుకును అరెస్ట్ చేయడం సరికాదని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అంతేకానీ అమెరికాలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈరోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు... కానీ కక్షసాధింపు చర్యలు మాత్రం సరికాదన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకు దూరంగా ఉంటే మంచిదన్నారు.
Link to comment
Share on other sites

Jogi Ramesh: మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. వీడియో ఇదిగో! 

13-08-2024 Tue 09:20 | Andhra
Agri Gold lands sale case ACB searches at former minister Jogi Ramesh house
 

 

  • అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్ 
  • సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు ఆరోపణలు 
  • ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నివాసంలో తనిఖీలు 
విజయవాడ అంబాపూరంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మందితో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 5 గంటలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. జోగి రమేశ్ ఇంట్లో సోదాల నేపథ్యంలో వైసీపీలో కలకలం రేగింది.
Link to comment
Share on other sites

Jogi Rajeev: జోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ 

13-08-2024 Tue 15:04 | Andhra
ACB Registered FIR on Jogi Rajeev
 

 

  • ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావుల పేర్లు
  • ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు కూడా   
  • సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద కేసు న‌మోదు
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది. అలాగే ఏ2గా జోగి వెంకటేశ్వరావు పేరు చేర్చింది ఏసీబీ.

వీరితో పాటు ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావుల‌ను కూడా చేర్చింది. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు. 

ఇదే వ్య‌వ‌హారంలో ఆగస్టు 8న అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో జయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు. 

మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారంటూ  విజయవాడ పోలీసులు నివేదిక ఇచ్చారు. దీంతో విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సర్వే జరపకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఏసీబీ నిర్ధారించింది. 

సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా నివేదిక‌ ఇచ్చినట్లు తేల్చింది. 87 సర్వేనెంబర్ సీఐడీ అటాచ్‌లో ఉందని ఏసీబీ గుర్తించింది. నున్న సబ్ రిజిస్ట్రార్‌ రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ తెలిపింది.
Link to comment
Share on other sites

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి బెయిల్ పిటిషన్ విచారణలో ట్విస్ట్ .. విచారణ మళ్లీ వాయిదా 

13-08-2024 Tue 08:50 | Andhra
Twist in Pinnelli bail petition hearing adjourned again
 

 

  • మొదట విచారించిన న్యాయమూర్తే విచారించాలన్న పోలీసుల తరపు న్యాయవాది
  • రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరపాలని కోరిన పిన్నెల్లి తరపు న్యాయవాది
  • పిటిషన్లను ఏ బెంచ్ విచారించాలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన న్యాయమూర్తి
  • విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది, ఈ పరిణామంతో విచారణ మరికొంత కాలం వాయిదా పడింది. సోమవారం హైకోర్టులో పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంలో, పోలీసుల తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.

అశ్వనీకుమార్ తన వాదనలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, బెయిల్ పిటిషన్లను ముందుగా విచారించిన న్యాయమూర్తే తర్వాత దాఖలయ్యే పిటిషన్లను కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్, పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్‌లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలింగ్ రోజున పాల్వాయిగేటు కేంద్రంలోకి అనుచరులతో కలిసి చొరబడి, ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మరుసటి రోజు కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిపి, సీఐ నారాయణస్వామిని గాయపర్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై రెంటచింతల, కారంపూడి పోలీసులు పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి, హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...